Search
  • Follow NativePlanet
Share

నాగౌర్ – ఆకర్షించే నగరం !!

13

 

రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ చారిత్రక నగరం. దీనిని నాగ వంశ క్షత్రియులు కనుగొన్నారు. ఈ నగరం నాగౌర్ జిల్లాకి ప్రధాన కేంద్రం. ఇది బికనేర్, జోధ్పూర్ ల మధ్య వున్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

చరిత్ర, పురాణాలలో నాగౌర్

ఈ ప్రదేశం చరిత్ర ‘మహాభారత’ కాలం నాటిదని చెప్పవచ్చు. ఆహిచ్చత్రపుర రాజ్యం నాగౌర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉందని అంటారు. పురాణాల ప్రకారం, అర్జునుడు ఆహిచ్చత్రపూర్ ని స్వాధీనం చేసుకుని దానిని తన గురువైన ద్రోణాచార్యుల కి ఇచ్చాడు.

నాగౌర్ లో, దాని చుట్టూ చూడవలసినవి ఏమిటి?

ఇసుకతో కట్టబడిన నాగౌర్ కోటకు ఈ నగరం ప్రసిద్ది చెందింది. దీనిని 2 వ శతాబ్దంలో నాగవంశీయులు నిర్మించారు. ఈ కోటలో అందమైన భవనాలు, ఫౌంటైన్ లు, ఆలయాలు, తోటలు ఉన్నాయి. ఈ కోటతోపాటు నాగౌర్ లోని టర్కీన్ దర్గా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ దర్గాకు ఇస్లాం అనుచరుల ఎనలేని మత ప్రాముఖ్య౦ ఉంది.

పర్యాటకులు శెలవులలో నాగౌర్ పర్యటనకు వచ్చినపుడు ఈ నగరంలో కమ్లా టవర్ వెనుక ఉన్న జైన గాజు మందిరాన్ని కూడా చూడవచ్చు. ఇది పూర్తిగా గాజుతోచేయబడిన ప్రత్యేక నిర్మాణం. దీని అంతర్భాగం ఆకట్టుకునే గాజు పనితనంతో అందరి దృష్టిని మరింత ఆకర్షిస్తుంది. పర్యాటకులు 24 జైన తీర్థ౦కరులను చూడవచ్చు. ఇదికాకుండా, సైజికా టాంకా కూడా నాగౌర్ లో చూడదగిన ప్రసిద్ధ పర్యాటక స్థలం.

నాగౌర్, హాది రాణి మహల్, దీపక్ మహల్, అక్బారి మహల్, రాణి మహల్ వంటి మంత్రముగ్ధుల్ని చేసే రాజభవనాలకు కూడా ప్రసిద్ది చెందింది. ఈ రాజభవనాలు వాని అసాధారణ నిర్మాణం, లోపలి నమూనాలకు ప్రసిద్ది చెందాయి. నాగౌర్ సందర్శించేటపుడు పర్యాటకులు అమర్ సింగ్ రాథోర్, వంశీవాలా ఆలయం, నాథ్ జి కి ఛాత్రి, బర్లి సమాధులను కూడా చూడవచ్చు.

నాగూర్ చేరుకోవడం

వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా నాగౌర్ నగరాన్ని చాలా తేలికగా చేరుకోవచ్చు. దీనికి సమీపంలోని స్థానిక విమానాశ్రయం జోధ్పూర్ లో ఉంది. అయితే, విదేశీ పర్యాటకులు దగ్గరలోని న్యూ డిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. రోజువారీ విమానాల ద్వారా భారతదేశం లోని ప్రధాన ప్రాంతాలకు ఈ విమానాశ్రయం అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు రైళ్ళ ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. జైపూర్, జోధ్పూర్, బికనేర్, డిల్లీ నుండి ప్రతిరోజూ రైళ్ళు నాగౌర్ రైల్వే స్టేషన్ కి అనుసంధానించబడి ఉన్నాయి. అజ్మీర్, బికనేర్, డిల్లీ, జోధ్పూర్, జైపూర్ నుండి మంచి రోడ్ల ద్వారా నాగౌర్ కి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం

అడపా దడపా పడే వర్షాలతో నాగౌర్ వాతావరణం సంవత్సరం మొత్తం వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇక్కడి ప్రధాన కాలాలు, అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణం సాపేక్షంగా తేలికగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాగౌర్ సందర్శించ వచ్చని పర్యాటకులు సూచిస్తారు.

నాగౌర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగౌర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగౌర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగౌర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: పర్యాటకులు సెలవలలో నాగౌర్ యాత్ర చేయాలనుకుంటే, అజ్మీర్, బికనేర్, జోధ్పూర్, జైపూర్ నుండి బస్సులలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రాజధాని నగరమైన డిల్లీ నుండి కూడా ఈ ప్రాంతానికి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: నాగౌర్ రైల్వే స్టేషన్ కి , జైపూర్, జోధ్పూర్, బికనేర్, డిల్లీ వంటి భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల నుండి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి నాగౌర్ కి సరసమైన ధరలలో కాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలికగా నాగౌర్ చేరుకోవచ్చు. వాయు మార్గం ద్వారా: 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్, నాగౌర్ కి సమీప స్థానిక విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి ముంబై, డిల్లీ, జైపూర్ వంటి భారతదేశ ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. పర్యాటకులు కాబ్స్ ద్వారా జోధ్పూర్ విమానాశ్రయం నుండి నాగౌర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun