Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాజ్ కోట్

రాజ్ కోట్ - గాంధీజీ తన చిన్న వయసు లో గడిపిన ప్రదేశం

38

గతం లోని సౌరాష్ట్ర రాష్ట్రానికి రాజ్ కోట్ రాజధాని గా వుండేది. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలం నుండి అక్కడ కల చారిత్రక అవసేషాలకు మరియు అక్కడి ప్రజల ఆతిధ్యానికి పేరొందినది.

చరిత్ర

రాజ్ కోట్ ను క్రి. శ. 1620 లో జామ్ నగర్ రాచ కుటుంబం లోని తాకోరే సాహిబ్ విభోజి అజోజి జడేజా కనుగొన్నారు. రాజు సంధి పేరుతో రాజ్ కోట్ పేరు స్థిరపడింది. మొఘల్ రాజులు గుజరాత్ లో మరో మారు తమ రాజ్యం ఏర్పడినందుకు గాను రాజ్ కోట్ ను వీరికి బహుమానంగా ఇచ్చారు. దానితో పాటు , అతను అక్కడి స్థానిక కది తెగలతో మరియు జునాగడ్ పాలకుడి తో పోరాడి భూభాగాలు ఆక్రమించి తన రాజ్ కోట్ రాజ్యాన్ని పటిష్టం చేసుకొన్నాడు.

నవాబుల పాలనా కాలంలో

క్రి. శ. 1720 లో రాజ్ కోట్ ను జునాగడ్ రాజు మాసూం స్వాధీనం చేసుకొన్నాడు. క్రి. శ. 1722 లో దానికి మాసూమాబాద్ అని పేరు పెట్టాడు. దాని చుట్టూ 8 అడుగుల మందం కల గోడ ను 8 గేట్ల తో బలంగా నిర్మించాడు. ఎనిమిదవ గేటు వద్ద నఖ్లంక టెంపుల్ వుండేది. ఇప్పటికి బెది నాక మరియు రాయక నాక అనే పేర్ల తో రెండు గేటు లు కలవు. వీటిని బ్రిటిష్ వారు ఒక సారి పునరిద్ధరింఛి మూడు అంతస్తుల క్లాక్ టవర్ లు గా మార్చారు.

బ్రిటిష్ పాలన

బ్రిటిష్ పాలనలో రాజ్ కోట్ కళలు, సంస్కృతి, విద్య రంగాలలో బాగా అభివృద్ధి చెందినది. ప్రధాన భవనాలు రాజ్ కుమార్ కాలేజీ, వాట్సన్ మ్యూజియం, లాంగ్ లైబ్రరీ, కన్నాట్ హాల్ మరియు ఒక లాజ్ ఈ కాలం లో నిర్మించారు. బ్రిటిష్ వారి అధీనం లో రాజ్ కోట్ ఒక ప్రధాన విద్యాకేంద్రంగా వుంది స్వాతంత్ర పోరాటం నాటికి ఎంతో మంది మేధావులను ఇండియాలో ఈ కేంద్రం తయారు చేసింది.

రాజ్ కోట్ తో గాంధీజీకి గల సంబంధం.

గాంధీజీ తన ప్రాధమిక విద్యను రాజ్ కోట్ లో కల అల్ఫ్రెడ్ హై స్కూల్ లో చేసారు. ఈ సంస్థ ను తర్వాతి కాలంలో గాంధీజీ ఖాది స్వదేశీ ఉద్యమం కొరకు రాష్ట్రియశాలగా స్థాపించారు.

సంస్కృతి

రాజ్ కోట లో దేశం లోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కలరు. రాజ్ కోట ప్రజలను వారికి గల మర్యాద స్వభావం మరియు సంతోషంలతో తేలికగా గుర్తించవచ్చు. అందుకనే రాజ్ కోట్ ను రంగీలా రాజ్ కోట్ అని కూడా అంటారు. సంతోషంగా వుండే వీరు అందరికి చక్కని కతియవారి ఆతిథ్యం ఇస్తారు. వీరు ప్రధానంగా శాకాహారులు. మహిళలు ఆభరాణాలు అధికంగా అలంకరించుకుంటారు.

