అల్వార్ – అద్భుతాల సమ్మేళనం !!

అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా పిలవబడిన ఈ ప్రాంతంలో పాండవులు మారువేషాలలో తమ అరణ్యవాసం తర్వాత 13 వ సంవత్సరాన్ని అజ్ఞాత వాసంగా గడిపారని విశ్వసిస్తారు.

చారిత్రికంగా ఈ ప్రాంతాన్ని మేవార్ అని కూడా అంటారు. అల్వార్ అందమైన సరస్సులు, గొప్ప భవనాలు, అద్భుతమైన దేవాలయాలు, దివ్యమైన స్మారక కట్టడాలు, కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. కోటలు, భవనాలు, సరస్సులు, మ్యూజియం, ఇంకా ఎన్నో...అల్వార్ కు వచ్చే పర్యాటకులు బాల ఖిలా అనబడే అల్వార్ కోటను చూడవచ్చు. దీనిని హసన్ ఖాన్ మేవాటి 1550 లో నిర్మించాడు. కట్టడపు పని, భవన నమూనా వైభవం పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

కోటకు జై పోల్, లక్ష్మణ్ పోల్, సూరత్ పోల్, చాంద్ పోల్, అంధేరీ గేటు, కృష్ణ గేటు అనే ఆరు ద్వారాలు ఉన్నాయి. సిటీ భవనం, విజయ మందిరం అల్వార్ లోని ఇతర నిర్మాణ అద్భుతాలు. మొదటి భవనం నిర్మాణ శైలికి, మ్యూజియానికి ప్రసిద్ది. విజయ మందిరం అద్భుతమైన 105 గదులు, అందమైన ఒక తోట, ఒక సరస్సులకు ప్రసిద్ది.జై సమాండ్ సరస్సు, సిలి సెర్ సరస్సు, సాగర్ సరస్సు కూడా ఈ ప్రాంతంలోని ఇతర పర్యాటక ఆకర్షణలు. పర్యాటకులు మూసి మహారాణికి చాత్రి, త్రిపోలియ, మోతీ డూ౦గ్రీ, భంగర్ శిధిలాలు, కంపెనీ బాఘ్, క్లాక్ టవర్, ప్రభుత్వ మ్యూజియం, ఫతెహ్ జంగ్ సమాధి, కలాకాండ్ మార్కెట్, నలదేశ్వర్లను అల్వార్ సందర్శిస్తున్నప్పుడు చూడవచ్చు.

అల్వార్ చేరుకోవడం పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వార అల్వార్ చేరవచ్చు. జై పూర్ లోని సంగానేర్ విమానాశ్రయం అల్వార్ కు సమీపంలో ఉంది. విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతానికి న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. అల్వార్ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ, జై పూర్ కు చక్కటి రైలు సౌకర్యం ఉంది. క్యాబులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ రెండు ప్రాంతాల నుండి అందుబాటులో ఉన్నాయి. ప్రక్క నగరాల నుండి అల్వార్ కు బస్సులు, టాక్సీలు ఉన్నాయి.

అల్వార్ ప్రాంతంలో వాతావరణ౦ ఏడాది పొడవున పొడిగా ఉంటుంది. అల్వార్ లో పర్యటించడానికి అక్టోబర్ నుండి మార్చ్ మధ్య ఉన్నకాలం ఉత్తమమైనది.

Please Wait while comments are loading...