Search
  • Follow NativePlanet
Share

కర్నాల - కోట పట్టణం

13

కర్నాల ప్రసిద్ధిచెందిన కోట పట్టణం. ఇది మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో కలదు. ఇరుపక్కలా ఎత్తైన కొండలతో దట్టమైన అడవులలో సముద్రమట్టానికి షుమారు 439 మీ.ల ఎత్తున కలదు.

చరిత్ర ప్రాధాన్యత తుగ్లక్ లు మన దేశాన్ని పాలించినపుడు కర్నాల పట్టణం కొంకణ్ జిల్లాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. దీనిని అహ్మద్ నగర్ వ్యవస్ధాపకుడు నిజాం షా స్వాధీనపరచుకున్నాడు. పోర్చుగీసు పాలకులతో తాము చేసిన స్నేహానికిగాను కర్నాలాను వారు నిజాం పాలకులకు బహుమతిగా ఇచ్చేశారు.  

ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటీష్ పాలనను ఈ ప్రాంతంలో అమలు చేయకముందే వారు భౌగోళిక రీత్యా ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించారు.  

ప్రకృతి ఒడిలో అలరారే కర్నాల ప్రదేశం కర్నాలలోని పక్షి సంరక్షణాలయం ప్రకృతి ప్రేమికులకు, పక్షి సందర్శకులకు ఎంతో ప్రియమైనది. ఈ శాంక్చురీ లో షుమారు 150 జాతుల పక్షులు నివసిస్తూండగా మరో 37 రకాలు వలసలు వచ్చి పోతూంటాయి. పర్యాటకులు మెచ్చే ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ సదుపాయాలు కూడా కలవు.

విశ్రాంతి పొందగోరేవారు ప్రేమించే వాతావరణం సంవత్సరం పొడవునా కర్నాల్ లో కొనసాగుతుంది. చక్కటి హిల్ స్టేషన్. వర్షమైనా, ఎండ అయినా, ఈ ప్రదేశంలో మిమ్ములను ఆనందపరచేదిగానే ఉంటుంది.  

వర్షాలు పడితే చాలు, ఇక్కడి వాతావరణం అంతా మారిపోతుంది. ప్రకృతి పరవశించి పోతుంది. పర్యాటకులకు అద్భుత ఆనందాలనిస్తుంది. శీతాకాలం అయితే చాలు పక్షుల వలసలు మొదలై కిల కిలా రావలతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.  వారాంతపు సెలవులలో   కొద్దిపాటి విశ్రాంతి పొందగోరే వారికి కర్నాల హిల్ స్టేషన్ అనుకూలం. దీనికి రైలు మరియు రోడ్డు, మరియు విమాన ప్రయాణ సౌకర్యం కలదు. ముంబై నగరానికి అతి సమీపంగా 60 కి.మీ.ల దూరంలో ఉంటుంది. పానావెల్ కు సుమారు 10 కి.మీ.ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడినుండి బస్, ట్రైన్ లేదా టాక్సీలలో చేరవచ్చు.

కర్నాల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కర్నాల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కర్నాల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కర్నాల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కర్నాలకు రోడ్డు ప్రయాణం తేలిక. 52 కి.మీ.ల దూరం కల ముంబై నుండి లేదా 14 కి.మీ.ల దూరంలో కల పాన్వేల్ నుండి ప్రభుత్వ లేదా ప్రయివేట్ బస్ లలో కర్నాల చేరవచ్చు. పాన్వెల్ నుండి గోవా జాతీయ రహదారిలో కర్నాల చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కర్నాలకు పాన్వెల్ సమీప రైలు స్టేషన్ సుమారు 10 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడినుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి సుమారు రూ. 200 ఛార్జీతో టాక్సీలో కర్నాల చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కర్నాలకు 54 కి.మీ.ల దూరంలో ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు ప్రతిరోజూ విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం బయట కల టాక్సీలు, క్యాబ్ లలో కర్నాల తేలికగా చేరవచ్చు. ఛార్జీలు సుమారుగా రూ. 1200 వరకు ఉంటాయి. పూనే లోని లోహేగాంవ్ విమానాశ్రయం రెండవ సమీప విమానాశ్రయం. సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue