ప్రశాంతమైన నడక, సన్ బేధింగ్, లేదా మధ్యాహ్నం వేళ స్ధానిక ఆహారాలు, ఆల్కహాలు తాగి, ప్రశాంతమైన నిద్ర వంటివి ఆచరించాలనుకునేవారికి ఈ బీచ్ తగినది. ఇక్కడ కూడా పూరి పాకలుంటాయి. హాకర్లు, బ్రోకర్లు వంటి వారు ఇక్కడ ఉండరు. బీచ్ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండి తీరం వెంబడి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉంటాయి.బంగారు రంగు ఇసుకతో బీచ్ నిండి ఉంటుంది.
ఉటోర్డా బీచ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోల్వా బీచ్ పక్కనే ఉంది. ఇక్కడ రోజంతా లైఫ్ గార్డులుండటంచే సురక్షితంగా ఈత కొట్టవచ్చు. జీబాబ్ షాక్ మార్టిన్ కార్నర్ గా చెప్పబడే ఒక రెస్టరెంటు మీరు తప్పక ఆనందించాలి. ఉటోర్డా చేరటం తేలిక. కోల్వా నుండి అద్దె బైక్ లేదా క్యాబ్ లో చేరవచ్చు. ఉటోర్డా పాణాజింకు సుమారు 30 కి.మీ.ల దూరంలో ఉంటుంది.