హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు
 • 01సమోడ్ పాలెస్

  సమోడ్ పాలెస్

  జైపూర్ లోని సమోడ్ పాలెస్ వాస్తుకళకి, అద్భుతాలకి ప్రసిద్ది చెందింది. జైపూర్ నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఈ స్థలం ఇపుడు ఒక విలాసవంతమైన హోటల్. 4000 సంవత్సరాల నాటి ఈ రాజభవనంలో ప్రయాణీకులు సమోడ్ తోట, సమోడ్ కోట, దర్బార్ శిబిరాన్ని చూడవచ్చు.  

  + అధికంగా చదవండి
 • 02సిసోడియా రాణి తోట

  సిసోడియా రాణి తోట

  జైపూర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసోడియా రాణి తోట ప్రసిద్ది చెందినది. దీనిని 1728 లో సవాయ్ జయ్ సింగ్ రాజు తన భార్య సిసోడియా రాణి కోసం నిర్మించాడు. ఫౌంటెన్ లు, మంటపాలు, రంగుల వేదికలు ఉన్న ఈ తోట భారతీయ, మొఘల్ నిర్మాణ శైలి ప్రేరణతో నిర్మించబడింది....

  + అధికంగా చదవండి
 • 03సర్గసులి

  సర్గసులి

  ఇసర్ లాత్ గా ప్రసిద్ధమైన సర్గసులి ఒక యుద్ధంలో విజయానికి చిహానంగా 18 వ శతాబ్దంలో ఈశ్వరీ సింగ్ మహారాజు నిర్మించాడు. అయితే, రాజు ఒక సామాన్య వనితను ప్రేమించడంతో ప్రజలు అతన్ని అసహ్యించుకున్నారు. గాయిటర్ లో గౌరవం పొందని ఏకైక కచ్చావహా రాజు ఇతనే.  

  + అధికంగా చదవండి
 • 04మోతీ డూన్గ్రి

  మోతీ డూన్గ్రి

  మోతీ డూన్గ్రి లేదా పెరల్ హిల్ దగ్గరలోని రాజభవనం, మందిరం కారణంగా ప్రసిద్ది చెందాయి. జైపూర్ చివరి రాజైన రెండవ సవాయి మాన్ సింగ్ నివాసమైన ఈ రాజభవనం స్కాటిష్ కోటను పోలి ఉంది. తరువాత, ఇది రెండవ సవాయి మాన్ సింగ్ కుమారుడు జగత్ సింగ్ నివాసం అయింది. కొండపైన ఉన్న ఈ ఆలయంలో...

  + అధికంగా చదవండి
 • 05గల్తాజి

  గల్తాజి

  గల్తాజి, జైపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్మిక ప్రదేశం. గల్తాజీ ప్రాంగణంలో దేవాలయాలు, మంటపాలూ, సహజ నీటిబుగ్గలు ఉన్నాయి. ఈ స్థలం కొండ భూభాగాల మధ్య ఉంది. ఈ ఆలయంలో సూర్య దేవుడు ఉన్నాడు. దివాన్ క్రిపారాం నిర్మించిన ఈ ఎత్తైన శిఖరాన్ని నగరంలోని ప్రతి భాగంనుండి...

  + అధికంగా చదవండి
 • 06గణేష్ పోల్

  గణేష్ పోల్

  అంబర్ కోట లోని ప్రధాన భవనంలో ఉన్న గణేష్ పోల్ ను, రెండవ జై సింగ్ మహారాజు 1611- 1667 ల మధ్య నిర్మించాడు. అంబర్ కోట లో ఉన్న ఏడు ప్రధాన ప్రవేశ ద్వారాలలో గణేష్ పోల్ ఒకటి. రాజులు, వారి కుటుంబాలవారు కోటలోనికి, తమ వ్యక్తిగత గదులకు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు...

  + అధికంగా చదవండి
 • 07గాయ్టోర్

  గాయ్టోర్

  మాన్ సాగర్ సరస్సుకి ఎదురుగా జైపూర్-అంబర్ రోడ్డుపై ఉన్న గాయిటర్ జైపూర్ రాజుల సమాధులున్న ప్రదేశం. ఈ ప్రదేశంలో పాలరాయి, ఇసుకరాయి తో చేయబడిన పూర్వపు రాజుల గొడుగు లేదా చాత్రి ఆకారంలో ఉన్న సమాధులు ఉన్నాయి.  