భౌగోళికత, వాతావరణం

ఆజి మరియు నిరారి నదుల ఒడ్డున వున్న రాజ్ కోట్ ఉప ఉష్ణమండల వాతావరణం కలిగి వేసవులు వేడిగా, పొడిగాను, వర్షాలు అధికంగాను కలిగి వుంటాయి. రాజ్ కోట్ లో తుఫాన్లు, మరియు, పిడుగులు వంటివి కూడా వర్షాకాలంలో వస్తాయి.

రాజ్ కోట్ జనాభా లో 80.6 శాతం అక్షరాస్యులే. ప్రజలు అధికంగా హిందువులు కాగా ముస్లిం లు 10 శాతం వరకు వుంటారు.

చేరటం ఎలా? గుజరాత్ ప్రభుత్వ రవాణా సంస్థ గుజరాత్ నుండి ఇతర పట్టణాల నుండి రాజ్ కోట్ కు బస్సు లు నడుపుతుంది. బస్సులే కాక ఆటోలు, కూడా కలవు. ఈ బస్సులు ఆటోలు అన్నీ సి ఎన్ జి గ్యాస్ పై నడుస్తాయి. రాజ్ కోట్ లో చిన్న ఎయిర్ పోర్ట్ కూడా కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి అహ్మదాబాద్, ముంబై, భావనగర్ లకు విమానాలు నడుస్తాయి.

రాజ్ కోట్ లో ఏమి చూడాలి? వాట్సన్ మ్యూజియం, లాంగ్ లైబ్రరీ, కన్నాట్ హాల్, రాజ్ కుమార్ కాలేజీ, కాబా గాంధీ దేలో, రాష్ట్రీయ శాల, ఖమ్బాలిడా గుహలు, విర్పూర్, తన్కారా లు కొన్ని ప్రధాన స్థాలాలు. సహజ ప్రదేశాలైన, రంపరా వైల్డ్ లైఫ్ సంక్చురి, దశదా మరియు బాజన లు కూడా చూడ దగినవే. జేత్పూర్, బంగ్ది బజార్ లు కూడా ఆకర్షణే.  రాజ్ కోట్ ప్రజలు ఇచ్చే కదియవారి ఆతిథ్యం కొరకు, స్వాతంత్ర పూర్వ యుగం చూడటానికి రాజ్ కోట్ తప్పక దర్శించాలి.

రాజ్ కోట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాజ్ కోట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాజ్ కోట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాజ్ కోట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుండి రాజ్ కోట్ కు బస్సులు నడుపుతుంది. ప్రైవేటు బస్సు లు కూడా తరచుగా లభ్యంగా వుంటాయి. నగరంలో బస్సు లు సి ఎన్ జి గ్యాస్ పై నడుపుతారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రాజ్ కోట్ జంక్షన్ నుండి దేశం నలుమూలలకూ రైలు లో చేరవచ్చు. రాష్ట్రం లో మరియు బయటా అన్ని ప్రదేశాలకు అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై వంటి ప్రధాన ప్రదేశాలకు రాజ్ కోట్ నుండి రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం రాజ్ కోట్ నుండి కొద్ది దూరం లో ఒక చిన్న స్థానిక విమానాశ్రయం కలదు. ఇక్కడ నుండి గుజరాత్ కు ఇండియా లోని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. జెట్ ఎయిర్ వేస్ మరియు ఎయిర్ ఇండియా విమానాలు రెగ్యులర్ గా ముంబై కి కలవు. భావ నగర్,అహ్మదాబాద్ ల కు కూడా కలవు. బెంగుళూరు నగరానికి రాజ్ కోట్ నుండి జెట్ ఎయిర్ లైన్స్ విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun