Search
 • Follow NativePlanet
Share

హిసార్  - ఉక్కు నగరం !

27

హిసార్ హర్యానా రాష్ట్రంలో హిసార్ జిల్లా యొక్క పాలనా కేంద్రంగా ఉన్నది. న్యూ ఢిల్లీ కి పశ్చిమాన 164 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వలసదారులను ఆకర్షించడానికి మరియు ఢిల్లీ పెరుగుదలకు ప్రత్యామ్నాయ కేంద్రంగా అభివృద్ధికి జాతీయ రాజధాని పరిధిలో కౌంటర్ అయస్కాంత నగరంగా గుర్తించబడింది. హిసార్ లో ఎక్కువగా ఉండుట వల్ల 'ఉక్కు నగరం' అని అంటారు.

హిసార్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

హిసార్ లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. డిసెంబర్ 1860 నుంచి నాలుగు సంవత్సరాల్లో నిర్మించిన సెయింట్ థామస్ చర్చి ఒక ప్రధాన ఆకర్షణగా ఉన్నది. సెయింట్ థామస్ చర్చి యేసు క్రీస్తు యొక్క పన్నెండు విభాగాలలో ఒకటిగా అంకితం చేయబడింది. ఆ కాలంలో దీని నిర్మాణానికి Rs.4500 ఖర్చు అయినది. చర్చి యొక్క రూపకల్పన మరియు నిర్మాణం విక్టోరియన్ శైలిలో ఉంటుంది.

అగ్రోహలో అగ్రోహ ధామ్ లేదా అగ్రోహ ఆలయం ఉన్నది. ఈ ఆలయ సముదాయంలో కూడా శక్తి సరోవర్ పేరుతో ఒక పెద్ద చెరువు,యోగా మరియు అనుబంధ చికిత్సల ద్వారా రోగులకు చికిత్స కోసం ఒక ప్రకృతి కేంద్రం ఉన్నాయి.

పర్యాటకులు హిసార్ నగరం నుండి తూర్పుకు సుమారు 52 కిమీ దూరంలో ఉన్న ఒక పెద్ద చారిత్రక గ్రామం లోహరి రాఘో ను సందర్శించండి. మూడు చారిత్రాత్మక పుట్టలకు కేంద్రంగా ఉంది. దీని మూలాలు సోది -సిస్వాల్ సిరామిక్ కాలంలోనే గుర్తించవచ్చు. ఈ పుట్టలు ఆర్కియాలజీ మరియు మ్యూజియం హర్యానా శాఖ అధికారులు దూప్ సింగ్ మరియు చందెర్పాల్ సింగ్ లచే 1980 లో వెలికితీయబడ్డాయి.

అగ్రోహ నుండి 1.5 కి.మీ. దూరంలో ఉన్న మట్టిదిబ్బకు అగ్రోహ దిబ్బ అని పేరు పెట్టబడిన ఒక పురావస్తు ప్రదేశము. అగ్రోహ దిబ్బలు 3 మరియు 4 వ శతాబ్దం BC నుండి 13 వ మరియు 14 వ శతాబ్దం AD కాలం నాటివని నమ్ముతారు. ఒకవైపు చారిత్రక అంశాలు మరొక వైపు షీలా మాతా ఆలయంను ఒక ఆలయ సముదాయంలో చూడవచ్చు.

రాఖీ షాపూర్ మరియు రాఖీ ఖాస్ అని పిలిచే రాఖిగార్హి అనే గ్రామము చారిత్రక ప్రాధాన్యత భారతదేశం యొక్క ఆర్కియాలజికల్ సర్వే లో మొదటి నిర్వహించిన త్రవ్వకాల్లో 1963 లో మళ్లీ 1997 లో కనుగొనబడింది. గ్రామం అభివృద్ధి చెందుతున్న 2.2 km చతురస్రాకార నగరం మరియు హరప్పా మరియు సింధు నాగరికతలో ఒక భాగంగా ఉండేది.

ఒక పురాతన గుంబద్ హిసార్ నగరం మధ్యలో ఉన్న 14 వ శతాబ్దం AD లో నివసించిన ఒక ఆధ్యాత్మిక గురువు బాబా పన్నీర్ బాద్షా సమాధిని సందర్శించవచ్చు. ఈ చతురస్రాకార సమాధి దాని నాలుగు వైపులా ఓపెనింగ్ వంపులను కలిగి ఉంది.

