తారాఘర్ కోట లోపల వున్న బాదల్ మహల్ ఇక్కడ వున్న అందమైన కుడ్య చిత్రాలకు ప్రసిద్ది పొందింది. మధ్య యుగానికి చెందిన ఈ మహల్ గోడలు అందంగా చిత్రించబడి వున్నాయి. ఈ చిత్రాల్లో వున్న మొహాలు, పూల బొమ్మలు ఆసక్తికరంగా వుండి, అప్పట్లో గసగసాలు సాగు చేసేవారని, అలాగే చైనా తో నల్లమందు వాణిజ్యం జరిగిందని తెలియచేస్తాయి.