Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉదయపూర్

ఉదయపూర్ – రాజులు సేదతీరిన సరస్సుల నగరం !!   

62

బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభాయారణ్యాలకు ప్రసిద్ది పొందిన ఉదయపూర్ ‘సరస్సుల నగరం’గా పిలువబడే అందమైన ప్రదేశం. దీన్ని 1559 లో రెండో మహారాణా ఉదయసింగ్ స్థాపించాడు. తన గొప్ప సంస్కృతికి, సాంప్రదాయాలకు పేరుపడ్డ ఉదయపూర్, భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం.క్రీ.శ.1362 లో స్థానికుల తాగు, సాగు నీటి అవసరాల కోసం నిర్మించిన ఆనకట్ట వల్ల ఏర్పడ్డ పిచోలా సరస్సు అద్భుతమైన కృత్రిమ సరస్సు. ఈ ప్రదేశంలోని అందమైన పరిసరాల వల్ల మహారాణా ఉదయసింగ్ ఈ సరస్సు ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు.

1678 లో మహారాణా ఫతే సింగ్ అభివృద్ది చేసిన ఫతే సాగర్ మరో కృత్రిమ సరస్సు. రాజసామంద్ సరస్సు, ఉదయసాగర్ సరస్సు, జైసామంద్ సరస్సు ఈ ప్రాంతం లోని ఇతర ప్రముఖ సరస్సులు. రాజపుత్రుల వైభవానికి ప్రతీకలుగా నిలిచే చాలా రాజప్రాసాదాలు, కోటలు ఇక్కడ వున్నాయి. 1559 లో మహారాజ ఉదయ మీర్జా సింగ్ అద్భుతమైన కట్టడం ఇక్కడి సిటీ పేలస్. మొత్తం మీద, ప్రధాన అంతఃపుర సముదాయంలో ౧౧ భవనాలు ఉనాయి. ఇవే కాక, ఇక్కడి లేక్ పేలస్ కళాత్మక ప్రతిభకు ప్రసిద్ది పొందింది.

ఈ పేలస్ ఇప్పుడు రంగులద్దిన అద్దాలతో, గులాబి రంగు రాళ్ళతో, తామారాకుల చిత్రాలతో అలంకరించిన గదులున్న ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది.సముద్ర మట్టానికి 944 మీటర్ల ఎత్తున నిర్మించిన మరో అద్భుత కట్టడం ‘మాన్సూన్ పేలస్’ గా పిలువబడే సజ్జన్ఘర్ ప్రాసాదం. దీని పైనుంచి మబ్బులను గమనించడానికి మహారాణా సజ్జన్ సింగ్ దీన్ని 1884 లో ఈ ప్రాసాదాన్ని నిర్మించాడు. దీంతో పాటు బాగోర్ కీ హవేలీ, ఫతే ప్రకాష్ ప్రాసాదం కూడా ఇక్కడి ప్రధాన భవనాలలో వున్నాయి.సమయం ఉంటె, గతకాలపు వైభవ చిహ్నాలు ప్రదర్శించే వివిధ మ్యూజియంలు, గాలరీలు కూడా పర్యాటకులు చూడవచ్చు.

రాజ కుటుంబీకులు వాడిన వివిధ వస్తువులను సిటీ పేలస్ మ్యూజియం ప్రదర్శిస్తుంది. ఇవే కాక ఫతే ప్రకాష్ ప్రాసాదంలో భాగమైన స్ఫటిక ప్రదర్శనశాలలో ఓస్లర్ స్ఫటికాల అద్భుత ప్రదర్శన కూడా చూడవచ్చు. అందమైన సోఫా సెట్లు, రాళ్ళు పొదిగిన తివాచీలు, స్ఫటికాల దుస్తులు, ఫౌంటెన్లు, పింగాణీ వస్తువులు ఈ ప్రదర్శనశాలలో ఆకర్షణలు. ప్రాచీన కాలం నాటి ప్రజలు తమ జీవిత కాలం లో వాడిన వస్తువులను ప్రదర్శించే అహర్ పురావస్తు ప్రదర్శనశాల కూడా బాగా ప్రసిద్ది చెందినది.సహెలియో౦ కీ బారీ, బడా మహల్, గులాబ్ బాగ్, మహారాణా ప్రతాప్ స్మారకం, లక్ష్మీ చౌక్, దిల్ కుశాల్ లాంటి ఎన్నో అందమైన ఉద్యానవనాలు, కట్టడాలు ఇక్కడ వున్నాయి.