  + అధికంగా చదవండి
 • 08బి ఎమ్ బిర్లా ప్లానిటోరియం

  బి ఎమ్ బిర్లా ప్లానిటోరియం

  బి ఎమ్ బిర్లా ప్లానిటోరియం, జైపూర్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ స్థలం సరికొత్త కంప్యూటరీకరణ ప్రదర్శన పద్ధతులను, అద్భుతమైన దృశ్య వినోదాన్నీ అందిస్తుంది. దేశంలో సైన్స్ మ్యూజియం కలిగిన ఆధునిక ప్లానిటోరియంలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు.  

  + అధికంగా చదవండి
 • 09గోవింద్ దేవ్ జీ ఆలయం

  గోవింద్ దేవ్ జీ ఆలయం

  జయ్ నివాస్ ఉద్యానవనంలో ఉన్న గోవింద్ దేవ్ జీ ఆలయం శ్రీ కృష్ణుడి కోసం నిర్మించారు. మొదట్లో ఈ దేవుడి విగ్రహాన్ని బృందావనం లోని ఒక గుడిలో ఉంచగా, తరువాత జైపూర్ ని పాలించిన రెండో సవాయ్ జయ్ సింగ్ ఈ విగ్రహాన్ని కులదైవంగా భావించి ఇక్కడ స్థాపించాడు. ప్రతి ఏటా భక్తులను పెద్ద...

  + అధికంగా చదవండి
 • 10ఆల్బర్ట్ హాల్

  ఆల్బర్ట్ హాల్ ను 1886 లో సవాయి రామ్ సింగ్ మహారాజు రూ. 4 లక్షల కరువు సహయక ప్రణాళిక లో భాగంగా కట్టించాడు. ఇది జైపూర్ లోని అందమైన రాం నివాస్ బాఘ్ దగ్గరలో ఉంది.ఈ కట్టడాన్ని సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ప్రస్తుతం, ఆల్బర్ట్ హాల్ను లోహ శిల్పాలు, చిత్రాలు, ఏనుగు...

  + అధికంగా చదవండి
 • 11నాహర్ గర్ కోట

  నాహర్ గర్ కోట జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్...

  + అధికంగా చదవండి
 • 12సిటీ ప్యాలెస్

  జైపూర్ మధ్యలో ఉన్న సిటీ భవనం పూర్వ సంస్కృతికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం. ఇది నగరంలోని పెద్ద భవనాలలో ఒకటి. ఈ అందమైన భవనాన్ని జైపూర్ రూపకర్త సవాయి జై సింగ్ మహారాజు కట్టించాడు. ఈ భవనం రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం.ఈ సముదాయ ప్రవేశం వద్ద ముబారక్ మహల్...

  + అధికంగా చదవండి
 • 13అంబర్ కోట

  అంబర్ కోట ను మాన్ సింగ్ మహారాజు, మీర్జా రాజా జై సింగ్, సవాయి జై సింగ్ దాదాపు 200 సంవత్సరాల పాటు కట్టారు. జైపూర్ ఉనికి లోనికి రావడానికి ముందు ఇది ఏడేళ్ళ పాటు కచ్చావహ పాలకుల రాజధానిగా ఉంది.మూథ సరస్సు ఒడ్డున ఉన్న ఈ కోటలో భవనాలు, మంటపాలు, సభామందిరాలు, దేవాలయాలు,...

  + అధికంగా చదవండి
 • 14షీష్ మహల్

  షీష్ మహల్

  అంబర్ కోట లోపల ఉన్న షీష్ మహల్ అద్దాల భవనంగా ప్రసిద్ది చెందింది. జై మందిరం లో భాగమైన ఈ భవనాన్ని అద్దాలతో అందంగా అలంకరించారు.గోడలు, పై కప్పు పై ఉన్న అద్దాల మీద కాంతి కిరణాలు పరావర్తనం చెంది భవనమంతా ప్రకాశవంతమౌతుంది. జైపూర్ మహారాజు రాజా జై సింగ్ 1623 లో తన ముఖ్య...

  + అధికంగా చదవండి
 • 15శిలా దేవి ఆలయం

  శిలా దేవి ఆలయం

  అంబర్ కోట లోపల ఉన్న శీలా దేవి ఆలయంలో కాళీ మాత విగ్రహం ఉంది. 16 వ శతాబ్దంలో, ఆమెకు గొప్ప భక్తుడైన మాన్ సింగ్ మహారాజు బెంగాల్ నుండి ఈ విగ్రహాన్ని తెచ్చాడు. ఈ ఆలయాన్ని అందమైన పాలరాయితో నిర్మించారు. ఇక్కడి కాళీ మాత అంబర్ కోటను రక్షిస్తుందని నమ్మకం. హిందువుల పండగైన...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
18 Mar,Sun
Check Out
19 Mar,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon