Search
  • Follow NativePlanet
Share

ఢిల్లీ - దేశ రాజధాని నగరం !

346

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశం లోని పెద్ద నగరాల లో ఒకటి మాత్రమె కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది.

ఢిల్లీ పేరును హిందీ లో 'దిల్లి ' అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరం గా పేరొందింది.

పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్ల తో ఢిల్లీ లోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి. అంతే కాదు, దేశ రాజధాని అయిన కారణంగా, దేశం లో జరిగే ప్రతి ఒక్క రాజకీయ కార్యకలాపానికి కేంద్ర బిందువుగా వుండి ప్రతి వారు తప్పక చూడవలసిన ప్రదేశంగా వుంటుంది.

భౌగోళికత మరియు వాతావరణం

సముద్ర మట్టానికి సుమారు 0 – 125 మీటర్ల ఎత్తులో కల ఈ నగరం ఇండియా కు ఉత్తరంగా కలదు. తూర్పు దిశగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, దక్షిణపడమర, ఉత్తరం లలో హర్యానా తోను సరిహద్దులు కలిగి వుంది. భౌగోళికంగా ఢిల్లీ రెండు ప్రధాన అంశాలు కలిగి వుంది. ఒకటి ఢిల్లీ కొండ ప్రాంతం కాగా, రెండవది యమునా నది వరద ప్రాంతాలు. యమునా నది రాజధాని నగరం గుండా ప్రవహించే ఒక ప్రధాన నది.

ఢిల్లీ వాతావరణ పరిస్థితులు

ఢిల్లీ ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణంకలిగి వుంది.. వేసవులు అధికంగా వేడిగానూ, పొడిగానూ, చలికాలం అతి శీ తలంగానూ వుంటాయి. చలికాలం లో దేశ రాజధాని పూర్తి పొగమంచు కలిగి వుంటుంది.. వేసవులు ఏప్రిల్ నెలలో మొదలై జూన్ చివరి వరకూ, వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకూ వుంటాయి. నవంబర్ నుండి శీతా కాలం మొదలవుతుంది.

రాజధాని నగర్ సంస్కృతి గొప్పదనం

ఢిల్లీ కి గల చరిత్ర దాని సంస్కృతి. చాలా విభిన్నం. హిందువుల ప్రధాన పండుగలు దీపావళి నుండి మహావీర్ జయంతి వరకు, హోలీ, కృష్ణ జన్మాష్టమి ల నుండి గురు నానక్ జయంతి వరకూ ఇక్కడ జరుపుతారు. . కుతుబ్ పండుగ, వసంత పంచమి, వరల్డ్ బుక్ ఫెయిర్, ఇంటర్నేషనల్ మంగో ఫెస్టివల్ వంటివి కూడా జరుగుతాయి.

ఢిల్లీ ప్రదేశం మొఘలాయి వంటకాలకు పుట్టినిల్లు. ఇక్కడి ఆహారపుతలవాట్లపై, మొఘలాయి వంటకాల ప్రభావం అధికంగా వుంటుంది. కాని, భారతీయ వంటకాలు కూడా ఇక్కడ కలవు. ఢిల్లీ సాంప్రదాయక వంటకాలు అంటే, కడాయి చికెన్, బట్టర్ చికెన్, చాట్ లు, జిలేబి, కచోరి, లస్సి మొదలైనవి గా వుంటాయి.

వివిధ భిన్న వైవిధ్యం కల ఈ ఢిల్లీ లో మీరు చూడ తగిన ప్రదేశాలు పరిశీలిస్తే...

ఢిల్లీ నగరం పూర్తిగా గతించిన కాల చరిత్రలోని ఎన్నో నిర్మాణ అద్భుతాలు కలిగి వుంది.. కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేటు, లోటస్ టెంపుల్ , అక్షరధాం దేవాలయం వంటివి ఉదాహరణలు. పర్యటనా స్థలాలకే కాక అనేక వస్తువులను తమ అభిరుచి తో కొనుగోలు చేసే వారికి ఢిల్లీ ఒక షాపింగ్ పారడైస్ గా కూడా పేరు పొందింది.

సందర్శకులకు ఇన్ని అంశాలను అందించే ఢిల్లీ నగరం భారతీయ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రం గా కూడా కలదు. ఈ దేశ రాజధాని లో పార్లమెంట్ హౌస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నివాసమైన రాష్ట్రపతి భవన్, మహాత్మా గాంధి ని సమాధి చేసిన రాజఘాట్, వంటి పర్యాటక కేంద్రాలకు నిలయమై వుంది.

ఇంతే కాదు, మీరు చరిత్ర ప్రియులైతే, ఢిల్లీ ని ఒకసారి తప్పక దర్శించాలి. ఢిల్లీ ఒక రాజధానిగా ఎన్నో సామ్రాజ్యాలకు ఆలంబనగా విస్తారమైన చరిత్ర కలిగి వుంది. ప్రఖ్యాత కుతుబ్ కాంప్లెక్స్ నుండి రెడ్ ఫోర్ట్ వరకు మరియు చాలా గొప్ప సమాధుల నుండి చారిత్రక మెట్ల భావుల వరకు మరియు స్మారక చిహ్నాలు, ఎన్నో స్తూపాలు గతించిన చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ఇప్పటి వరకూ మీరు చదివినది ఢిల్లీ నగరం గురించి చాలా తక్కువ. ఢిల్లీ నగరం గురించి మీరు వాస్తవంలో తెలుసుకోవాలంటే, తప్పక దానిని దర్శించ వలసినదే. మరి ఒక్కసారి దర్శిస్తే చాలు, మీరు ఆనంద ఉత్సాహాలతో, ఎన్నో మధురానుభూతులతో మరొక్కసారి దానిని పర్యటించ వలసినదే.

 

ఢిల్లీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఢిల్లీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఢిల్లీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఢిల్లీ

  • రోడ్డు ప్రయాణం
    దేశం లోని ప్రతి రాష్ట్రం నుండి ఢిల్లీ కి ప్రభుత్వ బస్సు లు కలవు. దేశం లోని వివిధ భాగాలను కలుపుతూ ఢిల్లీ కి అయిదు జాతీయ రహదారులు కలవు. ఇవి నెం.1,2,8,10 మరియు 24 లు. కనుక దేశం లోని ఏ ప్రదేశం నుండి అయినా సరే, తేలికగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం లో దేశం లో కల ఎ ప్రాంతం నుండి అయినా సరే ఢిల్లీ కి తేలికగా చేరవచ్చు. ఢిల్లీ లోనే అనేక రైలు స్టేషన్ లు కలవు. లోకల్ గా ప్రయాణం చేయాలంటే, ఢిల్లీ మెట్రో స్టేషన్ లు అనుకూలం. బస్సు రవాణా కంటే కూడా చవకగా వుండి వేగంగా చేరుస్తాయి. ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ , ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ , ఓల్డ్ ఢిల్లీ మరియు సారాయి రోహిల్ల ప్రధాన రైలు స్టేషన్ లు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఢిల్లీ లోని అంతర్జాతీయ విబానాస్రయం స్థానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయం గా సేవలను అందిస్తుంది. బెంగుళూరు, పూణే, ముంబై, మొదలగు ప్రధాన నగరాల నుండి విమానాలు కలవు. ఈ ఎయిర్ పోర్ట్ ప్రపంచం లోని ప్రధాన ప్రదేశాలకు చక్కని విమాన సేవలను అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed