Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కిషన్ ఘర్

కిషన్ గర్  - చలువ రాతి నగరం

9

రాజస్థాన్ లో అయిదవ పెద్ద నగరం అయిన అజ్మర్ నగరానికి వాయువ్య దిశలో 29 కిలోమీటర్ల దూరంలో కిషన్ గర్ అనే నగరం మరియు మునిసిపాలిటి ఉంది. జోద్ పూర్ ని పాలించిన రాకుమారుడు కిషన్ సింగ్ పేరునే ఈ నగరానికి పెట్టారు. తన ప్రతిభా పాటవాలతో కిషన్ సింగ్ ఈ రాజ్యాన్ని జయించాడు. బ్రిటిష్ పాలనలో జోద్ పూర్ కి కిషన్ గర్ రాజధాని గా ఉండేది.1840 నుండి 1879 ల మధ్య కాలంలో పృథ్వీ సింగ్ కిషన్ గర్ ని పాలించాడు . ఆ తరువాత పృథ్వీ సింగ్ కుమారుడు సార్దూల్ సింగ్ ఆ స్థానం లోకి వచ్చాడు. ప్రస్తుతం బ్రిరజ్ సింగ్ గారు కిషన్ గర్ మహారాజు.

ఇప్పుడు ఈ కిషన్ గర్ ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా తన మనోహరమైన ప్రదేశాలతో ఎందరో సందర్శకుల ని ఆకర్షిస్తున్నది.వాటిలో పూల్ మహల్ పాలస్ , రుపంగర్ ఫోర్ట్ మరియు కిషన్ గర్ కోట వంటివి ముఖ్యమైనవి.

కిషన్ గర్ లో నే బాణీ థాని అనబడే ప్రముఖ చిత్రకళా శైలి ఉద్భవించింది. ఈ కిషన్ గర్ శైలి లో ఎక్కువగా ఆకుపచ్చని రంగును ఎక్కువగా ఉపయోగిస్తారు , అంటే పచ్చటి ప్రకృతికి ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో భారత దేశం యొక్క పాలరాతి నగరంగా కిషన్ గర్ ప్రసిద్ది చెందింది. అంతే కాకుండా, ప్రపంచం మొత్తంమీద నవగ్రహాల ఆలయం నిర్మించబడిన ఏకైక నగరం గా కిషన్ గర్ ని భావించవచ్చు.

వాణిజ్య పరంగా కూడా కిషన్ గర్ తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఎండు మిరపకాయలని అందించే హోల్ సేల్ మార్కెట్ గానే కాకుండా, గ్రానైట్ మరియు పాలరాయి వ్యాపారానికి కిషన్ గర్ ప్రసిద్ది చెందింది.

కిషన్ గర్ కి సమీపంలో ఉన్న విమానాశ్రయం జైపూర్ లో ఉన్న సంగనేర్ విమానాశ్రయం సంగనేర్ విమానాశ్రయం కిషన్ గర్ కి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న అజ్మీర్ రైల్వే స్టేషన్ కిషన్ గర్ కి సమీప రైల్వే స్టేషన్. ఆగ్రా, బికానెర్, జోధ్పూర్, జైసల్మేర్, మరియు భరత్పూర్ నుండి రాష్ట్రం బస్సులు కిషన్ గర్ కి అందుబాటులో ఉన్నాయి.

జూలై ఆగష్టు నెలలలో ఇక్కడి ప్రజలు ఆనందోత్సాహాలతో గంగౌర్ పండుగని జరుపుకుంటారు. అంతేకాదు, దీపావళి, హోలీ వంటి పండుగలని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కిషన్ గర్ లో జరుపుకుంటారు.

అక్టోబర్ నెల నుండి మార్చ్ నెల వరకు కిషన్ గర్ ని సందర్శించడానికి అనుకూల సమయం .

కిషన్ ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కిషన్ ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కిషన్ ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కిషన్ ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం:- రాజస్థాన్ లో ని రాష్ట్ర బస్సులు ఎన్నో కిషన్ గర్ కి అందుబాటులో ఉన్నాయి . ఆగ్రా , బికానెర్ , జోధ్పూర్ హరిద్వార్ , చిట్టోర్ గర్ , జైసల్మేర్ , మరియు భరత్పూర్ నుండి రాష్ట్రం బస్సులు కిషన్ గర్ కి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : - అజ్మీర్ రైల్వే స్టేషన్ కిషన్ గర్ కి అతి సమీప రైల్వే స్టేషన్. ఇది కిషన్ గర్ నుండి 30 కి మీ ల దూరం లో ఉంది. భారత దేశం లో ని అన్ని ప్రధాన నగరాలకు ఈ రైల్వే స్టేషన్ నుండి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కిషన్ గర్ చేరుకోనడానికి రైలు, వాయు మరియు రోడ్డు మార్గాలు కలవు. వాయు మార్గం :- జైపూర్ లో ఉన్న సంగనేర్ విమానాశ్రయం కిషన్ గర్ కి సమీపంలో ఉంది. ఈ విమానాశ్రయం 135 కి మీ ల దూరం లో ఉంది. పర్యాటకుల కోసం విమానాశ్రయం నుండి కిషన్ గర్ కి వచ్చే అద్దె టాక్సీ లు చాలా అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు ముంబై లో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాధారణ విమానాల ద్వారా సంగనేర్ విమానాశ్రయం అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed