Search
  • Follow NativePlanet
Share

సంగమం - నదులు కలిసే ప్రదేశం

9

బెంగుళూరు నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ ప్రదేశం వివిధ ప్రకృతి దృశ్యాలతో రమణీయ ప్రదేశం. ఈ ప్రదేశంలో అర్కావతి నది కావేరి నదితో కలిసి ప్రవహిస్తుంది.

ఈ ప్రదేశం చేరాలంటే బెంగుళూరు నుండి సుమారు రెండు గంటలు పడుతుంది. అయితే, బెంగుళూరు నుండి సంగమం చేరే వరకు కూడా ఎంతో మనోహరంగా ఆనందించవచ్చు. ఆశించని మలుపులు, ఎత్తులు, పల్లాలు  కల రోడ్డు మిమ్మల్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతుంది. ఇక నదులు చూసే సరికి మీ ఆనందం అవధులు దాటుతుంది. సంగం లోని నదులు, మీకు చక్కటి స్నానం చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తాయి.

సంగం ప్రదేశానికి వెళ్ళే వారు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ వంటివి కూడా చేయవచ్చు. ఇదే ప్రదేశంలో చూడదగినది మరో మంచి ప్రదేశం అంటే... మేకే దాటు. ఇది సంగం కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కావేరి చాలా లోతుగా ప్రవహిస్తుంది. మేకే దాటు అంటే, మేక అనగా గోట్ అని ఒక పులి తరుముతూంటే ఆమేక దానిని తప్పించుకొని ఈ ప్రదేశాన్ని దాటిందని అపుడు పులి దానిని ఏమీ చేయలేకపోయిందని, కనుక దీనికి ‘మేకే దాటు’ అన్న పేరు వచ్చిందని చెపుతారు. ఆ మేకకు ఈ ప్రదేశంలోని కొన్ని అద్భుత శక్తులు సంక్రమించాయని అందుకనే దాటివేసిందని  కూడా స్ధానికులు చెపుతారు. 

మేకే దాటు ప్రాంతాన్ని వర్షాకాలం తర్వాత నదులు పూర్తి స్ధాయిలో ప్రవహిస్తున్నపుడు చూస్తే ఆనందంగా ఉంటుంది. ఇక్కడకు చేరాలంటే రోడ్డు మార్గం మాత్రమే. బెంగుళూరు, సమీప పట్టణం కనకపురలనుండి బస్సులు ప్రయాణిస్తాయి.

సంగమం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సంగమం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సంగమం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సంగమం

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ కనకపుర నుండి బస్సులను నడుపుతుంది. సంగమ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో మేకే దాటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ప్రతి రోజూ ఉంటాయి. ఎంతో సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - సంగమ ప్రదేశానికి రైలు స్టేషన్ లేదు. సంగమ - మేకే దాటు కు బెంగుళూరు రైలు స్టేషన్ 118 కి.మీ. ల దూరంలో ఉంది. దేశంలోని వివిధ నగరాలు అంటే, ఢిల్లీ, ముంబై, చెన్నై, పూనె, కోల్ కటా వంటి ప్రదేశాలనుండి బెంగుళూరు చేరవచ్చు. అక్కడనుండి టాక్సీలు, క్యాబ్ లలో సంగమ మేకే దాటు తేలికగా ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సంగమం ఎలా చేరాలి? విమాన ప్రయాణం - సంగమ - మేకే దాటు ప్రదేశానికి సమీప విమానాశ్రయం, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది దేశీయ, విదేశీయ పర్యాటకులకు ఉపయోగపడుతుంది. ఈ ప్రదేశం బెంగుళూరు విమానాశ్రయానికి సుమారు 136 కి. మీ దూరం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue