Search
  • Follow NativePlanet
Share

జైపూర్ - పింక్ సిటీ

93

భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన భారత దేశం లోని మొదటి నగరం కూడా ఇదే .

హిందూ నిర్మాణ శైలి కి ఒక అద్భుత ఉదాహరణ అయిన ఈ ప్రాంతాన్ని ‘పీఠపాద’ లేదా ఒక ఎనిమిది భాగాల మండలం రూపంలో నిర్మించారు. ఖగోళ శాస్త్రంలో చక్కటి జ్ఞానం ఉన్న సవాయి జై సింగ్ మహారాజు 9 అంకెకు ప్రాధాన్యత నిచ్చి దీనిని, దీని గుణకాలను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. 9 అంకె 9 గ్రహాలను సూచిస్తుంది.

కోటలు, భవనాలు, రాజప్రాసాదాలకు ప్రసిద్ది చెందిన జైపూర్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. చారిత్రిక వారసత్వంతో బాటుగా దీని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు సుదూర ప్రాంతాలనుండి ప్రజలు వస్తారు. అంబర్ కోట, నహర్ ఘర్ కోట, హవా మహల్, షీష్ మహాల్, గణేష్ పోల్, జల మహల్ జైపూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో కొన్ని.

ఉత్సవాలు, పండుగలు

భవనాలు, కోటలతో బాటుగా ఈ ప్రాంతం అనేక ఉత్సవాలు, పండగలకు ప్రసిద్ది చెందింది. జనవరి లో నిర్వహించే జైపూర్ వింటేజ్ కార్ ర్యాలీ అటువంటి ప్రసిద్ధ సంవత్సరపు పండుగలలో ఒకటి. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఇటీవల బాగా ప్రసిద్ది చెందిన కార్యక్రమం. వాహన ప్రియులు మెర్సిడెస్, ఆస్టిన్, ఫియట్ వంటి పాత కార్ల అద్భుతమైన సేకరణను చూడవచ్చు. వీటిలో కొన్ని కార్లు 1900 కు చెందినవి.

ప్రతి ఏటా జైపూర్ లో హోలీ నాడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏనుగుల పండుగను నిర్వహిస్తారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఏనుగుల అందమైన ఊరేగింపులు ఈ ఉత్సవానికి జీవం పోస్తాయి. దీనితో బాటుగా, గంగౌర్ పండుగా కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది. గం అనగా శివుడని, గౌర్ అనగా పార్వతి అనే అర్ధం ఉంది. ఈ పండుగ వైవాహిక ఆనందానికి సంకేతం. ఈ నగరం లో జరిగే ప్రసిద్ధ ఉత్సవాలు, పండుగలలో బాన్ గంగ ఉత్సవం, తీజ్, హోలీ, చక్సు ఉత్సవం ఉన్నాయి.

విరామం

సాహస ప్రియులు ఒంటె స్వారి, హాట్ ఎయిర్ బెలూనింగ్, పార గ్లైడింగ్, పర్వతారోహణ వంటి క్రీడలతో వినోదించ వచ్చు. అన్వేషణ ఔత్సాహికులు కరౌలి, రణథంబోర్ నేషనల్ పార్క్ వంటి వాటికి విహార యాత్రకు వెళ్ళవచ్చు.

జైపూర్ లో షాపింగ్ పర్యాటకులకు నచ్చుతుంది. ఇక్కడ అనేక మార్కెట్లు ఇతర వస్తువులతో బాటు పురాతన వస్తువులు, ఆభరణాలు, తివాచీలు, కుండలు, రత్నాలు విస్తృత శ్రేణిలో అందిస్తున్నాయి. పర్యాటకులు హస్తకళా కృతులు, కళాఖండాలు, దుస్తులు, పేరుందిన దుస్తులు ఎం ఐ రోడ్డు నుండి కొనుగోలు చేయవచ్చు. జైపూర్ లోని స్థానిక మార్కెట్ లలో కొనుగోలు చేసినప్పుడు బేరసారాలు అవసరం.

