మాన్ మహల్ వాస్తవంగా అంబర్ మహారాజు మొదటి మాన్ సింగ్ నిర్మించాడు. పవిత్ర పుష్కర్ సరస్సు తూర్పు భాగంలో ఉంది. సందర్శకులు మాన్ మహల్ నుండి సరస్సు ఒడ్డులను, చుట్టూ ఉన్న దేవాలయాలను పూర్తిగా చూడవచ్చు. ప్రస్తుతం ఒక హోటల్ గా మార్చిన ఈ పురాతన అతిధి గృహము రాజస్తాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఆర్ టి డి సి) వారి నిర్వహణలో ఉంది.