సోమనాథ్ - దేవుని మఠము

సోమనాథ్ ఆలయం, భారతదేశం అంతటా హిందువులు గౌరవించే మరియు పూజించే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

నేపథ్య కథనం

స్థల పురాణం ప్రకారం, దీనిని మొదట చంద్ర దేవుడు, దక్ష ప్రజాపతి యొక్క శాపం నుండి తన ప్రకాశాన్ని పునరుద్ధరించడానికి గాను ప్రధాన ఆలయం బంగారంతో నిర్మించాడు. తర్వాత సూర్య భగవానుడు వెండితోను, తుదకు శ్రీకృష్ణుడు కలప తోనూ ఆలయాన్ని నిర్మించారు. 11వ శతాబ్దంలో సోలంకి రాజపుత్రులు చాళుక్య శైలిలో కొత్త రాతి ఆలయం నిర్మించారు. దాని శిఖరం 50 మీ. పొడవు. ఆలయ చాలా ఎత్తుగా ఉండి, గోడలపై అనేక అద్భుతమైన చెక్కడాలు కలిగి ఉంది. నంది విగ్రహం మరియు భారతదేశం యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక శివలింగం ఇక్కడ ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ముందు విస్తారమైన ప్రాంగణం, గోపురాలగా పిరమిడ్ వంటి నిర్మాణాలు ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా మరమ్మత్తులు కూడా చేయలేని స్థితికి లో చేరిన ఆలయాన్ని, 1951 లో సర్దార్ పటేల్ పునరుద్ధరణకు చొరవ తీసుకుని, ప్రస్తుతం ఉన్నఆలయం నిర్మించారు. సోమనాథ్ ఆలయం ఆరు సార్లు దాడికి గురయ్యింది. ప్రస్తుత దేవాలయం అసలు ఆలయం యొక్క ఏడవ పునర్నిర్మాణం.

భౌగోళిక అంశాలు

సోమనాథ్ సౌరాష్ట్ర ద్వీపకల్పం యొక్క కొన వద్ద ఉన్న తీరప్రాంత నగరం. దీనికి ఒక వైపు అరేబియా సముద్రం ఉంది. ఉత్తరాన 6 కి.మీ.ల దూరంలో వేరవాల్ మరియు 407 కి.మీ.ల దూరంలో అహ్మదాబాద్ ఉన్నాయి.

సంస్కృతి

సోమనాథ్ భారతదేశం యొక్క పౌరాణిక మరియు మతపరమైన వారసత్వాన్ని సంరక్షిస్తుంది. ఇక్కడ ప్రజలు ధార్మిక బుద్ధి కలిగి, విధేయతతో ఆచారాలను అనుసరిస్తారు. అన్ని పండుగలను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.

వాతావరణం

అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల సోమనాథ్ మధ్యస్త వాతావరణాన్నికలిగి ఉంది. శీతాకాలాలు తక్కువ ఉష్ణోగ్రతలతో ఉండి, వేసవులు, కొద్దిగా వేడిగా ఉంటాయి. వర్షాకాలం గాలులతో ఉండి, భారీ వర్షం కురుస్తుంది. సోమనాథ్ సందర్శించడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుంచి మార్చి మధ్య సమయం.

సందర్శనీయ ప్రదేశాలు

ప్రధాన మహాదేవ్ ఆలయం కాకుండా, సోమనాథ్ లో సూర్య దేవాలయం వంటి ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. సూర్య దేవాలయం 14 వ శతాబ్దంలో నిర్మించబడి, సూర్య దేవుడు మరియు అతని రెండు సేవకుల విగ్రహాలను కలిగి ఉంది. భల్క తీర్థం, జరా అనే భిల్లు వేటగాడు పొరపాటున శ్రీ కృష్ణుని బాణంతో కొట్టిన ప్రదేశం. దేహోత్సర్గ్ తీర్థం శ్రీ కృష్ణ దహన ప్రదేశం. సోమనాథ్ సముద్ర తీరం మరొక పర్యాటక ప్రదేశం. తరంగాలు చాలా ఉధృతంగా ఉండటం వల్ల, ఇక్కడ ఈతకు అనుకూలంగా ఉండదు. అయితే, ప్రకృతి ని దగ్గరగా చూసే అనుభూతి, ఒంటె సవారి మరియు రుచికరమైన ఆహారం వంటి వినోదాత్మక చర్యలు మంచి అనుభవాన్ని అందిస్తాయి. ఈత మరియు వివిధ జలక్రీడలకు ఉత్తమ సాగరతీరం అహ్మద్పూర్ మాండ్వి ఉంది. డయ్యు ద్వీపానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో, నీరు సుస్పష్టం గా ఉంటుంది. ఇక్కడ పోర్చుగీస్ మరియు సౌరాష్ట్ర వంటకాల మరియు సంస్కృతుల మిశ్రమ శైలిని అనుభవించవచ్చు. బౌద్ధ సానా గుహలు, మై పూరీ మసీదు, వేరవాల్ మరియు ఎన్నో ఇతర ప్రదేశాలు ఇక్కడ సందర్శించడానికి తగినవిగా ఉన్నాయి.

Please Wait while comments are loading...