Search
 • Follow NativePlanet
Share

బుండీ – కాలంలో ఘనీభవించింది !!

40

రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతం లో కోట నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది బుండీ. అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో అందంగా చెక్కిన రాజపుత్ర నిర్మాణ శైలి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాయి. ప్రవహించే నదులు, సరస్సులు, ఊపిరి బిగపట్టే జలపాతాలూ ఈ ప్రాంతం అందానికి మరింత శోభనిస్తాయి. బుండీ లోని సింహభాగం పచ్చటి అడవులతో కప్పబడి ఉంది, అరుదైన ఫల, జంతు జాతులకు ఆలవాలంగా ఉంది. అనేకమంది చిత్రకారులు, రచయితలూ, కళాకారులకు బుండి ప్రేరణగా నిలిచింది. రడ్యార్డ్ కిప్లింగ్ కూడా తన ‘కిమ్’ ను సృష్టించడానికి ఇక్కడే ప్రేరణ పొందాడు.

5550 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ జిల్లాలో 2001 జన గణన ప్రకారం 88,000 మంది జనాభా ఉన్నారు. బుండి జిల్లాను, అయిదు తెహశీళ్ళుగా, ఆరు పట్టణాలూ, నాలుగు పంచాయతీ సమితులు, షుమారు 890 గ్రామాలుగా విభజించారు. కొన్ని అద్భుతమైన కోటలు, రాజ ప్రాసాదాలో, బావరీలుగా పిలువబడే దిగుడు బావులకు ప్రసిద్ది చెందినా బుండి జిల్లా కేంద్రంగా ఉంది.

పురాతన కాలంలో ఈ ప్రాంతంలో వివిధ స్థానిక జాతులవారు నివసించేవారు. ఈ తెగలన్నిట్లోకీ ముఖ్యమైనది పరిహార మీనాలు. బుండా మీనా అనే పాత రాజు పేరిట ఈ పట్టణం ఏర్పడిందని అంటారు. 1342 లో జైతా మీనా నుండి రావ్ దేవా హడా బుండీ ని చేజిక్కించుకొని దీనిని పాలించి, ఈ పరిసర ప్రాంతాలకి హడవతి లేదా హడౌతీ అనేపేరు పెట్టాడు. హడా రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ దీన్ని హస్తాటం చేసుకున్నాక 1533 లో వారి పాలన అంతమైంది.

బుండిలో ప్రధానంగా నివాసం ఉండే రాజపుత్రులు తమ ధైర్య-సాహసాలకు ప్రసిద్ది పొందారు. బున్డిలోని అధిక శాతం ఆదిమ జాతులు సాంప్రదాయ పద్ధతిలో రాజస్థానీ సంస్కృతీ, కట్టుబాట్లను పాటిస్తారు. హిందీ, రాజస్థానీ ఇక్కడ ప్రముఖంగా మాట్లాడే భాషలు.

బుండిలో ఘనంగా జరుపుకునే పండగ కాళీ తీజ్ హిందూ పంచాంగం ప్రకారం భాద్రపదం లోని (జులై నుండి ఆగస్ట్ మధ్య) మూడవ రోజు ప్రారంభమయ్యే ఈ ఉత్సవం రెండురోజుల పాటు జరుగుతుంది.

బుండి సంస్కృతిలో సంగీతం, చిత్రకళ అంతర్గత విభాగాలుగా ఉంటూ వచ్చాయి, తత్ఫలితంగా, ఈ ప్రాంతం లో అనేకమంది గాయకులూ, సంగీతకారులూ నివసిస్తూ ఉంటారు. బుండి చిత్రకళా విధానం కూడా మొఘలాయీ, రాగమాలా ఛిత్రాల నుండి స్ఫూర్తి పొందింది.

ఇక్కడి అనేక పర్యాటక ఆకర్షణలలో బాగా ప్రసిద్ది చెందినవి తారాగర్ కోట, బుండి రాజప్రాసాదం, రాణీజీ కీ బావరీ, నవల్ సాగర్. బుండిలోని ఇతర పర్యాటక ఆకర్షణలు, సుఖ మహల్, చౌరాసీ ఖమ్బోం కీ ఛత్రీ, జైత్ సాగర్ సరస్సు, ఫూల్ సాగర్.

పాత నగరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుండి ఇక్కడికి సమీపంలోని రైల్వే స్టేషన్. జైపూర్, ఆగ్రా, వారణాసి, డెహ్రాడూన్ లాంటి నగరాల నుంచి తిరిగే రైళ్ళు బుండీ మీదుగా వెళతాయి.

ఎక్స్ ప్రెస్ బస్సుల ద్వారా బుండి రాజస్తాన్ లోని వివిధ ప్రదేశాలను బాగా అనుసంధానించబడి ఉంది. మాధోపూర్, బికనేర్, జైపూర్, కోటా వంటి నగరాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. బిజోలియా, ఉదయపూర్, అజ్మీర్, జోధ్పూర్ ల నుంచి కూడా బుండికి అనేక బస్సులు తిరుగుతున్నాయి. బుండి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ మధ్యకాలం అత్యుత్తమం.

బుండీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బుండీ వాతావరణం

బుండీ
34oC / 92oF
 • Sunny
 • Wind: W 24 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం బుండీ

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? బుండీ

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం ద్వారా: బుండి, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల ద్వారా రాష్ట్రంలోని ఇతర నగరాలకు అనుసంధానించబడి ఉంది. బుండి కి మాధోపూర్, బికనేర్, జైపూర్, కోటా, బిజోలియ, ఉదయపూర్, అజ్మీర్, జోధ్పూర్ తో సహా రాష్ట్రంలోని వివిధ నగరాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ద్వారా: బుండి రైల్వే స్టేషన్ పాత నగరానికి దక్షిణం వైపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం తిరిగే రైళ్లతో ఇది దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బుండి చేరుకోవచ్చు. వాయు మార్గం: సంగనేర్, బుండి కి సమీప విమానాశ్రయం, ఇది జైపూర్ కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి బుండికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. జైపూర్ విమానాశ్రయానికి న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై లోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jan,Sun
Return On
27 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Jan,Sun
Check Out
27 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Jan,Sun
Return On
27 Jan,Mon
 • Today
  Bundi
  34 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Bundi
  31 OC
  88 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Bundi
  31 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy