అంజునా   - అంతులేని విశ్రాంతి!

అంజునా బీచ్ కు రోడ్డు సదుపాయం కలదు. కండోలిం బీచ్ ప్రాంతంనుండి సుమారు 3 కి.మీ.ల రోడ్డు ప్రయాణం. అంజునా లోకొన్ని ఖరీదైన హోటళ్ళు ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేస్తే చక్కటి విందు ఆరగించవచ్చు. ఈ బీచ్ ఎంతో పరిశుభ్రం. పర్యాటకులు ఇక్కడికి వస్తే చాలు ఎంతో ప్రశాంతత పొందుతారు. వాణిజ్య పర కార్యకలాపాలు అసలు ఉండవు. అంజునా వస్తే ఇక్కడి గుడిసెలలో కనీసం ఒక మధ్యాహ్నం గడపాలి. బీచ్ అలల ఆనందం అనుభవిస్తూ చల్లటి బీర్  ఆస్వాదిస్తూ గడిపేస్తేనే కాని మీరు ఆనందించినట్లు కాదు. ఈ బీచ్ లో పుస్తకాల ప్రియులకు మరింత ఆనందం కలిగి వాటిలో ముణిగిపోతారు. వారికి అది ఒక స్వర్గంలా ఉంటుంది.

ప్రశాంతంలో మీ ల్యాప్ టాప్ ఇ మెయిల్స్ చెక్ చేసుకోవడం ఇతర పనులు చేసుకోవడం వంటివి ఆనందం కలిగిస్తాయి.  మీరు ఈ గుడిసెలలో ఎంత పని చేసుకున్నప్పటికి మీ హాలీడే మూడ్ అదే రకంగా కొనసాగుతుంది. ఈ గుడిసెలను ఇక్కడ కర్లీలు అంటారు. కర్లీలో రెండు భాగాలుంటాయి. పై భాగం అందమైన బీచ్ చూపుతుంది.  అంజునా బీచ్ ప్రత్యేకత అంటే అది చాలా లోతైన బీచ్. కనుక లైఫ్ గార్డులను అక్కడే రోజంతా ఉంచుతారు. మీరు బీచ్ లో తింటూ, తాగుతూ, పని చేసుకుంటూ మధ్య మధ్యా ఈత కూడా కొట్టవచ్చు.

ఈ కర్లీలకు సమీపంలోనే అంజునా సెకండ్ హ్యండ్ వస్తువుల మార్కెట్ ఉంది. వారాంతపు సెలవులలో పెట్టే ఈ మర్కెట్ లో మీరు మెచ్చే అనేక వస్తువులు, బ్యాగులు, ఫుట్ వేర్, ఇంకా ఇతర ఫ్యాషన్ వస్తువులు గోవా అభిరుచులలో కొనుగోలు చేసుకోవచ్చు. హడావుడి లేకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా తమ సెలవులు గడపాలనే వారికి అంజునా బీచ్ చాలా బాగుంటుంది.    అంజునా బీచ్, బాగా లేదా కాలన్ గూటే బీచ్ లకు కొద్ది దూరంలోనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా, ఉత్తరం వైపుగా నడవటమే. అయితే, ఇక్కడకల రోడ్లు కొంచెం గందరగోళం కలిగిస్తాయి. లేదా ఒక క్యాబ్ లో ప్రయాణించండి. నడవాలనుకుంటే, ప్రతి 5 నిమిషాలకు మార్గాన్ని విచారిస్తూ నడవండి.     

Please Wait while comments are loading...