‘తీర్థ రాజ౦’ గా కూడా పిలిచే పుష్కర్ సరస్సు ఒక అర్ధచంద్రాకారపు పవిత్ర జలవనరు. పురాణాలననుసరించి బ్రహ్మదేవుడు, వజ్ర నాభుడనే రాక్షసుడ్ని కమలంతో చంపినప్పుడు పువ్వు నుండి పడిన రేకులలోని ఒక రేకు నుండి ఈ సరస్సు పుట్టింది.హిందువులకు పవిత్రమైన ఈ సరస్సు 10 మీటర్ల గరిష్ట లోతును కల్గి ఉంటుంది. పుష్కర్ సరస్సు చుట్టూ 300 దేవాలయాలు, భక్తులు పవిత్ర స్నానమాచరించే 52 ఘాట్లు (సరస్సు కు దారి తీసే మెట్ల వరుస) ఉన్నాయి. ఈ సరస్సులో కార్తిక పౌర్ణమి నాడు పవిత్ర స్నానమాచరించే వ్యక్తి మోక్షాన్ని పొందుతారని ఒక విశ్వాసం. ఈ సరస్సులో పవిత్ర స్నానమాచరిస్తే అన్ని పాపాల నుండి అన్ని చర్మ వ్యాధుల నుండి విముక్తి పొందుతారని కూడా మరొక విశ్వాసం.