Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » వాతావరణం

పూణే వాతావరణం

దర్శించడానికి ఉత్తమ కాలం :శీతాకాలం లో గాని వర్షా కాలంలో గాని పూణే నగరాన్ని దర్శించవచ్చు.

వేసవి

పూణే – వాతావరణం :పూణే నగరంలో ఏడాది పొడవునా హాయి అయిన వాతావరణం వుంటుంది. పొడిగా, తడిగా ఉండే ఉష్ణ మండల వాతావరణం ఇక్కడ వుంటుంది. వాతావరణం అటు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గాని ఉండక పోవడంతో, పూణే ఎప్పుడైనా, ఎల్లప్పుడూ దర్శించదగ్గ స్థలం.వేసవి :వేడిగా వుండే వేసవి మార్చ్ నుంఛి జూలై నెల దాక వుంటుంది. ఉదయం చల్లగా మొదలై, రోజు గడిచే కొద్దీ వేడి పెరుగుతుంది. కానీ రాత్రులు మాత్రం గాలి వీచి  హాయిగా వుంటుంది. ఉష్ణోగ్రత సాధారణంగా  38 నుంచి 20 డిగ్రీల దాకా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం :జూలై మధ్య నుంచి అక్టోబర్ దాక వర్షాకాలం. ప్రతి ఏటా ఇక్కడ వర్షాలు బాగా కురుస్తాయి, ఉష్ణోగ్రత కూడా 18 నుంచి 30 డిగ్రీల మధ్యే ఉంటుంది. ఈ కాలంలో నగరం అంటా పచ్చదనం పరుచుకుని వుంటుంది.

చలికాలం

శీతాకాలం :యాత్రికులు చాల మంది పూణేకి శీతాకాలం లో రావడానికి ఇష్టపడతారు. నవంబర్ లో మొదలై ఫిబ్రవరి దాక వుండే శీతాకాలంలో పగళ్ళు, రాత్రులు కూడా చల్లగానే ఉంటాయి. ఉష్ణోగ్రత 12 డిగ్రీల వద్దే ఉంటుంది. ఇది రద్దీగా వుండే కాలం కావడం వల్ల హోటల్ గదుల రేట్లు కూడా తారా స్థాయిలో వుంటాయి.