Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జున్నార్

జున్నార్ - ప్రాచీన చరిత్రకు నిదర్శనం

15

దేశీయ పర్యాటకులకు అధిక ఆకర్షణకల పర్యాటక ప్రదేశం జున్నార్ మహారాష్ట్రలోని పూనే జిల్లాలో కలదు. జున్నార్ పట్టణం దాని మతపర, చారిత్రక మరియు పౌరాణిక ఆకర్షణలకు ప్రసిద్ధి. ఎన్నో పురాత దేవాలయాలు, చక్కగా ఆకర్షించే గుహలు, మరియు కోటలు వంటివి ఇక్కడ కలవు.  సహ్యాద్రి పర్వత శ్రేణులలో కల జున్నార్ పూనేకు ఉత్తర దిశగా సుమారు 94 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ పట్టణం సముద్రమట్టానికి సుమారు 2260 అడుగుల ఎత్తుకంటే అధికంగా కలదు.

జున్నార్ - ఒక చారిత్రక ప్రదేశం జున్నార్ చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. సుమారు వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ చారిత్రక స్ధలం శివనేరి కోటకు సమీపంలో కలదు. శివనేరి కోట ప్రఖ్యాత మరాఠా పాలకుడు  ఛత్రపతి శివాజీ రాజ భోస్లే జన్మస్ధలం.   జున్నార్ మొదటగా జిమా నగర్ అని పిలువబడేది. శక రాజ వంశ పాలనలో రాజు నహాపాన్ కు ఈ ప్రదేశం ప్రధాన నగరంగా వ్యవహరించింది. తర్వాతి కాలంలో దీనిని శాతవాహన రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఎంతో వ్యూహాత్మకంగా అప్పటి వాణిజ్య మార్గమైన నానేఘాట్ పై ఒక కన్ను వేసి పర్యవేక్షించాలని శివనేరి కోటను నిర్మించాడు.  శిల్పకళలకు కేంద్రం జున్నార్ పట్టణం దాని శిల్ప సంపదలతో ప్రసిద్ధి గాంచటానికి, కారణం జున్నార్ గుహలని చెప్పాలి. ఇక్కడ మూడు గుహల సముదాయాలు కలవు. మన్మోడి హిల్ గ్రూప్, గణేష్ లేనా గ్రూప్ మరియు తులిజా లేనా గ్రూప్ అని మూడు గ్రూపుల గుహలు కలవు. అన్ని గుహలలోను అందమైన రాతి శిల్ప కళా వైభవం కనపడుతుంది.  

ఈ గుహలే కాక, ఇక్కడే కల మరో 30 లేన్యాద్రి గుహలు ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేశాయి.  జున్నార్ ఆకర్షణ వెనుకగల వాస్తవం ఏమంటే, ఈ ప్రాంతంలో  చిరుత పులులు అధికంగా నివసిస్తాయి. షుమారు 500 చ.కి.మీ.ల పరిధిలో ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలతో తేలికగా చేరుకోవచ్చు కూడాను. అన్నిటికి మించి ఈ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉండే ఆహ్లాదకర వాతావరణం కూడా పర్యాటకులకు ఇది ఒక మంచి విహార స్ధలంగా భావించబడుతుంది.  

జున్నార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జున్నార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జున్నార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జున్నార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి ప్రభుత్వ బస్సులు లేదా ప్రయివేటు బస్సులు రెండూ అందుబాటులో ఉంటాయి. పూనే నుండి ప్రతి గంటకు ఒక బస్ జున్నార్ కు బయలుదేరుతుంది. బస్ ప్రయాణం సుఖవంతం కానప్పటికి ప్రయాణపు ఛార్జీలు చవకగా పర్యాటకులకు అందుబాటులోనే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం జున్నార్ కు పూనే రైలు స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఈ రైలు స్టేషన్ నుండి ముంబై, నాగపూర్ వంటి నగరాలకు ప్రతిరోజూ రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి టాక్సీలు, బస్ లలో జున్నార్ చేరుకోవచ్చు. రైలు ప్రయాణం తక్కువ ధరలు, సౌకర్యం ఎక్కువ కనుక సూచించదగినది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జున్నార్ కు విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 154 కి.మీ.ల దూరంగా ఉంటుంది. ఈ విమానాశ్రయం అన్ని ప్రధాన పట్టణాలకు, నగరాలకు మహారాష్ట్ర వెలుపలి ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయంనుండి జున్నార్ చేరేందుకు బయట అనేక టాక్సీలు లభ్యంగా ఉంటాయి. ప్రయాణపు ధర ప్రతి కిలో మీటర్ కు సుమారు రూ. 7 గా చెల్లించాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun