Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సవాయి మాధో పూర్

సవాయి మాధో పూర్ – చక్కని విషయాల సమాహారం !

19

సవాయి మాధోపూర్, రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ కు 180 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న నగరం. ఈ నగరం చంబల్ నది ఒడ్డున ఉంది. జైపూర్ ప్రాంతాన్ని 18 వ శతాబ్దం లో పాలించిన సవాయి ఒకటో మాధో సింగ్ మహారాజు పేరిట ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.చరిత్ర లో సవాయి మాధో పూర్ ఈ నగరం అనేక వంశాలు, అనేక మంది రాజులు పాలించిన చరిత్రను కల్గి ఉంది. ఇది ప్రాంరంభంలో చౌహాన్ వంశానికి చెందిన రాజపుత్ర చక్రవర్తి హమ్మిర్ దేవ్ రాజ అధీనంలో ఉండేది. తర్వాతి కాలంలో అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యాల దండయాత్రల వలన ఈ ప్రాంతం వారి వశమై మౌలిక వసతులన్నీ పూర్తిగా ద్వంసమయ్యాయి.

ప్రస్తుతం, పట్టణంలోను, పరిసరాలలోను అనేక చారిత్రిక, సహజసిద్ధ స్థలాలకు ప్రసిద్ది పొందిన సవాయి మాధోపూర్ లోని సుప్రసిద్ధ ప్రదేశాలలో ప్రధాన నగరానికి 11 కి. మీ దూరంలో వున్న రణథంబోర్ నేషనల్ పార్క్, రణథంబోర్ కోట ఉన్నాయి. సవాయి మాధో పూర్ లోని ఆకర్షణలు అనేక చారిత్రిక, పురావస్తు, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన పర్యాటక ఆకర్షణలు గల ఈ నగరం లో రణథంబోర్ నేషనల్ పార్క్, సవాయి మాన్ సింగ్ అభయారణ్యం, రామేశ్వరం ఘాట్ వంటి సందర్సించ దగిన ప్రాంతాలు ఉన్నాయి. రణతంబోర్ కోట, హాన్దార్ కోట, సమేతోన్ కీ హవేలీ ఈ నగర పరిసరాల్లోని ప్రధాన చారిత్రిక ప్రదేశాలు.

అమరేశ్వర మహాదేవ ఆలయం, చమత్కార్జి జైన దేవాలయం, కైల దేవి ఆలయం, చౌత మాత దేవాలయం, ప్రసిద్ధ శ్రీ మహావీర్జి దేవాలయం వంటి ప్రధాన దేవాలయాలతో బాటుగా సవాయి మాధో పూర్ అనేక దేవాలయాలు, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన ప్రాంతాలతో నిండిఉంది. ఈ ఆకర్షణలు సందర్శకులను భారత దేశ అద్భుత మైన చరిత్రతో బాటుగా, రాజస్తాన్ సంపన్న సంస్కృతి లోనికి తీసుకు వెళ్తాయి.సవాయి మాధో పూర్ కు దగ్గరగా గల దౌసా, టోంక్, బుండి, కరౌలి వంటి అనేక ఇతర పట్టణాలు కూడా తమ ప్రత్యేక చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.

పండుగలు, ఉత్సవాలు, ఆహారంసవాయి మాధో పూర్ లోనిసంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఈ పట్టణానికి ప్రతి ఏటా ప్రసిద్ధ ఉత్సవాలు జరిగేటప్పుడు రావాలి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు అనేక దేవాలయాలు, ధార్మిక ప్రాంతాలలో జరుగుతాయి.

సవాయి మాధో పూర్ లో దొరికే మాధో పూర్ జామకాయలు వాటి రుచి కి, నాణ్యతకు పేరు పొందాయి. సంప్రదాయ నృత్యాలకు పేరు పొందిన ఈ ప్రాంతంలోని నృత్యాలలో సవాయి మాధో పూర్ నృత్యం, ఘూమార్ నృత్యం, కల్బేలియ నృత్యం ప్రసిద్ధమైనవి.

సవాయి మాధో పూర్ చేరడం

సవాయి మాధో పూర్ కు భారతదేశం లోని ప్రధాన నగరాల నుండి చక్కటి రోడ్డు, రైలు సౌకర్యం ఉంది. వాయు మార్గాన చేరదలుచుకొన్న పర్యాటకులకు సవాయి మాధో పూర్ నుండి 154 కిలోమీటర్ల దూరంలో గల జై పూర్ విమానాశ్రయం దగ్గరి మార్గం.వాతావరణం వేడి పొడి వేసవి కాలం, వేడి ఆర్ద్ర వర్షాకాలాలను కల్గిన ఈ ప్రాంతంలో సాధారణ౦గా ఉప ఉష్ణ మండల వాతావరణం ఉంటుంది. వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉండే శీతాకాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.

సవాయి మాధో పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సవాయి మాధో పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సవాయి మాధో పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సవాయి మాధో పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా : సవాయి మాధోపూర్ కు చేరడానికి ఇంకొక అనువైన మార్గం రోడ్డు మార్గం. ఈ నగరానికి తరుచుగా ఉండే బస్సులు, టాక్సీల ద్వారా ఇక్కడకు సులభంగా చేరవచ్చు. ఈ రాజస్తాన్ పట్టణానికి అనేక ప్రధాన నగరాలనుండి బస్సులు కలవు. ప్రయాణాలన్నింటిలోకి చవకైన బస్సు ప్రయాణానికి ఇక్కడి నుండి జై పూర్ కు సుమారు 100 రూపాయలు ఖర్చు ఔతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా : ఢిల్లీ నుండి ముంబై వెళ్ళే ప్రధాన మార్గం పై వున్న మాధోపూర్ రైల్వే స్టేషన్ నుండి అనేక ప్రధాన ప్రాంతాలకు చాల రైళ్ళు ఉన్నాయి. చెన్నై. పూణే, ఢిల్లీ, ముంబాయి, జై పూర్ , లక్నో, అహ్మదాబాద్, భోపాల్, అమృత్ సర్, ఎర్నాకులం, డెహ్రాడూన్ వంటి ప్రధాన స్టేషన్ల నుండి ఇక్కడకు నేరుగా రైళ్ళు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వార : 154 కిలోమీటర్ల దూరంలో ఉన్న జై పూర్ విమానాశ్రయం సవాయ్ మాధోపూర్ కు దగ్గరగా గల విమానాశ్రయం. భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలనుండి ఇక్కడకు తరచుగా విమానాలు ఉన్నాయి. ఇక్కడి నుండి కొన్ని ప్రముఖ విదేశీ ప్రాంతాలకు కూడా కొన్ని అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుండి పర్యాటకులు టాక్సీలు, బస్సుల ద్వారా సవాయి మాధో పూర్ కు సులభంగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue