మే డీ డియుస్ అంటే దేముడి తల్లి అని అర్ధం. ఈ చర్చి మోటుగా నిర్మాణం కలిగి ఉంటుంది. నార్త్ గోవాలో చాలా ప్రసిద్ధి. ఎన్నో చర్చిలు కల గోవా రాష్ట్రంలో నార్త్ గోవాలోని అనేక ఆకర్షణలలో ఈ చర్చి మరొక ఆకర్షణ. బాగా కాలన్ గూటే, కండోలిం ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది. ఇది ఒక చిన్న చర్చి మీరు చూసేందుకు అర్ధగంట సమయం కన్నా అధికంగా పట్టదు.ఒక సారి దర్శించుకోవటం, ప్రార్ధించుకోవటం లతో మీరు తక్కువ సమయంలో బయటపడవచ్చు. దీని చుట్టుపట్ల ప్రదేశాలు పచ్చగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆహ్లాదంగా భావిస్తారు. రోజంతా షాపింగ్ లేదా బీచ్ లలో గడిపిన వారికి ఈ చర్చి సందర్శనలో కొద్దిపాటి సమయం గడపటం ఎంతో హాయినిస్తుంది. కొత్త చర్చి కావటం వలన అంటే సుమారుగా 1873 సంవత్సరం నాటితే కావటం వలన దీని నిర్వహణ ఎంతో తేలిక కనుక ఆకర్షణీయంగానే ఉంటుంది. ఒక సారి దర్శిస్తే చాలు మరో మారు తప్పక చూడాలనిపిస్తుంది. ప్రవేశం ద్వారం ఎంతో పెద్దదిగా ఉండి వెండి గంటలు వేలాడటం ఆకర్షణగా ఉంటుంది. ఫొటోగ్రాఫర్లకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఈ చర్చిలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్య దేవత నొస్సా సెన్ హోరా విగ్రహం ఉంటుంది. దీనిని పురాతన గోవాలోని మే డి డియూస్ చర్చి శిధిలాలనుండి రవాణా చేసి ఇక్కడ ప్రతిష్టించారు. మే డి డియూస్ కు చేరటం చాలా తేలిక. ఇది పనాజిం నుండి 13 కి.మీ.ల దూరం మాత్రమే. మాపూసా పట్టణానికి వెళ్ళే దోవలోనే ఉంటుంది. నార్త్ గోవా పర్యాటకులకు, నివాసితులకు అందిపుచ్చుకునే దూరంలా ఉంటుంది. వాస్కోడా గామా, పనాజిం, మార్గోవా లనుండి క్యాబ్ లో చేరటం తేలిక. లేదా ఒక బైక్ అద్దెకు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఈ చర్చిని సాలిగాంవ్ గోధిక్ చర్చి అని కూడా పిలుస్తారు.