నగరంలో ఐదు ప్రధాన ఎంట్రీ గేట్లలో ఒకటైన బార్సిలో గేట్ హన్సి నగరానికి దక్షిణాన మరియు హిసార్ నగరానికి 26 km దూరంలో తూర్పున ఉన్నది. మిగిలిన గేట్లు ఢిల్లీ గేట్,హిసార్ గేట్,గోసైన్ గేట్ మరియు ఉమ్రా గేట్ లుగా ఉన్నాయి. 12 వ శతాబ్దం లో ప్రముఖ రాజ్ పుట్ యోధుడు పృథ్వీరాజ్ చే నిర్మించబడిన పృథ్వీరాజ్ ఫోర్ట్ ను సందర్శించవచ్చు.

ఇక్కడ మరొక ఆకర్షణ దుర్గహ్ చార్ కుతుబ్ లేదా హన్సి లో నలుగురు సుఫీ సన్యాసుల స్మృతి చిహ్నంగా కాంప్లెక్స్ ఉన్నది. ఇక్కడ గొప్ప సుఫీ సన్యాసులు జమాల్-ఉద్-దిన్ హన్సి,బర్హాన్-ఉద్-దిన్,కుతుబ్-ఉద్-దిన్ మనువర్ మరియు నూర్-ఉద్-దిన్ లను సమాధి చేశారు.

చివరిగా మీరు 1354 AD లో ఫిరుజ్ షః తుగ్లక్ నిర్మించిన ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్ ను సందర్శించవచ్చు. ఈ రాజభవనంలో లాట్ కి మసీదు అనే పేరు గల ఒక మసీదు ఉన్నది. ఇది 20 అడుగుల ఎత్తైన అధిక ఇసుకరాయి స్థూపం నిర్మితమైంది.

చరిత్రహిసార్ చరిత్ర హిసార్-ఇ-ఫిరోజా వంటి ఫిరోజ్ షా తుగ్లక్ ద్వారా 1354 AD లో స్థాపించబడింది. 1351 నుండి 1388 వరకు ఢిల్లీ సుల్తానేట్ పాలించిన అతను ఒక కాలువ ద్వారా నగరానికి యమునా నది జలాలను తీసుకొచ్చెను. ఒకప్పుడు నగరంలో ఘగ్గార్ మరియు ద్రిశాద్వాటి అనే రెండు నదులు ఉపదేశించినట్లు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి రూపు రేఖలు మారిపోయాయి.

హిసార్ ను 3 వ శతాబ్దం BC లోమౌర్యులు,14 వ శతాబ్దంలో తుగ్హ్లాగ్ లు,16 వ శతాబ్దంలో మొఘల్ లు మరియు19 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు పాలించారు. స్వాతంత్ర్యము తరువాత పంజాబ్ లో భాగం అయ్యింది. అయితే 1966 లో పంజాబ్ విభజన జరిగాక హర్యానా లో భాగమైంది.

హిసార్ చేరుకోవడం ఎలాహిసార్ ను విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

హిసార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హిసార్ వాతావరణం

హిసార్
36oC / 96oF
 • Sunny
 • Wind: NNE 5 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం హిసార్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? హిసార్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం హిసార్ ఢిల్లీ, హర్యానా ప్రధాన నగరాలు మరియు పొరుగు రాష్ట్రాలకు అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ నుండి రహదారి ద్వారా 2 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. నగరంనకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సుల సేవలు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  హిసార్ లో రైల్వే స్టేషన్ హిసార్ JN
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం హిసార్ లో విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం ఢిల్లీ విమానాశ్రయం. ఇక్కడ నుండి మీరు హిసార్ ఒక ఎక్స్ప్రెస్ రైలు ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి హిసార్ 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం హిసార్ ఢిల్లీ, జైపూర్,అమృత్సర్ మరియు అలహాబాద్ వంటి భారతీయ నగరాలకు బాగా అనుసందానం కలిగి ఉంది. ఢిల్లీ నుండి హిసార్ కు నడుస్తున్న కొన్ని రైళ్లు లాల్ ఖ్వుయిలా ఎక్స్ప్రెస్, UA తూఫాన్ ఎక్స్ప్రెస్,గోరక్డం ఎక్స్ప్రెస్,కిసాన్ ఎక్స్ప్రెస్ మరియు విక్రంశిల ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Nov,Tue
Return On
25 Nov,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
24 Nov,Tue
Check Out
25 Nov,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
24 Nov,Tue
Return On
25 Nov,Wed
 • Today
  Hisar
  36 OC
  96 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Hisar
  32 OC
  89 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Hisar
  32 OC
  89 OF
  UV Index: 9
  Partly cloudy