Search
 • Follow NativePlanet
Share

లడ్నన్  - దేవాలయాల భూమి

8

లడ్నన్ పట్టణం రాజస్ధాన్ లోని నాగోర్ జిల్లాలో కలదు. ఈ పట్టణాన్ని గతంలో చందేరి నగరి అనేవారు. ఈ పట్టణం గొప్ప వ్యక్తి అయిన ఆచార్య తులసి జన్మ స్ధలం. ఆచార్య తులసి అనువ్రత మరియు జైన విశ్వ భారతి యూనివర్శిటీల వ్యవస్ధాపకులు. ఈ గొప్ప వ్యక్తిని భారత మాజీ రాష్ట్రపతి డా. రాధాక్రిష్ణన్ తన ప్రసిద్ధ గ్రంధం లివింగ్ విత్ పర్పస్ లో ఈయనను 15 మంది గొప్ప వ్యక్తుల జాబితాలో పేర్కొన్నారు.

చరిత్రలో లడ్నన్

లడ్నన్ చరిత్ర భారత ఇతిహాసం మహాభారత కాలం నాటిది. ఈ ఇతిహాసంలో శిశుపాలుడి రాజ్యం దీనిని స్వాధీన పరచుకున్నట్లు 12వ శతాబ్దంలో వర్ణించారు. సుమారు 16వ శతాబ్దం నుండి లడ్నన్ ప్రాంతం జోధ్ పూర్ లో ఒక భాగంగా మారింది. జైన దేవాలయాల భూమి ఈ ఆధ్యాత్మిక భూమి ప్రత్యేకించి జైన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలోని దిగంబర్ జైన్ బారా దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రిందటిది. దీనిలో 166 జైన తీర్ధంకరుల మార్బుల్ విగ్రహాలుంటాయి. పర్యాటకులు ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా చూడవచ్చు. దీనిలో వివిధ పురాతన విగ్రహాలు మరియు కొన్ని తాళపత్ర గ్రంధాలు కూడా ఉంటాయి. చక్కగా చెక్కిన స్తంభాలు మరియు ద్వారాలు ఈ పుణ్య క్షేత్రానికి మరింత ఆకర్షణ తెచ్చి పెట్టాయి. పర్యాటకులు శాంతినాధ దేవాలయం మరియు ఛార్ భుజ నాధ దేవాలయాలను కూడా లడ్నన్ లో చూడవచ్చు. లడ్నన్ లో జైన్ విశ్వ భారతి యూనివర్శిటీ ప్రసిద్ధి చెందినది. దీనిని ఆచార్య తులసి 1970 లో స్ధాపించారు. అందమైన ఈ కేంపస్ బలమైన ఆధ్యాత్మిక, నైతిక విలువలతో ఉన్నత నాణ్యత కల విద్యను అందిస్తోంది. ఈ యూనివర్శిటీనే కాక, పర్యాటకులు సుఖ దేవ్ ఆశ్రమం, బాలాజీ మందిర్, పాబోలో, మంగళ్ పుర బాగిచి, పీఠ్ వాలే బాలాజి, ద్రోణాచల ఆశ్రం, వెంకటేష్ మందిర్, సుజనఘర్ మరియు సింఘి మందిర్ లవంటివి కూడా లడ్నన్ లో చూడవచ్చు. లడ్నన్ లో చూడాల్సిన ప్రదేశాలు.

లడ్నన్ లో పర్యాటకులు రామానంద్, గోశాల, ఆదినాధ్ మందిర్, చంద్రసాగర్ సమారక్ దేవాలయం, సాధ్వి పన్నాజి కి సమాధి మరియు నీలకంఠ మహాదేవ్ దేవాలయం, సలసార్ ధామ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు లడ్నన్ కు 37 కి.మీ.ల దూరంలో కలవి చూడవచ్చు. లడ్నన్ లో మరిన్ని ఆకర్షణలు అంటే కారంత్ బాలాజి, వీర్ బాలాజి మందిర్, ఉమర్ షఫీర్ దర్గా మరియు ఆర్య సమాజ్ మందిర్ లు కూడా చూడవచ్చు. లడ్నన్ చేరుట ఎలా?

లడ్నన్ ప్రదేశాన్ని వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలలో చూడవచ్చు. ఈ ప్రదేశానికి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరువ. దేశంలోని ప్రధాన నగరాలకు రైలు సదుపాయం కూడా కలదు. లడ్నన్ లో చిన్న రైలు స్టేషన్ కలదు. నాగౌర్ రైలు స్టేషన్ కూడా లడ్నన్ కు సమీపం. జైపూర్, అజ్మీర్, సికార్, బికనీర్, కుచ్ మాన్, అహ్మదాబాద్, ఇండోర్ మరియు ఢిల్లీ లనుండి బస్ సర్వీసులు కూడా కలవు. లడ్నన్ వాతావరణం

లడ్నన్ ప్రాంతం సంవత్సరం అంతా పొడిగా ఉంటుంది. వేసవి, వర్సాకాలం, మరియు శీతాకాలం ప్రధాన సీజన్లు. ఈ ప్రాంతాన్ని పర్యటించగోరేవారు ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలంలో తమ పర్యటన ప్రణాళిక చేసుకోవచ్చు.

లడ్నన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లడ్నన్ వాతావరణం

లడ్నన్
33oC / 91oF
 • Sunny
 • Wind: WSW 24 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం లడ్నన్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? లడ్నన్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం పర్యాటకులు లడ్నన్ చేరాలంటే, వివిధ పట్టణాలనుండి అంటే జైపూర్, అజ్మీర్, సికార్, బికనీర్, కుచ్ మాన్, అహ్మదాబాద్, ఇండోర్ మరియు ఢిల్లీలనుండి బస్ లలో చేరవచ్చు. లడ్నన్ వెళ్ళే రోడ్డు విశాలంగా ఉండదు. ఈ ప్రదేశం సుజన్ ఘర్ మరియు దిద్వాన లకు కూడా కలుపబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం లడ్నన్ కు చిన్న రైలు స్టేషన్ కలదు. ఢిల్లీ - రేవారి - రతన్ ఘర్ - డేగన, జోధ్ పూర్ రైలు మార్గంలో లడ్నన్ రైలు స్టేషన్ కలదు. ఈ లైనులో లడ్నన్ ను ఇతర ప్రదేశాలనుండి కలుపుతూ రెండు పాసింజర్ రైళ్లు కలవు. ప్రత్యామ్నాయంగా నాగోర్ రైలు స్టేషన్ కూడా వాడవచ్చు. ఇది లడ్నన్ కు 97 కి.మీ.ల దూరంలో కలదు. రైలు స్టేషన్ నుండి లడ్నన్ కు క్యాబ్ లు దొరుకుతాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  లడ్నన్ సందర్శన వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేయవచ్చు. విమాన ప్రయాణం లడ్నన్ కు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 218 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయంనుండి దేశంలోని ఇతర నగరాలైన కొల్ కటా, ముంబై, ఢిల్లీ మరియు చెన్నైలకు తరచు విమానాలు ప్రయాణిస్తాయి. విమానాశ్రయం నుండి లడ్నన్ కు క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లడ్నన్ కు అందుబాటులో కలదు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Oct,Mon
Return On
27 Oct,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Oct,Mon
Check Out
27 Oct,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Oct,Mon
Return On
27 Oct,Tue
 • Today
  Ladnun
  33 OC
  91 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Ladnun
  31 OC
  88 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Ladnun
  30 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy