Search
  • Follow NativePlanet
Share

సికార్ – చారిత్రకగాధల నగరం !!

13

సికార్, రాజస్తాన్ రాష్ట్ర౦లోని ఈశాన్యభాగం లో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పింక్ సిటీ జైపూర్ తరువాత బాగా అభివృద్ది చెందిన రెండవ ప్రాంతం, ఇది సికార్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతానికి ఝుంఝును జిల్లా, చురు జిల్లా, నాగౌర్ జిల్లా, జైపూర్ జిల్లాలను సరిహద్దులుగా కలిగి వుంది. షెఖావతి రాజులు పాలించిన ఠికానా సికార్ రాజ్యానికి రాజధాని అయిన ఈ నగరాన్ని చారిత్రికంగా ‘బీర్ భాన్ కా బాస్’ గా పిలిచేవారు.

పర్యాటక కేంద్రం....

రాజస్తాన్ లోని ప్రధాన పర్యాటక కేంద్రం సికార్ ప్రత్యేకంగా లక్ష్మణ్ గర్ కు పేరుగాంచింది. ఈ నగరం 1862 వ సంవత్సరంలో లక్ష్మణ్ సింగ్ మహారాజు నిర్మించిన లక్ష్మణ్ గర్ కోటకి ప్రసిద్ది. ఈ కోట లోని కుడ్య చిత్రాలు, షెఖావతి నిర్మాణ శైలి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నగరం సావంత్ రామ్ చోఖని హవేలీ, వంశీధర్ రతి హవేలీ, సంగనేరియ హవేలీ, మిరిజమల్ క్యాల హవేలీ, చార్ చౌక్ హవేలీ, కేడియా హవేలీ లకు కూడా ప్రసిద్ది చెందింది.

సికార్ కు వచ్చే పర్యాటకులు ఫతే పూర్ పట్టణాన్ని కూడా సందర్శించవచ్చు. దీనిని కాయంఖానీ ముస్లిం రాజు నవాబ్ ఫతే ఖాన్ స్థాపించాడు. ఈ ప్రాంతం రాచరిక కోటలు, హవేలీలు, ఆలయాలు, నవాబి బావోరీలు, చెరువులు, మసీదులు, సమాధులకు ప్రసిద్ది. సికార్ లోని ప్రసిద్ధ ఖతుశ్యామ్ జీ ఆలయానికి ఏడాది పొడవునా భారీ సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు. ఇక్కడ ఫిబ్రవరి, మార్చ్ నెలలలో ఖతుశ్యామ్ జీ ఉత్సవ౦ జరుగుతుంది. ఈ ఉత్సవంలో ఇక్కడి రంగుల జానపద సంస్కృతీ, కళా రీతులను ప్రదర్శిస్తారు. సమయం అనుకూలిస్తే, సికార్ ప్రయాణంలో పర్యాటకులు గణేశ్వర్, జీన్ మాతా, హరస్ నాథ్, రామ్ గర్, మాధో నివాస్ కోఠి ని కూడా సందర్శించవచ్చు.

సికార్ చేరుకోవడం

సికార్ జిల్లాకు చక్కటి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతానికి పింక్ సిటీ జైపూర్ లో సమీప విమానాశ్రయం ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కోల్కత్త, ముంబైతో పాటు భారతదేశంలోని ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. సికార్ రైల్వే స్టేషన్ కి జైపూర్, డిల్లీ, గంగానగర్, బికనేర్, చురు నుండి తరచూ రైళ్ళు ఉన్నాయి. సికార్ చేరడానికి రైల్వే స్టేషన్ నుండి, విమానాశ్రయం నుండి కాబ్స్ ఉన్నాయి. డిల్లీ, జైపూర్, జోధ్పూర్ బికనేర్ వంటి సమీప నగరాల నుండి ఈ ప్రాంతానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రాంతంలో సంవత్సరంలో చాలా భాగం వేడి-పొడి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చల్లగా ఉన్నందున ఈ సమయంలో సికార్ సందర్శనకు ఉత్తమం.

 

సికార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సికార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సికార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సికార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: డిల్లీ, జైపూర్, జోధ్పూర్, బికనేర్ వంటి నగరాల నుండి సికార్ కి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్ హెచ్ – 11 జాతీయ రహదారి జైపూర్, బికనేర్, దేశంలోని ఇతర ప్రాంతాలనుండి సికార్ కి అనుసంధానించబడి ఉంది. ఈ ప్రాంతానికి మంచి రోడ్డు ఏర్పాటుచేసే ఆలోచనతో ఈ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చబడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: పర్యాటకులు జైపూర్, డిల్లీ, గంగానగర్, బికనేర్, చురు వంటి ప్రాంతాల నుండి రైళ్ళ ద్వారా సికార్ చేరుకోవచ్చు. సికార్ రైల్వే స్టేషన్ షెఖావతి ప్రాంత ప్రధాన రైలు కేంద్రం. అద్దె కార్ల ద్వారా రైల్వే స్టేషన్ నుండి సికార్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణానికి ఉత్తమ మార్గం : సికార్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: గమ్యస్థానానికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సికార్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నై, గౌహాతి, హైదరాబాద్, కోల్కత్త, ముంబై తోపాటు భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ విమానాశ్రయం నుండి సికార్ చేరుకోవడానికి కాబ్స్ అందుబాటులో ఉన్నాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తార్పురా గ్రామం వద్ద చిన్న ప్రైవేట్ విమానాలు దిగడానికి ఒక చిన్న విమానాశ్రయం ఉంది, సరసమైన ధరలు చెల్లిస్తే ఈ విమానాలు దిగడానికి అనుమతిస్తారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed