Search
  • Follow NativePlanet
Share

గడగ్ - చాళుక్యుల వైభవ ప్రదర్శన

30

కర్నాటక రాష్ట్రంలోని పడమటి భాగంలో దాగి వున్న చరిత్ర గడగ్ పట్టణం. ఈ పట్టణ విస్తీర్ణం 4656 చ. కి.మీ.లు మాత్రమే అయివుండటంతో పర్యాటకులను పెద్దగా ఆకర్షించదు. కాని భారతీయ కళలను ఇష్టపడే వారు గడగ్ పట్టణాన్ని అలరిస్తున్న వివిధ దేవాలయ సముదాయాల వైభవాలను తప్పక చూసి ఆనందిస్తారు.  

గడగ్ పట్టణంలో ఏం చూడాలి? ఏం చేయాలి?  గడగ్ దేవాలయాలు చాళుక్యుల కళా పిపాసకు నిదర్శనాలు. ఈ శిల్ప సంపద ఎంతో విభిన్నంగా ఉంటుంది. కొండరాతి గోడలు, దేవాలయాల గోడలపై  చెక్కడాలు వంటివి గత చరిత్ర వైభవాన్ని చాటుతూంటాయి.

గడగ్ లో అందరూ మెచ్చే ప్రదేశం అంటే త్రికూటేశ్వర దేవాలయం. యాత్రికులను ఆకర్షించేది దీని శిల్ప వైభవమే కాదు. ఈ దేవాలయానికి మతపర విశిష్టత కూడా ఉంది. ఈ యాత్రా స్ధలం శివ, బ్రహ్మ, విష్ణుమూర్తులైన త్రిమూర్తుల నిలయంగా ఉంటుంది. దీనితో పాటు గడగ్ లో దర్శించదగిన దేవాలయాలు వీర నారాయణ, డంబాల మరియు కాశీ విశ్వేశ్వర దేవాలయాలు. గడగ్ లో చూడవలసింది దేవాలయాలు వాటి శిల్ప సంపదలే కాదు. ప్రకృతి ప్రియులను మాగడి పక్షుల సంరక్షణాలయ జీవ వైవిధ్యం అబ్బుర పరుస్తుంది కూడాను. ఈ బర్డ్ శాంక్చువరీ గడగ్ పట్టణానికి 26 కి. మీ.ల దూరంలో ఉంది.

గడగ్ పట్టణ సందర్శనకు రైలు మార్గం అనువైనది. గడగ్ రైలు స్టేషన్ కలదు. ఇక్కడి నుండి దేశంలోని చాలావరకు అన్ని భాగాలకు  రైళ్ళు నడుస్తాయి. అయితే, ఈ పట్టణానికి సమీప విమానాశ్రయం 64 కి.మీ. ల దూరంలో హుబ్లీ వద్ద కలదు.

గడగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గడగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గడగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గడగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం గడగ్ పట్టణం రోడ్డు ద్వారా కర్నాటకలోని వివిధ పట్టణాలకు, బెంగుళూరు, మైసూరు, మంగుళూరు వంటి వాటితో కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులతో కలుపబడి ఉంది. గడగ్ వెళ్ళాలంటే చాలామంది బస్సు రవాణాను సౌకర్యవంతంగా ఎంపిక చేస్తారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గడగ్ రైలు జంక్షన్ పట్టణ సమీపంలో సుమారు రెండు కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఇది చాలా చిన్న స్టేషన్. హుబ్లీ మరియు గుంటకల్ పట్టణాలను వయా హోస్పేట కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    గడగ్ పట్టణం చేరడం ఎలా? విమాన ప్రయాణం గడగ్ పట్టణానికి హుబ్లీ విమానాశ్రయం 64 కి.మీ. దూరంలో సమీప విమానాశ్రయం. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పట్టణానికి 414 కి.మీ. దూరంలో ఉంటుంది. దీని ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణీకులు గడగ్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat