Search
  • Follow NativePlanet
Share

కరౌలి - పవిత్రతకు మరో పేరు

17

కరౌలి రాజస్ధాన్ రాష్ట్రంలో ఒక జిల్లా ఇది జైపూర్ కు 160 కి.మీ.ల దూరంలో కలదు. సుమారు 5530 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గతంలో దీనిని అక్కడకల ప్రముఖ దేవత కళ్యాణి పేరుపై కళ్యాణపురి అనేవారు. కరౌలిలో సుమారు 300 దేవాలయాలకు పైగా ఉండటంతో రాజస్ధాన్ లో ఈ జిల్ల ఎంతో పవిత్ర స్ధలంగా పేరు పడింది. ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంపై అనేక దండయాత్రలుండటంతో జిల్లా మొత్తాన్ని ఒక కోటవలే నిర్మించారు. ఎర్రటి రాతితో గోడలు ఎత్తుగా నిర్మించారు. ఇపుడవి కొంతమేరకు శిధిలం అయి కనపడతాయి. ఈ గోడకు 6 ప్రవేశపు గేట్లు మరియు వివిధ ప్రదేశాలలో బురుజులు వంటివి కోటను బలంగా ఉంచాయి.

కరౌలి దాని కొండలు, లోయలతో సముద్ర మట్టానికి సుమారు 902 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో అధిక ఎత్తు కల శిఖరం 1400 అడుగుల ఎత్తు. ఇతిహాసాల మేరకు ఈ రాష్ట్రం సుమారు క్రీ.శ 995 లో శ్రీ క్రిష్ణుడి వంశానికి చెందిన 88వ రాజు రాజా బిజయ్ పాల్ జేడన్ కనుగొన్నాడు. అయితే అధికారికంగా మాత్రం దీనిని క్రీ.శ. 1348 లో యాదవ వంశ రాజపుత్రుడైన రాజా అర్జున్ పాల్ కనుగొన్నట్లు తెలుస్తోంది. కరౌలి జిల్లా దాని ఎర్రటి రాతి శిల్ప శైలికి ప్రసిద్ధి చెంది వివిధ బ్రహ్మాండమైన చారిత్రక కట్టడాలు అంటే సిటీ ప్యాలెస్, తిమ్మన ఘర్ కోట, కైలా దేవి దేవాలయం, మదన్ మోహన్ జీ దేవాలయం, మహావీర్ జైన్ దేవాలయం మొదలైనవి కలిగి ఉంది. సిటి ప్యాలెస్ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక వారసత్వ సంపద.

జాతర్లు, పండుగలు

ఉత్తర భారతంలో జాతర్లు అధికంగా చేస్తారు. కైలా దేవి దేవాలయంలో చైత్ర మాసం అంటే మార్చి ఏప్రిల్ నెలలలో పదిహేనురోజుల కొక జాతర చేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు దూర ప్రదేశాలనుండి కూడా వస్తారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలనుండి కూడా వచ్చి మాత ఆశీస్సులు పొందుతారు. కరౌలిలో స్ధానికులు హస్త కళలే తమ నైపుణ్యంగా భావించి తమ జీవనం సాగిస్తారు. కరౌలి ఎలా చేరాలి?

జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం మరియు గంగాపూర్ రైలు స్టేషన్ కరౌలి చేరేందుకు అనుకూలంగా ఉంటాయి. రోడ్డు ప్రయాణంలో కూడా వివిధ ప్రదేశాలనుండి సౌకర్యవంతంగానే చేరవచ్చు. కరౌలి సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం.

 

కరౌలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కరౌలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కరౌలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కరౌలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కరౌలి నుండి గంగా పూర్ (35 కి. మీ.) , జైపూర్ లకు ప్రతి రోజూ బస్సులు నడుస్తాయి. పర్యాటకులు ప్రభుత్వ లేదా ప్రయివేటు వాహనాలలో రాజస్ధాన్ లోని ఏ ప్రాంతానికైనా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కరౌలికి 35 కి.మీ.ల దూరంలో గంగాపూర్ రైలు స్టేషన్ కలదు. దేశంలోని ప్రధాన నగరాలనుండి ఈ రైలు స్టేషన్ కు రైళ్ళు ప్రతిరోజూ నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం కరౌలికి సమీప విమానాశ్రయం. విమానాశ్రయంనుండి టాక్సీలు లభ్యంగా ఉంటాయి. విదేశీ పర్యాటకులు న్యూఢిల్లీ లేదా ముంబై లోని అంతర్జాతీయ విమానాశ్రయాలనుండి ప్రతిరోజూ నడిచే విమానాలలో కరౌలి సమీప విమానాశ్రయానికి చేరి అక్కడనుండి టాక్సీలలో కరౌలి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed