Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రానక్ పూర్

రానక్ పూర్ - దేవాలయాల పట్టణం !!

20

 రాజస్థాన్ లోని పాలి జిల్లలో రానక్ పూర్ ఒక చిన్న గ్రామం.ఆరావళి పర్వతశ్రేణులలో పశ్చిమాన ఉదయపూర్ జోద్ పుర్ లకు మధ్యన రానక్ పూర్ ఉంది.జైన మత ప్రాధాన్యత కల్గిన 15 వ శతాబ్దానికి చెందిన జైన మత దేవాలయం గల ప్రాంతంగా ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.ఈ ఆలయ గొప్ప తనం దీని ఎత్తైన ఉన్నత స్తంభాల వలన తెలుస్తుంది.

అంతులేని ఎడారి నెపథ్య౦తో దేవాలయ అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి.రానక్ పూర్ లో - చుట్టుపక్కల సూర్య నారాయణ్ దేవాలయంగా పిలిచే సూర్యభగవానుని దేవాలయం రానక్ పూర్ సందర్శించే యాత్రికులలో ఎంతో ఆదరణ పొంది౦ది.ఆలయ గోడలపై చిత్రించిన ఖగోళ వస్తువులు, గుర్రాలు, యోధుల బొమ్మలు బహుభుజ గోడను రూపొందించిన స్థానికుల కళ ను తెలియ చేస్తుంది.ఈ దేవాలయం లో సూర్య భగవానుడు రధాన్ని నడుపుతున్నట్లుగా దర్శనమిస్తాడు.

జైన మతస్తుల ప్రసిద్ధ తీర్థ యాత్రా ప్రాంతమైన సద్రి ను కూడా రానక్ పూర్ కు వచ్చే యాత్రికులు తరచూ సందర్శిస్తుంటారు శివుని కోసం నిర్మించిన ముచ్చల్ మహావీర్ దేవాలయం ఇక్కడి మరొక ప్రముఖ ఆకర్షణ.ఇది కు౦భాల్ ఘర్ అభయారణ్యంలో గల ఘనే రావు నుండి 5 కి.మీ. దూరంలో ఉంది.శివుని విగ్రహం మీసాలను కల్గి ఉండటం ఈ దేవాలయం లోని ఆకర్షణీయమైన అంశం.

ఘనే రావు గ్రామంలోనే అనేక దేవాలయాలను కల్గి ఉంది.ఈ ప్రాంతంలో కనబడే 11 జైన దేవాలయాలలో ముచ్చల్ మహావీర్ దేవాలయం, గజానంద్ దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందాయి.రానక్ పూర్ నుండి 6 కి.మీ. దూరంలో గల నార్లై గ్రామం జైన దేవాలయాలకు పేరొందింది.ఆలయ నిర్మాణం, లోపలి కుడ్య చిత్రాలు మెచ్చుకోదగిన రీతిలో ఉంటాయి.

చారిత్రిక ప్రదేశమైన కంభాల్ ఘర్ ఈ ప్రాంత లోని మరొక ప్రధాన ఆకర్షణ.ఈ ప్రాంతంలో గల మేవార్ కోట పొడవుగా ఉండి దీని గోడలు ఎంతో దూర౦ వ్యాపించి ఉంటాయి.సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి మంత్రముగ్ధుల్ని చేసే ఆరావళి పర్వత శ్రేణులను, అద్భుతమైన థార్ ఎడారి ఇసుక దిబ్బలను చూడవచ్చు.ఈ కోటను ప్రస్తుతం మ్యూజియం గా మార్చి ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంచారు..

రానక్ పూర్ చేరడం ఉదయ్ పుర్ లోని మహా రాణా ప్రతాప్ విమానాశ్రయం రానక్ పూర్ గ్రామంకు దగ్గరి వాయు మార్గం ఈ ప్రాంతానికి చేరువలోగల న్యూడిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అనేక విమానాల ద్వార గమ్యస్థానానికి చేరవచ్చు.35 కిలోమీటర్ల దూరంలోని ఫల్నా ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్.స్టేషన్ నుండి క్యాబ్ లు, టాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి.రానక్ పూర్ దగ్గరలోని నగరాల నుండి ప్రైవేటు, ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం రానక్ పూర్ ను సందర్శించడానికి శీతాకాలం ఎంతో ఉత్తమమైనది.ఈ కాలంలో ఉష్ణోగ్రత ఈ పరిసర ప్రాంతాలను సందర్శించడానికి అనువుగా ఉంటుంది.అప్పటి వరకు గల తీవ్రమైన, పొడి వేసవి నుండి వర్షాకాలం ఈ ప్రాంతానికి ఊరట కల్గిస్తుంది.ఇక్కడ వర్షాలు మితంగా ఉండి ఆ కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

రానక్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రానక్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రానక్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రానక్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    ఉదయ పుర్, జై పుర్, జోద్ పూర్ ల వంటి దగ్గరి నగరాల నుండి రానక్ పూర్ వరకు బస్సు సౌకర్యం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రానక్ పుర్ నుండి 35 కి.మీ. దూరం లో గల ఫల్న రైల్వే స్టేషన్ దగ్గరలోని ప్రధాన రైలు మార్గం.న్యూ డిల్లీ , ముంబాయి ల తో బాటుగా భారత దేశంలోనే అన్ని ముఖ్య నగరాలు ఫల్న రైలు స్టేషన్ కు నేరుగా రైళ్ళు నడుస్తాయి.రైల్వే స్టేషన్ నుండి టాక్సీ, బస్ సౌకర్యాలు యాత్రికులకు సులువుగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఉదయ్ పుర్ లోని మహా రాణా ప్రతాప్ విమానాశ్రయం 106 కి. మీ. దూరంలో రానక్ పుర్ నకు చేరువలో గల విమానాశ్రయం.భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో ఈ విమానాశ్రయం బాగా అనుసంధానించబడింది. విదేశీ పర్యాటకులు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయ్ పుర్ విమనాశ్రయం చేరడానికి విమానాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun