నీలకంఠ మహాదేవ, సరిస్క

రాజస్థాన్ లోని సరిస్క నేషనల్ పార్క్ లోని నీలకంఠ మహాదేవ (నీలి రంగు కంఠం వున్న శివుడు) దేవాలయ సముదాయం ఉంది. ఇది సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు ప్రవేశ ప్రాంతం నుండి 32 కి.మీ. దూరం లో ఉంది.ఈ సముదాయంలో శిధిలావస్థలో గల 300 దేవాలయాలలో కొన్ని దేవాలయాలు ఇప్పటికి భక్తులతో పూజలందు కొంటున్నాయి. నీలకంఠ దేవాలయం చుట్టూ గల దట్టమైన అడవులు దీని అందాన్ని పెంచుతున్నాయి. శిధిలావస్థలో ఉన్నప్పటికి ఈ దేవాలయం ఒక పురాతన మ్యూజియాన్ని పోలి ఉంటుంది. 6వ, 13 వ శతాబ్దాలకు చెందిన ఈ దేవాలయ సముదాయం అధ్భుతమైన రాతి శిల్పాలను కల్గి ఉంది.

Please Wait while comments are loading...