సరిస్క _ బహుముఖ పర్యాటక కేంద్రం

 రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో జై పూర్ కు 110 కి.మీ. దూరంలో గల సరిస్క ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 1955 వ సంవత్సరం లో స్థాపించిన సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు గల ప్రాంతంగా ఇది ప్రసిద్ది చెందింది.1979 వ సంవత్సరం లో రిజర్వు నుండి నేషనల్ పార్క్ గా మార్చిన ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది.

సరిస్క టైగర్ రిజర్వు

పులి, చిరుతపులి, జింక, నిల్గై, లాంగుర్, హైన, సాంబార్, గోల్డెన్ జాకాల్ వంటి వివిధ వన్య మృగాల జాతులు గల పరిపూర్ణ జంగిల్ సఫారి గా సరిస్క నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందింది. కింగ్ ఫిషర్, సాండ్ గ్రౌజ్, గోల్డెన్ బ్యాక్ , వుడ్ పెకర్ వంటి పక్షులను ఈ పార్క్ పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. ప్రైవేటు వాహనాలను ఈ టైగర్ రిజర్వు లోపలకు అనుమతించరు, యాత్రికులు ఇక్కడ దొరికే జీపులు, ఏనుగు సఫారీ ల ద్వారా మాత్రమే ఈ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో తిరగవచ్చు.

కోటలు, దేవాలయాలు, సరస్సులు

సరిస్క లో చాలా కోటలు, దేవాలయాలు, సరస్సులు ఉన్నాయి.

17 వ శతాబ్దంలో జై సింగ్ II నిర్మించిన కంకవరి కోట గొప్ప చారిత్రిక ప్రాముఖ్యతను కల్గి ఉంది. భాన్ ఘర్ కోట, ప్రతాప్ ఘడ్ కోట, అజబ్ ఘడ్ కోట ఈ ప్రాంతంలోని ఇతర స్మారక కట్టడాలు. దేశం నలు మూలల నుండి భక్తులను ఆకర్షించే పాండుపోల్ లోని హనుమాన్ దేవాలయం, నీలకంఠ మహాదేవ దేవాలయం , భర్తృహరి దేవాలయం వంటి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గల రెండు అందమైన నీటి వనరులు సిల్సేర సరస్సు, జై సమాండ్ సరస్సులను మనోరంజకమైన పిక్నిక్ కేంద్రాలుగా పరిగణిస్తారు. జై సింగ్ మహారాజ వేటాడటానికి వచ్చిన్నప్పుడు విడిదిగా ఉపయోగించిన సరిస్క ప్యాలెస్ ఈ ప్రాంతపు మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

సరిస్క ను చేరుకోవడం

రాజస్థాన్ లోని అన్ని నగరాల నుండి సరిస్కకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. సరిస్క నుండి 200 కి. మీ దూరంలోని డిల్లీ,130 కి.మీ. ల దూరంలోని జై పూర్ ల నుండి కూడ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. 110 కి.మీ. దూరం లో ఉన్న జై పూర్ లోని సంగనేర్ సమీప విమానాశ్రయం.

అంతేకాక, సరిస్క నుండి 36 కి.మీ. దూరంలోని ఆల్వార్ రైల్వే స్టేషన్ నుండి కూడ పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరవచ్చు.

సరిస్క ను ఎప్పుడు సందర్శి౦చాలి ?

ఏడాది లో వాతావరణం చల్లగా ఉండే సెప్టెంబర్ నుండి మార్చి వరకు గల కాలం సరిస్క ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది. మార్చి – ఏప్రిల్ మధ్య జరుపుకొనే గంగౌర్ పండుగ ఈ ప్రాంతపు ప్రముఖ ఉత్సవం.

Please Wait while comments are loading...