Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అహ్మదాబాద్

అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !

105

నగరానికి దాడుల నుండి రక్షణ గా ఉండడానికి సుల్తాన్ అహ్మద్ యొక్క మనవడు మహ్మద్ బేగ్డా చేత నిర్మించబడిన 10కిలో మీటర్ల పరిధి కలిగిన గోడ కి పన్నెండు గేట్లు, 189 కోట బురుజులు, 6000 కు పైగా పిట్టగోడలు కలవు. అద్భుతమైన నగిషీలతో ఈ గేట్లు అన్ని అలంకరించబడి ఉన్నాయి. కొన్ని గేట్లకి బాల్కనీలు కూడా కలవు. మొఘలుల కాలం లో సామ్రాట్ అఖ్బర్ చేత ఆహ్మేదాబాద్ అక్రమించబడింది. అయితే ఈ ప్రాంతం లో తమదైన ముద్ర లు మిగిల్చిన మొఘల్ రాజు మాత్రం షాజహాన్. షాహీ బాగ్ లో ఉన్న మోతీ షాహి మహల్ షాజహాన్ చే నిర్మించబడింది.

గాంధీ ప్రభావం బ్రిటిష్ వారి పరిపాలన లో మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో ముందుకు సాగిన భారతీయ స్వాతంత్ర ఉద్యమం వల్ల ఈ నగరం అమితంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తుతం సబర్మతి ఆశ్రమం గా పిలువబడే సబర్మతి నది ఒడ్డున ఉన్న సత్యాగ్రహ ఆశ్రమం అలాగే ఆహ్మేదాబాద్ లో ఉన్న కోచ్రబ్ ఆశ్రమాలనీ గాంధీ గారు స్థాపించారు. సత్యాగ్రహ ఉద్యమం లో భాగం గా గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుండి ఆహ్మేదాబాద్ వరకు దండీ మార్చ్ ని ప్రారంభించారు. బ్రిటిష్ పరిపాలన లో 'మాంచెస్టర్ అఫ్ ది ఈస్ట్' గా ఇది ప్రసిద్ది చెందింది. అలాగే గాంధీజీ స్వదేశీ ఉద్యమం లో వస్త్ర పరిశ్రమ వేగంగా విస్తరించింది. ఆ సమయం లో ఉనికి లో కి వచ్చిన అరవింద్ మిల్స్, కాలికో మిల్స్ వంటివి స్వదేశీ వస్త్రాలని ఉత్పత్తి చెయ్యడం వల్ల ఏంతో ప్రాముఖ్యత పొందాయి.

పర్యాటక ఆకర్షణలుఅటు చారిత్రక ఆనవాళ్ళు, ఇటు అదునాతీన ఆకర్షణలైన పెద్ద మాల్స్ మరియు సినిమా మాల్స్, హట్హీసింగ్ జైన్ టెంపుల్, సిది సయీద్ మస్జిద్, స్వామినారాయణ్ టెంపుల్, జమ్మా మసీద్, మహుడి జైన్ టెంపుల్, అక్షరధాం, సిటీ వాల్స్ మరియు గేట్స్, రాణి నో హజిరో, బాద్షా నో హజిరో, ఝుల్తా మినార, సర్ఖేజ్ రోజా, దాదా హరిర్ వావ్, ది అదలజ్ స్టెప్ వంటివి ఈ ప్రాంతం లో ప్రసిద్ది చెందినవి. అనేకమైన మ్యూజియం లు, సహజమైన పర్యావరణ వ్యవస్థ, ఇండోర నతురల్ పార్క్ మరియు కంకరియా సరస్సు వంటివి ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

జనాభా వివరాలు ఆహ్మేదాబాద్ యొక్క మొత్తం జనాభా 4.5 మిలియన్లు. వాణిజ్య కేంద్రం కావడం వల్ల వైష్ణవ హిందుత్వానికి అలాగే జైనిసం సేక్ట్ కి సంబంధించిన వర్తకుల యొక్క జనాభా ఎక్కువగా ఉంది. అలాగే పార్సీలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తారు. ఇస్రాయిల్ జ్యూ లు అతి తక్కువగా 300 ల మంది జనాభా మాత్రమే ఇక్కడ కనిపిస్తారు. ముస్లిములు గణనీయంగా పెద్ద సంఘం కలిగి ఉన్నారు. గుజరాతీ రాష్ట్ర భాష అయినప్పటికీ హిందీ ని వర్తకం, విద్య, ప్రభుత్వ మరియు ఇతర రోజు వారీ కార్యక్రమాలలో సాధారణంగా ఉపయోగిస్తారు.

వాతావరణం పాక్షిక శుష్క వాతావరణం కలిగిన ఆహ్మేదాబాద్ లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుంది. అందువల్ల ఇక్కడి వాతావరణం ఎడారి మరియు ఆర్ద్ర వాతావరణాల మధ్య ఉంటుంది. వర్షాకాలం మినహాయించి వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. చల్లటి ఉత్తర గాలుల వల్ల జనవరి లో మితంగా చలి కనిపిస్తుంది.

