పోఖ్ రాన్ - ఎడారిలో వారసత్వ నగరం

పోఖ్ రాన్ రాజస్ధాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలో కల ధార్ ఎడారిలో ఒక వారసత్వ నగరం. దీని చుట్టూ అయిదు పెద్ద ఉప్పు కొండలు ఉంటాయి. అందుకే దీనిని అయిదు ఎండమావుల స్ధలంగా చెపుతారు. ఈ ప్రదేశం మొట్టమొదటి సారిగా భారతదేశం అనేక అణు పరీక్షలను ఇక్కడ చేయడంతో గుర్తింపులోకి వచ్చింది. మే 18, 1974 నాడు పోఖరాన్ ప్రదేశంలో భారత దేశపు మొదటి అణు పరీక్ష చేయబడింది. ఈ అణు పరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటే 'చిరునవ్వులో బుద్ధుడి చర్య ' అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం అక్కడకల హవేలీలు, స్మారకాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో బాబా రామ్ దేవ్ దేవాలయం ఒకటి. ఇది పోఖరాన్ కు 12 కి.మీ.ల దూరంలో రామ్ దేవరా గ్రామంలో కలదు. దేవాలయం పరిసరాలలో, రామ్ దేవ్ జీ సమాధి కలదు. రాజస్ధానీయులు ఇతడిని దేవుడుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రామ్ దేవరా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తారు.

ఈ ప్రదేశంలో మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పోఖరాన్ కోట, దీనినే బాలా ఘర్ అని కూడా పిలుస్తారు. దీనిని 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇది చంపావత్ నాయకులకు చెందినది. అందమైన శిల్ప శైలి మరియు కోటకు కల సువర్ణ చరిత్ర పర్యాటకులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. ఈ కోటలో ఒక మ్యూజియం కూడా కలదు. దానిలో రాజపుత్రుల కాలానికి చెందిన అనేక వస్తువులు, ఆయుధాలు, కుండలు వంటివి ఉంటాయి.

ఈ పట్టణం ప్రసిద్ధి చెందిన అనేక అందమైన రాజ ప్రాసాదాలకు నిలయం. ఈ రాజ ప్రాసాదాలలో పర్యాటకులు తప్పక చూడదగినవి...సలీమ్ సింగ్ కి హవేలి, పట్వోం జీ కి హవేలి మరియు నాధ్ మల్ జి కి హవేలి.

టూరిస్టులు, విమానం, రైలు, రోడ్డు మార్గాలలో పొఖరాన్ తేలికగా చేరవచ్చు. జోధ్ పూర్ రైలు స్టేషన్ మరియు జోధ పూర్ విమానాశ్రయాలు పోఖరాన్ కు సమీప ప్రాంతాలు. పర్యాటకులు జైపూర్, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ వంటి నగరాలనుండి పోఖరాన్ బస్ లలో కూడా చేరవచ్చు.

ఈ ప్రదేశం ఏడాది అంతా ఒక తీవ్రమైన వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఆహ్లాదకరంగను మరియు అనుకూలమైన దిగాను ఉండే శీతాకాలంలో పర్యాటకులు తమ పర్యటన చేయడం సూచించదగినది.

 

Please Wait while comments are loading...