Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాలన్ గూటే » ఆకర్షణలు » క్లబ్ క్యూబనా

క్లబ్ క్యూబనా, కాలన్ గూటే

1

గోవాలో పార్టీలు చేసుకోవాలంటే, క్లబ్ క్యూబనా మంచి ప్రదేశమని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. ఆసియాలో ఈ ప్రదేశం ఒకటే రాత్రంతా తెరచి ఉండే ప్రదేశంగాను అంటే, రాత్రంతా ఆనందించినప్పటికి  ఏ పోలీస్ జోక్యం లేదా ఏ దుండగుల దాడి ఉండవని చెపుతారు. పార్టీలు చేసుకోవాలంటే అధిక సంఖ్య జనాలను కూడా ఈ ప్రదేశం వసతి చేయగలదు.

ఇక్కడ జరిగే పార్టీలలో అపుడపుడు మీరు ఒక హాలీవుడ్ లేదా బాలీవుడ్ సెలిబ్రిటీలను కూడా చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశమధ్య భాగంలోనే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ మరియు జాకుజ్జి సముద్ర తీరం అంతా కనపడుతూ ఒక కొండపై ఉండే ఓపెన్ ఎయిర్ నైట్ క్లబ్ వంటివి కూడా కలవు. కొన్ని ప్రాంతాలలో తాటి చెట్లు కూడా ఉండి మీకు బయలు ప్రాంతంలో ఉన్న భావనలు కలిగిస్తాయి. ఆకర్షణీయమైన డేన్స్ ఫ్లోర్ కూడా కలదు. ఈ ప్రదేశాన్ని అధిక సంఖ్యాకులు ఇష్ట పడతారు. ఆహారాలు తక్కువ ఇస్తారన్న పేరున్నప్పటికి, మీరు చక్కటి బీర్, వైన్ వంటి పానీయాలు తాగుతూ ఆనందించేయవచ్చు. క్లబ్ క్యూబనా ను ఒక యూరోపియన్ కుటుంబం నడుపటం చేత అది అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకే తెరచి ఉంటుంది. దీని ప్రవేశ రుసుము షుమారు రూ.1200 గా ఉంటుంది.   అయితే, ఇక్కడ లభించే ఆహారాలు, డ్రింకులకు ఆ మాత్రం రుసుము సమంజసమైనదిగానే భావిస్తారు. మీరు గోవా వచ్చినపుడు తప్పక ఈ ప్రదేశం చూసి ఆనందించాలి. పార్టీ ఆనందాలు అద్భుతంగా మీరు భావిస్తారు. క్లబ్ సుమారుగా 3000 మంది వ్యక్తులవరకు సామర్ధ్యం కలిగి ఉంది. అంతకంటే అధికంగా అందులో పట్టినప్పటికి  ఆశ్చర్యంలేదు. మీ పార్టీ చేసుకునే ఆనందాలు మాయం కావు. మరింత పెరుగుతాయి.

క్లబ్ క్యూబనాకు చేరుకోవడం కూడా తేలికే. ఇది కాలన్ గూటే ప్రాంతంలో కలదు. అయితే, మీరు మీ స్వంత వాహనంలో వెళ్ళమని మా సూచన. క్యాబ్ లు ఉన్నప్పటికి మీరు పార్టీలో అధిక లిక్కర్ సేవించి బయటకు క్యాబ్ లలో వచ్చే కంటే, స్వంత వాహనాలు సూచించదగినవి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed