Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మౌంట్ అబు

మౌంట్ అబు - అద్భుతాల గుట్ట !!

40

 రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక వేసవి విడిది (పర్వత ప్రాంతం). ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. జైనులకు ఈ ప్రాంతం ఒక ప్రముఖ తీర్థ యాత్ర స్థలం. 1220 మీ. ఎత్తు లో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని వుంది. మౌంట్ అబూ ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రధానంగా వేసవికాలం, వర్షా కాలంలో వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. గత దశాబ్ద౦లొ ఈ పర్వత కేంద్రం ఒక ప్రముఖ వేసవి విడిదిగాను, హనీ మూన్ గమ్యస్థానంగా ప్రజాదరణ పొందింది.

పురాణాల్లోమౌంట్ అబూ

సర్ప దేవత అర్బుద పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చాడు. తర్వాతి కాలంలో ‘అర్బుదారణ్య’ పేరు ‘అబూ పర్వత’ లేదా ‘మౌంట్ అబూ’ గా మారింది. ఇక్కడ గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించేవారని, వారికీ అర్బుద పర్వతాలతో అనుబంధ ముండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రిక గ్రంధాలు, శాసనాలలో నమోదు చేయబడింది.

మౌంట్ అబూ లో చూడ దగిన ప్రదేశాలు.

నక్కి సరస్సు, సన్సెట్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ అఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంత౦లొ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు. అనేక చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన ప్రాంతాలలో ప్రధానంగా దిల్వార జైన దేవాలయాలతో బాటుగా అధర్ దేవి ఆలయం, దూద్ బవోరి, శ్రీ రఘునాథ్ జి దేవాలయం, అచల్ ఘర్ కోట వంటి ప్రాంతాలు కూడ మౌంట్ అబూ లో వున్నాయి.

మౌంట్ అబూ చేరుకోవడం

మౌంట్ అబూ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యం ఉంది. 185 కి. మీ.ల దూరంలో గల ఉదయ్ పూర్ నుండి వాయు మార్గం ద్వార పర్యాటకులు ఇక్కడికి చేరవచ్చు. సంవత్సరం పొడవున వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వేసవి కాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.

మౌంట్ అబు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మౌంట్ అబు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మౌంట్ అబు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మౌంట్ అబు

  • రోడ్డు ప్రయాణం
    అబూ రోడ్ లోని రైల్వే స్టేషన్ అతి పెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన న్యూఢిల్లీ, ముంబాయిల మధ్య గల ప్రధాన రైలు మార్గంలో ఉంది. ఇక్కడి నుండి ప్రధాన స్టేషన్లయిన బెంగలూరు, హైదరాబాదు న్యూఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, పూణే, ముంబాయి, జైపూర్, డెహ్రాడూన్, త్రివేండ్రం వంటి అనేక ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. రోడ్ ద్వారా : అనేక బస్సులు, టాక్సీ సౌకర్యాల ద్వార ఈ పర్వత కేంద్రానికి సులభంగా చేరవచ్చు. న్యూఢిల్లీ, ముంబాయి, జైపూర్, ఉదయ పూర్ , అహ్మదాబాద్ వంటి ముఖ్య భారతదేశ నగరాల నుండి మౌంట్ అబూకు అనేక బస్సులు వున్నాయి. పర్యాటకుల రద్దీ పై ఆధారపడి ప్రతి రోజు లేదా ప్రతి వారం బస్సు సౌకర్యం ఉంటుంది. అవి అందించే సౌకర్యాలు, సదుపాయాలపై బస్సు చార్జీలు ఆధారపడి ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా : ఇక్కడికి 27 కి.మీ. దూరంలో మౌంట్ రోడ్ లో గల రైల్వే స్టేషన్ మౌంట్ అబూనకు దగ్గరగా గల రైలు మార్గం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మౌంట్ అబూ నకు చక్కటి వాయు, రైలు, రోడ్ సౌకర్యం వున్నాయి. వాయు మార్గాన ఇక్కడికి రావాలనుకునే పర్యాటకులకు ఉదయపూర్ విమానాశ్రయం దగ్గర మార్గం. విమానాశ్రయం నుండి మౌంట్ అబూకు ప్రైవేటు టాక్సీలు అద్దెకు తెసుకొనవచ్చు. మౌంట్ అబూ నుండి చేరువలో గల ఉదయ పూర్ విమానాశ్రయం నుండి ఇక్కడకు విమానం ద్వారా చేరవచ్చు. ఈ పర్వత కేంద్రం నుండి ఉదయ్ పూర్ విమానాశ్రయం 176 కి. మీ. దూరం లో ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి విమానం ద్వార చేరడం అందుబాటు లో వున్న ఇంకొక అవకాశం. భారత దేశంలోనే అన్ని ప్రధాన నగరాలకు గుజరాత్ రాజధాని నుండి విమాన సౌకర్యం ఉంది. మౌంట్ అబూ నుండి 221 కి.మీ.దూరం లో గల గుజరాత్ లోని విమానాశ్రయం నుండి చక్కటి ప్రయాణ సౌకర్యం ద్వారా ఈ పర్వత కేంద్రానికి సులభంగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun