జగాద్రి – దేవాలయాల నగరం !!

హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జంట నగరాల్లో భాగమైన జగాద్రి పట్టణమే కాక పురపాలక సంఘం కూడా. ఇది జంట నగరాలలోని పాత భాగం. అత్యుత్తమ నాణ్యత కలిగిన లోహం, ప్రత్యేకంగా అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్  తయారీకి ఈ పట్టణం ప్రసిద్ది పొందింది. పైగా జగాద్రి లో వివిధ రకాల వ్యాపారాలు, కలప వ్యాపారలం కూడా జరుగుతాయి.జగాద్రి పర్యాటకులకు ఒక ధార్మిక అనుభవం కూడా అందిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లత్ మార్ మందిర్, ఖేరా మందిర్, గౌరీ శంకర్ మందిర్, మానసా దేవి మందిర్, గుగా మడి మందిర్ లాంటి చాలా ప్రాచీన దేవాలయాలు వున్నాయి.

జగాద్రి లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు పర్యాటకుల్లో ఆసక్తి కలిగించే చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు జగాద్రి పర్యాటకం అందిస్తుంది. కాళేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, బిలాసపూర్, పంచముఖీ శ్రీహనుమాన్ మందిర్, కపాల్ మోచన్, చచ్రౌలి, తేజావాలా, ఆది బద్రి చనేటి లాంటి ప్రదేశాలు వాటిలో కొన్ని.జగాద్రి వాతావరణం జగాద్రి లో ఉష్ణ మండల వాతారణం వుంటుంది, ఇక్కడి వేసవులు చాలా వేడిగా, తేమగా ఉంటూ శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి.

ఈ నగరంలో ప్రధానంగా మూడు ఋతువులు వున్నాయి – వేసవి, వానాకాలం, శీతాకాల౦.జగాద్రి ఎలా చేరుకోవాలి ?భారత దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానం చేసి వుండడం వల్ల జగాద్రి కి తేలిగ్గానే చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...