సంస్కృతి మరియు పండుగలువిభిన్న సంస్కృతుల అలాగే మతాల మేళవింపు తో అహ్మదాబాద్ బలమైన సాంస్కృతిక సాంప్రదాయం కలిగి ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించబడే నవరాత్రి ఉత్సవాలలో గర్బ అనబడే జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీపావళి, హోలీ, గణేష్ చతుర్థి, గుడి పాడ్వా, ఈద్ ఉల్-ఫితర్, ముహర్రం మరియు క్రిస్మస్ వంటి ఇతర పండుగలని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

అనుసంధానం మరియు ప్రయాణ సౌకర్యంఆటో రిక్షా లు అలాగే బస్సులు తరచుగా తిరగడం వల్ల ఈ నగరానికి చేరుకోవడం ఎంతో సులభం. అహ్మదాబాద్ మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (AMTS) నడిపే స్థానిక బస్సు సర్వీసులు నగరం లో అందుబాటులో ఉంటాయి. ప్రధాన కాలుపూర్ ప్రాంతం లో నెలకొని ఉన్న ఆహ్మేదాబాద్ రైల్వే స్టేషన్ కాలుపూర్ స్టేషన్ గా కూడా ప్రసిద్ది. మనినగర్, వత్వ, గంధిగ్రం, అసర్వ, చంద్లోడియా, కాళీ గం, వస్త్రపూర్, సబర్మతి, సర్ఖేజ్, నరోడ మరియు ఆమ్లి వంటివి అహ్మదాబాద్ లో ఉన్న మరికొన్ని స్టేషన్ లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరం నుండి 15 కిలోమీటర్ల దూరం లో అలాగే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్ నుండి 8 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ అలాగే స్వదేశీ ప్రయాణీకులకి సేవలందిస్తుంది.

అభివృద్ధి చెందుతున్న నగరం రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, కెమికల్, ఫార్మాసిటికల్, పెట్రోలియం మరియు ఐటి ఇండస్ట్రీల వంటి వివిధ రంగాల లో ని ప్రాజెక్టుల రాక తో అహ్మదాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్)- అహ్మదాబాద్, NID(నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్), NIFT(నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫాషన్ టెక్నాలజీ), ధీరూభాయి అంబాని ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి వివిధ విద్యా సంస్థలు ఈ ప్రాంతం లో ఉన్నాయి.

నేటి అహ్మదాబాద్ పర్యాటకులకి ఆనందాన్ని కలిగించేందుకు అనువైన ప్రదేశం. పెద్ద మాల్స్ లో షాపింగ్ నుండి అంతర్జాతీయ స్టాండర్డ్ హోటల్స్ లో బస వరకు, నేచురల్ పార్క్స్ లో సఫారీ నుండి చారిత్రక నగరాల సందర్శన వరకు ఈ ప్రాంతం లో అందుబాటులో ఉన్నాయి. పర్యాతకుడి ప్రతి అవసరాన్ని తీర్చడం వాళ్ళ అహ్మదాబాద్ ప్రసిద్ద మైన పర్యాటక మజిలీ అయింది.

అహ్మదాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అహ్మదాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అహ్మదాబాద్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అహ్మదాబాద్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం దేశ రాజధాని ఢిల్లీ కి అలాగే ఆర్ధిక రాజధాని ముంబై కి జాతీయ రహదారి 8 ద్వారా ఆహ్మేదాబాద్ చక్కగా అనుసంధానమై ఉంది. ఆహ్మేదాబాద్ మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్(AMTS) వారిచే నడపబడే స్థానిక బస్సు సర్వీసులు ప్రధాన రవాణా మార్గం. ఆటో రిక్షా సర్వీసులు కూడా ఇక్కడ లభిస్తాయి. సర్ఖేజ్-గాంధీనగర్ హైవే లేదా SG హైవే ద్వారా ఆహ్మేదాబాద్ రాష్ట్ర రాజధాని అయిన గాంధీనగర్ కి చక్కగా అనుసంధానమై ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ప్రధాన ఆహ్మేదాబాద్ రైల్వే స్టేషన్ ని కాలుపూర్ స్టేషన్ గా కూడా పిలుస్తారు. రాష్ట్రం లోపల ప్రాంతాలకు అలాగే రాష్ట్రం బయట ప్రాంతాలకు చక్కగా అనుసంధానమైనది ఈ రైల్వే స్టేషన్. ముంబై, ఢిల్లీ, లక్నో, ఇండోర్, వదోదర, భోపాల్, పూణే, సురల్, రాజ్కోట్ వంటి వివిధ పట్టణాలకు రైళ్ళు తరచూ అందుబాటులో ఉంటాయి. వత్వ, అసర్వ, గందిగ్రం, చంద్లోడియా, వస్త్రపూర్, కాళీ గం, సబర్మతి, నరోడ, సర్ఖేజ్, ఆమ్లి, మనినగర్ వంటి వివిధ పట్టణాలకు కూడా ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం గుజరాత్ అంతర్జాతీయ విమానాశ్రయం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరం నుండి 15 కిలో మీటర్ల దూరం లో అలాగే ఆహ్మేదాబాద్ రైల్వే స్టేషన్ మరియు నగర బస్ స్టాండ్ నుండి 8 కిలో మీటర్ల దూరం లో ఉన్న విమానాశ్రయాలు. నడియాడ్, సురేంద్రనగర్, మెహసన వంటి రాష్ట్రం లోపల నగరాలకి అలాగే ముంబై, బెంగుళూరు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై వంటి వివిధ భారతీయ నగరాలకి స్వదేశి విమాన సర్వీసులు అందుబాటులో కలవు. షార్జా, దుబాయ్, కువైట్, కాబుల్, అబూ దాభి, ఫ్రాంక్ఫర్ట్, లండన్, పారిస్, బాంకాక్, చికాగో, సింగపూర్, షాంగై, హాంగ్ కాంగ్ వంటి వివిధ ప్రదేశాలకు అంతర్జాతీయ విమానాలు అందుబాటులో కలవు.
  మార్గాలను శోధించండి

అహ్మదాబాద్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Oct,Fri
Return On
23 Oct,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Oct,Fri
Check Out
23 Oct,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Oct,Fri
Return On
23 Oct,Sat