బాదామి లేదా వాతాపి - చాళుక్య వంశ రాజుల రాజధాని నగరం

ఉత్తర కర్నాటక లోని బాగల్ కోట జిల్లాలో బాదామి ఒక పురాతన పట్టణం. చాళుక్య రాజులు దీనిని 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు తమ రాజధానిగా చేసుకొని పాలించారు.  బాదామి చరిత్రబాదామి పట్టణం షుమారుగా రెండు శతాబ్దాలపాటు చాళుక్యులకు రాజధానిగా ఉండేది. చాళుక్యుల సామ్రాజ్యం ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలలో చాలా భాగాన్ని 6 నుండి 8 శతాబ్దాలవరకు పాలించింది. పులకేశి II పాలనలో ఈ వంశం తారాస్ధాయికి చేరింది. చాళుక్యుల పతనం తర్వాత బాదామి దాని ప్రాభవాన్ని కోల్పోయింది.

భాదామి ఒక లోయ. దీని చుట్టూ బంగారు వన్నెకల ఇసుక కొండలు. అప్పటికాలంలో బాదామిని వాతాపి అని కూడా పిలిచేవారు. అప్పటిలో దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో అత్యధిక దేవాలయాల నిర్మాణం సాగేది. బాదామి అందమైన దాని గుహ దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాలు లోయ మధ్య ప్రదేశంలోని అగస్త్య సరస్సు వద్ద జరిగేవి.  

బాదామి గుహ దేవాలయాలు బాదామిలో నాలుగు గుహ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మూడు హిందువులవి కాగా నాలుగవది జైన్ దేవాలయం.  

మొదటి గుహ  గుహ దేవాలయాలలో మొదటిది భగవాన్ శివుడికి చెందినది. ఈ విగ్రహం అయిదు అడుగుల నటరాజ విగ్రహం. 18 చేతులు తో ఉండి వివిధ ముద్రలు లేదా నాట్య భంగిమలు కలిగి ఉంటుంది. ఈ గుహలో చక్కటి మహిషాసురమర్దిని విగ్రహం కూడా ఉంది.

రెండవ గుహ  రెండవ గుహలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటుంది. పెద్ద పెద్ద శిల్పాలు కల భూవరాహ మరియు త్రివిక్రమ రూపాలు ఈ గుహ తూర్పు మరియు పడమర గోడలకు చెక్క బడ్డాయి. సీలింగ్ పై భాగంలో బ్రహ్మ, విష్ణు, శివ, అనంతశయన, అష్టాదిపాలకుల మూర్తులు ఉంటాయి.  

మూడవ గుహ మూడవ గుహ ఎంతో అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది.  బాదామి అపురూప శిల్ప సంపద అంతా అందులోనే ఉంటుంది. దీనిలో అనేక హిందూ దేవతలు మూర్తులు చెక్కబడ్డాయి. దీనిలోని గోడలపై చెక్కబడిన లిపి ఆధారంగా ఈ దేవాలయం క్రీ.శ 578 కి చెందబడినదిగా చెప్పవచ్చు.

నాలుగవ గుహ నాలుగవ గుహ జైన్ దేవాలయం. ఇందులోని ప్రధాన మూర్తులు జైన్ రుషులు...మహావీర మరియు పార్శ్వనాధులు. ఈ దేవాలయం లోని కన్నడ లిపి మేరకు ఇది 12వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.   గుహ దేవాలయాలే కాక, మూడు శివ మందిరాలు కూడా ఉత్తర కొండపై ఉన్నాయి. వీటిలో మాలేగట్టి శివాలయ చాలా ప్రసిద్ధి. ఇతర దేవాలయాలు భూతనాధ దేవాలయం, మల్లికార్జున దేవాలయం, దత్తాత్రేయ దేవాలయం. బాదామిలో ఒక కోట గూడా ఉంది. ఇందులో కూడా అనేక దేవాలయాలున్నాయి. కొండలు ఎక్కటంలో ఆసక్తి కలవారు ఈ కొండలు ఎక్కేందుకు ప్రయత్నించవచ్చు.  

బాదామి ఒక అద్భుత ప్రదేశం. లోయ దాని పురాతన గుహ దేవాలయాలు, కోట ఎంతో ఆకర్షణగా ఉంటాయి.  చాళుక్యుల కాలంనాటి శిల్ప సంపదలు చూడాలంటే బాదామి దేవాలయ సముదాయాలు తప్పక సందర్శించాల్సిందే.  

Please Wait while comments are loading...