విందులుఈ ప్రాంతం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి తో చేసిన రుచికరమైన కారపు వంటకాలకు ప్రసిద్ది చెందింది. దాల్ బాటి – చూర్మా, ఉల్లి కచోరి, కబాబ్, ముర్గ్ కో ఖాటో, అచారి ముర్గ్ ఈ నగరపు ప్రసిద్ధ వంటకాలలో కొన్ని. వీధి వంటలకు ప్రసిద్ది చెందిన నెహ్రు బజార్, జోహరి బజార్లలో భోజన ప్రియులు ఈ వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతపు స్థానిక మిఠాయిలైన ఘేవర్, మిష్రి కోవ, కోవా కచోరి దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందాయి.

జైపూర్  చేరుకోవడం

ఈ ప్రాంతానికి చక్కటి విమాన, రైలు, రోడ్డు సౌకర్యం ఉంది.

ఈ నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో జైపూర్ అంతర్జాతీయ విమానశ్రయ౦గా పిలువబడే సంగానేర్ విమానాశ్రయం ఉంది. ముంబాయి, చండీఘడ్, ఢిల్లీ, హైదరాబాదు వంటి ఇతర ప్రాంతాలకు ఇక్కడకు నుండి నిరంతరం విమానాలు ఉన్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుండి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు ఉన్నాయి. పర్యాటకులకు కొన్ని రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్ ఎస్ ఆర్ టి సి ) బస్సులు భారతదేశ ప్రధాన నగరాలనుండి లభిస్తాయి. న్యూ ఢిల్లీ నుండి నేరుగా జై పూర్ వరకు ఆర్ ఎస్ ఆర్ టి సి బస్సులు ఉన్నాయి. నగరంలో జైపూర్ నగర ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (జే సి టి ఎస్ ఎల్), వారి బస్సు సౌకర్యం సందర్శనకు ఉత్తమమైనది.

ఏడాది పొడవున ఈ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణం ఉంటుంది. వేసవికాలం విపరీతమైన వేడితో ఉండగా, శీతాకాలంలో గడ్డ కట్టించే చలి ఉంటుంది. వేసవికాలం లో జైపూర్ ను సందర్శించే పర్యాటకులు తేలికైన దుస్తులు, టోపీలు, సన్ స్క్రీన్ లోషన్, తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మార్చ్ నుండి అక్టోబర్ మధ్య ఉన్న సమయం ఈ పింక్ సిటీ సందర్శనకు ఉత్తమమైనది.

జైపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జైపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జైపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జైపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: పింక్ సిటీ జైపూర్ కి దేశంలోని అనేక ప్రాంతాలనుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. న్యూ డిల్లీ, ఆగ్రా నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఈ ప్రదేశం జైపూర్ తోపాటు డిల్లీ, ఆగ్రా గోల్డెన్ ట్రావెల్ సర్క్యూట్ లో ఒక భాగంగా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా: జైపూర్ రైల్వే స్టేషన్, రాజస్తాన్ రాష్ట్రానికి ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి భారతదేశం లోని ప్రధాన నగరాలకు రోజువారీ రైళ్ళు ఉన్నాయి. సాధారణ రైళ్ళలోనే కాకుండా, ప్రయాణీకులు ‘పాలెస్ ఆన్ వీల్స్’ అని పిలువబడే ప్రత్యెక రైలులో డిల్లీ నుండి జైపూర్ చేరుకోవచ్చు. ఇది జైపూర్, ఆల్వార్, ఉదయపూర్ తో సహా రాజస్తాన్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్ళే విలాసవంతమైన రైలు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రయాణానికి ఉత్తమ మార్గం జైపూర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం: సంగనేర్, జైపూర్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి డిల్లీ, ముంబై, ఔరంగాబాద్, ఉదయపూర్, జోధ్పూర్ వంటి భారతీయ నగరాల నుండి విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి టాక్సీల ద్వారా నగరానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue