Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రానక్ పూర్ » వాతావరణం

రానక్ పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం : ఏడాది లో ఉష్ణోగ్రత ఎంతో ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలం రానక్ పూర్ సందర్శనకు ఉత్తమ కాలంగా భావించ బడుతుంది.శీత కాలం లో రానక్ పూర్ ను పర్యాటకులు సందర్శించదలచుకొంటె తేలికైన ఉన్ని దుస్తులతో రావలసినదిగా సూచించ బడినది.

వేసవి

వాతావరణం రానక్ పూర్ లో వాతావరణం వేసవి లో చాల వేడిగా శీతకాలం లో చాల చల్లగా ఉంటుంది.వేసవి కాలం: (ఏప్రిల్ నుండి జూన్ ) : రానక్ పూర్ లో వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది.ఈ కాలం లో ఉష్ణోగ్రత 22 నుండి 42 డిగ్రీల మధ్య ఉంటుంది.ఈ కాలం లో తీవ్రమైన వేడితో కూడిన పొడి వాతావరణం ఉంటుంది, మే నెల అత్యంత వేడిగా వుండే నెలగా భావించ బడుతుంది.

వర్షాకాలం

వర్ష కాలం ( జూలై నుండి సెప్టెంబర్ ): వర్షా కాలం జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది.ఈ ప్రాంతంలో వర్షాలు మిత౦ గానూ, అనియమితంగానూ పడతాయి.అయితే ఈ ప్రాంతంలో, ఈ కాలంలో ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : రానక్ పూర్ నందు శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది.ఈ ప్రాంతం లో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు, 10 డిగ్రీలుగా నమోదు చేయబడ్డాయి.శీత కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు తేలికైన ఉన్ని దుస్తులతో రావలసినదిగా సూచించబడినది.