మహారాణా ఉదయ సింగ్ నిర్మించిన, గోల్ మహల్ గా పిలువబడే రాజ్ ఆంగణ్ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. చేతివృత్తులకు ప్రసిద్ది పొందిన శిల్ప గ్రామ్ గ్రామాన్ని కూడా యాత్రికులు చూడవచ్చు. జగ్ మందిర్, సుఖాడియా సర్కిల్, నెహ్రూ గార్డెన్, ఏక్ లింగ జీ దేవాలయం, రాజీవ్ గాంధీ పార్క్, అత్తా-కోడలు గుడి, శ్రీనాథ్ జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు.

దబోక్ అని పిలువబడే మహారాణా విమానాశ్రయం ఉదయపూర్ నుంచి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతున్నాయి. ఇక్కడ వున్న బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్ నుంచి దేశం లోని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తున్నాయి. రోడ్డు మార్గంలో ఉదయపూర్ చేరాలనుకునే వారు రాజస్థాన్ లోని వివిధ నగరాలనుంచి ఉదయపూర్ కు వెళ్ళే బస్సులు ఎక్కవచ్చు.ఏడాది లో ఎక్కువ భాగం ఉదయపూర్ లో ఉష్ణ మండల వాతావరణం వుంటుంది.

ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మార్చ్ మధ్య కాలం బాగుంటుందని భావిస్తారు. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటుంది కాబట్టి యాత్రికులు ఆ సమయంలో ఇక్కడికి రారు. వర్షాకాలంలో తక్కువ వర్ష పాతం వుండడం వల్ల గాలి లో తేమ బాగా వుంటుంది. శీతాకాలంలో వాతావరణం హాయిగా వుండడం వల్ల ఆ సమయంలో ఈ ప్రదేశం చూడ్డానికి చాలా బాగుంటుంది.

ఉదయపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉదయపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉదయపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉదయపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: రాజస్తాన్ లోని ప్రధాన నగరమైన ఉదయపూర్ కు ఇతర ప్రదేశాల నుండి బస్సులు అనుసంధానించబడి ఉన్నాయి. రాజస్తాన్ రోడ్డు మార్గం ద్వారా బస్సులు ఉదయపూర్, ఇతర ప్రధాన ప్రాంతాల మధ్య తరచుగా నడపబడుతున్నాయి. ప్రయాణీకులు వారి బడ్జెట్ కి అనుగుణంగా ఏ సి, వాల్వో బస్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ బస్సులు డిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ నుంచి అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: ఉదయపూర్ రైల్వే స్టేషన్ ఒక బ్రాడ్ గేజ్ లైను, ఇది డిల్లీ, జైపూర్, జైసల్మేర్ తోపాటు భారతదేశం లోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఈ రైల్వే స్టేషన్ నగర కూడలి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా: మహారాణా ప్రతాప్ విమానాశ్రయం గా పిలువబడే ఉదయపూర్ విమానాశ్రయం, దబోక్ విమానాశ్రయం నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది డిల్లీ, ముంబై, జైపూర్, కొలకత్తా తోపాటు భారతదేశంలోని ప్రధాన నగరాలకు కూడా అనుసంధానించబడి ఉంది. ఉదయపూర్ విమానాశ్రయం నుండి డిల్లీ, ముంబై కి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు విమానాశ్రయం నుండి అద్దె కాబ్స్ లేదా టాక్సీ ల ద్వారా నగరానికి చేరుకోవచ్చు. ఉదయపూర్ కి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమాన స్థావరం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue