గిర్నార్ - దేవతల కొండలు

గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు కూడా పవిత్రమైనది. గిర్నార్ అనేది ఒక పర్వత శ్రేణి ఈ శ్రేణి గిర్నార్ హిల్స్ గా ప్రసిద్ధి చెందినది. గిర్నార్ గురించి వేదాలలోను, ఇతర ఇండస్ వాలీ నాగరికత గ్రంధాలలోను కూడా ఒక పవిత్ర ప్రదేశంగా పేర్కొనబడినది.

హిందూ మరియు జైన దేవాలయాలు

ఈ గిర్నార్ పర్వత శ్రేణి లో అయిదు శిఖరాలు కలవు. వాటిలో అనేక హిందూ మరియు జైన టెంపుల్స్ కలవు. యాత్రికులు ఈ టెంపుల్స్ దర్శించాలంటే అనేక వేల మెట్లు అధిరోహించాలి. జైన టెంపుల్స్ లో తీర్ధంకర నేమినాత్ టెంపుల్, మల్లినాత్ టెంపుల్, రిషభదేవ్ టెంపుల్ మరియు పార్శ్వనాథ్ టెంపుల్ కలవు. హిందూ దేవాలయాలలో భావనాత్ మహాదేవ టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, అంబ మాత టెంపుల్, కాళిక టెంపుల్ , రామచంద్ర టెంపుల్, జత శంకర్ మహాదేవ తెమ్పే, గోముఖి గంగ టెంపుల్ మరియు అక్కడ గిర్నార్ కు పడమటి భాగంలోకల హనుమాన్ ధారా అనే జలపాతం కూడా ప్రసిద్ధి.

గిర్నార్ యొక్క అయిదు శిఖరాలు

నేమినాధ టెంపుల్ అంబా మాత టెంపుల్ మొదటి శిఖరంలోను, రెండవ సిఖరమైన గురు గోరఖ్ నాథ్ శిఖరం మరియు మూడవ శిఖరం ఒఘాద్ శిఖరం గా చెపుతారు. తరువాతవి దత్తాత్రేయ టెంపుల్ మరియు ఆ తర్వాత కాళికా టెంపుల్ శిఖరం కలవు.

గిర్ నేషనల్ పార్క్

గిర్నార్ అడవి సమీపంలో గిర్ నేషనల్ పార్క్ కలదు. గిర్నార్ హిల్స్ చూసేవారు ఈ నేషనల్ పార్క్ ను తప్పక దర్శించాలి.

వాతావరణం

వేసవి కాలంలో ఇక్కడ ఉదయం వేళ సాధారణంగా తేమ వాతావరణం వుంటుంది. మధ్యాహ్నాలు చాలా వేడి.

వేడి నుండి తప్పు కోవడానికి వేసవిలో ఉదయం పెందలకడనే శిఖరాలు ఎక్కడం మొదలు పెట్టాలి. సెప్టెంబర్ నుండి నవంబర్ మరియు ఫిబ్రవరి నెలలు కొండలు ఎక్కడానికి అనుకూలం. డిసెంబర్ లో అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు.

రవాణా

గిర్నార్ పర్వతాలు జునాగడ్ పట్టణానికి సమీపం అవటంతో రైలు లేదా ప్రభుత్వ బస్సులలో తేలికగా చేరవచ్చు. ఈ ప్రాంతాన్ని కేశోడ్ మరియు రాజ్ కోట్ ఎయిర్ పోర్ట్ ల నుండి కూడా చేరవచ్చు. ఇవి వరుసగా 40 కి.మీ.లు మరియు 100 కి.మీ.ల దూరంలో వుంటాయి.

గిర్నార్ హిల్ ఒక పవిత్ర యాత్రా స్థలం. వన్య జంతువులకు ఒక అభయారణ్యం. వీటి యొక్క చక్కని అనుభూతి పొందాలంటే, ఈ ప్రాంతం తప్పక సందర్సించాలి.

Please Wait while comments are loading...