గాలిబోర్ - అడవుల మధ్యలో ఉన్న అద్భుత పర్యాటక స్ధలం

కర్నాటకలోని బెంగుళూరుకు 110 కి.మీ. దూరంలో ఉన్న గాలిబోర్ ప్రకృతిలోని సహజ అందాలకు నిలయంగా ఉంటుంది. సంగం కు ఇది 10 కి.మీ. దూరంగా ఉంటుంది. ఆర్కావతి మరియు కావేరి నదుల సంగమం ఈప్రదేశం. ఈ ప్రదేశం నివాస ప్రదేశం కాదు. కావేరి వన్య ప్రాణ సంరక్షణాలయ అడవులు మధ్యలో కలదు.  గాలిబోర్ ప్రాంతం ఫిషింగ్ మరియు నేచర్ క్యాంపులకు ప్రసిద్ధి. కావేరి నది ఒడ్డున పచ్చటి చెట్ల నడుమ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడే ఉన్న గాలిబోర్ అనే ఒక కొండ పేరును ఈ ప్రాంతానికి పెట్టారు. చుట్టూతా పర్వత శ్రేణులుంటాయి. కావేరి నది ఒడ్డున పచ్చని ప్రదేశంలో ఉంది.

గాలిబోర్ పై పర్యాటకులకు ఎందుకు ఆసక్తి కలుగుతుంది?  

ప్రకృతిమాత ఒడిలో ఒరిగి విశ్రాంతి పొందాలనుకునేవారు సెలవులు వచ్చేశాయంటే చాలు ఈ ప్రదేశానికి తరలి వెళతారు. చేపలు పట్టేందుకు అనువైన ప్రదేశం. చేపట గాలంలో నిపుణులు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. అయితే, ఈ ప్రదేశంలోని చేపలను పట్టుకోవడం మరల వదిలేయడం అనే సిద్ధంతంపైనే ఇక్కడ అనుమతిస్తారు. పట్టిన చేపను ఫొటో తీయడం, మరల దానిని నదిలో వదిలేయడం చేస్తారను.  జాలర్లు ఎక్కువగా మహసీర్ చేపలకు ప్రయత్నిస్తారను. ఈ చేప కావేరి నదిలో అధికంగా దొరుకుతుంది. దీనితో పాటు ఇంకా కార్ప్, కేట్ ఫిష్ వంటి చిన్న చేపలకు కూడా ప్రయత్నిస్తారు. జంతుజాలాలు, పక్షుల గమనం వంటివి కూడా చేస్తారు. గాలిబోర్ లో సుమారు 220 పక్షుల రకాలుంటాయని చెపుతారు. సెలవుల సమయంలో చాలామంది వచ్చి వీటిని గమనించి ఆనందిస్తారు.

సంబార్, మచ్చల లేడి, ఏనుగులు, చిరుతపులులు, అడవి ఎలుగులు, అడవి ఉడుతలు, మలబార్ అడవి ఉడుతలు, గుంట నక్కలు, కొండ చిలువలు, నాగుపాములు, వైపర్లు, వంటివి ఎన్నో గాలిబోర్ లో చూడవచ్చు. మొసళ్ళు , తాబేళ్ళు, ఊసర వెల్లులు సైతం మీకు కనపడతాయి.

గాలిబోర్ ఎపుడు సందర్శించాలి?  గాలిబోర్ లో బోట్ ప్రయాణాలుంటాయి. కనుక నీటి ఆట ఔత్సాహికులు అడవి లోతట్టు ప్రాంతాల నదిలోకి కూడా ప్రయాణించవచ్చు. గాలిబోర్ ను సందర్శించాలంటే జూన్ మరియు ఆగస్టు నెలలు అనుకూలం. ఈ సమయంలో నీటి ఆధారిత పక్షులు అనేకం అక్కడకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి మే మధ్య వరకు చేపలు పట్టేందుకు అనుకూలమే.

గాలిబోర్ నగరానికి దగ్గర అవడంతో వివిధ కంపెనీల వారు ఈ విహార ప్రదేశంలో తమ సిబ్బందితో మీటింగులు సైతం పెట్టుకుంటారు. ట్రైనింగ్ ప్రోగ్రాములు పెడతారు. ఈ ప్రదేశానికి రోడ్డు సదుపాయం బాగా ఉండి. బెంగుళూరు నుండి కనకపుర సంగం రోడ్డు మీదుగా రెండు గంటలలో చేరవచ్చు.

Please Wait while comments are loading...