Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పుష్కర్

పుష్కర్  - బ్రహ్మస్ధానం !!

33

 

పుష్కర్, భారతదేశంలోని అతి పవిత్ర నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అజ్మీర్ నగరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4వ శతాబ్దపు చైనా యాత్రికుడు ఫాహియాన్ యాత్రా చరిత్ర వర్ణనల, మొఘలులు భారత దేశంపై దాడి చేసిన కాలంలోని ఇతర రచనలలో ఈ పవిత్ర నగర౦ ప్రస్తావన ఉంటుంది. ప్రఖ్యాత భారత కవి కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో పుష్కర్ కు ఎంతో గౌరవ౦ కల్పించాడు. ఈ చిన్న నగరం 400 దేవాలయాలు, 52 ఘాట్లకు పుట్టిల్లు. పుష్కర్ బ్రహ్మ దేవుని ఆలయం భారతదేశంలోని ఈ దేవుని ఆలయాలలో ఒకటి. వరాహ దేవాలయం, ఆప్తేశ్వర్ దేవాలయం, సావిత్రి దేవాలయం పుష్కర్ లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు.

ఈ ప్రాంతపు మరొక ధార్మిక ఆకర్షణ పవిత్ర పుష్కర్ సరస్సు పుట్టుకకు ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం బ్రహ్మ దేవుడు వజ్ర నాభుడనే రాక్షసుడ్ని ఒక కమలంతో చంపాడు.

తత్పలితంగా పువ్వు నుండి కిందపడిన మూడు రేకుల్లో ఒక రేకు పడిన పుష్కర్ లోని ప్రాంతం లో ఈ సరస్సు ఏర్పడింది. మోక్షానికి మార్గమనే నమ్మకం వల్ల లక్షల కొద్ది ప్రజలు కార్తిక పౌర్ణమి నాడు ఇక్కడ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. పుష్కర్ ఉత్సవాలు, పండగలకు కూడా ప్రసిద్ది.

ప్రతి ఏటా నవంబర్ నెలలో ఈ నగరంలో ప్రపంచపు పశువుల సంతలో పెద్దదైన ప్రపంచ ప్రసిద్ధ పుష్కర్ పశువుల సంత జరుగుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంతతో బాటుగా రాజస్థానీ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వివిధ అంశాలను ప్రదర్శిస్తారు.

పర్యాటకులు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండైన పుష్కర్ కు సులువుగా చేరవచ్చు. పుష్కర్ కు జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం, అజ్మీర్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నాయి. అజ్మీర్ నుండి ఇతర రాష్ట్ర ప్రధాన నగరాలు జైపూర్, జైసల్మేర్, ఉదయ పూర్ లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. ఉష్ణోగ్రత 8 డిగ్రీలనుండి 25 డిగ్రీల వరకు ఉండే శీతాకాలం పుష్కర్ సందర్శనకు ఉత్తమమైనది

 

పుష్కర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పుష్కర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పుష్కర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పుష్కర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా : పర్యాటకులు బస్సులు,టాక్సీల ద్వారా కూడా పుష్కర్ చేరవచ్చు. ఇక్కడి నుండి అజ్మీర్ ప్రధాన బస్ స్టాండ్ 11కిలోమీటర్ల దూరం లో ఉంది. అజ్మీర్ నుండి రాజస్తాన్ లోని ఇతర ప్రధాన నగరాలకు, దేశ రాజధాని న్యూ ఢిల్లీకి నేరుగా చాలా బస్సులు ఉన్నాయి. జై పూర్, జై సల్మేర్, న్యూ ఢిల్లీ నుండి డీలక్స్, సూపర్ డీలక్స్, వోల్వో బస్సు సౌకర్యాన్ని పర్యాటకులు పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in పుష్కర్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పుష్కర్ కు వాయు, రైలు,రోడ్డు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. వాయు మార్గం ద్వారా : జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం పుష్కర్ కు దగ్గరగా ఉంది. పుష్కర్ నుండి 138 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానించారు. సంగనేర్ విమనాశ్రయం నుండి పర్యాటకులు అద్దె టాక్సీల ద్వారా పుష్కర్ చేరవచ్చు. రైలు మార్గం : అజ్మీర్ రైల్వే స్టేషన్ పుష్కర్ కు సమీపం లో ఉంది. ఇక్కడి నుండి ఆగ్రా, న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, జోద్ పూర్ వంటి దేశం లోని ఇతర ప్రసిద్ధ ప్రాంతాలకు చక్కగా కలప బడింది. అజ్మీర్ కు శతాబ్ది ఎక్స్ ప్రెస్, పింక్ సిటి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ళు నేరుగా న్యూ ఢిల్లీ, జై పూర్ నుండి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue