Search
  • Follow NativePlanet
Share

ఫలోదీ – ఉప్పు నగరం !!

6

 

‘ఉప్పు నగరం’ గా పిలువబడే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ పట్టణం బంగారు నగరం గా పిలిచే జైసల్మేర్ కు సూర్య నగరం గా పిలిచే జోధ్పూర్ కు మధ్యలో థార్ ఎడారి లో వుంది. ఎడారి ఓడలుగా పిలువబడే ఒంటెల మీద ఇప్పటికీ ఉప్పు వాణిజ్యం జరిగే కేంద్రం. ఫలోదీ కి బికానేర్, నాగౌర్, జైసల్మేర్, జోధ్పూర్ లు సరిహద్దుగా వున్నాయి. ఈ జిల్లలో ఇది రెండో అతి పెద్ద నగరం. 15వ శతాబ్దం నాటి చరిత్ర కల ఫలోదీని ఆ కాలం లో ‘ఫలవర్ధిక’ అని పిలిచే వారు. 1547 లో రావ్ మల్దేవ్ రాథోర్ చేత పాలించబడిన ఈ పట్టణం 1578లో బికనేర్ రాజు అధీనంలోకి వచ్చింది. 1615లో రావ్ సూర్ సింగ్ చేజిక్కి౦చుకున్నాక జోధ్పూర్ రాజ్యం లో భాగమైంది.

సంస్కృతి, వర్ణాలు & జాతీయత

స్థానికంగా జూతీ లుగా పిలువబడే పాదరక్షలు, రంగు రంగుల గాజులు, రంగు రంగుల దుస్తులు ధరించే స్త్రీలు, బీడింగ్ లు, వెండి ఆభరణాలు ఫలోదీ ని కళ్ళకు కడతాయి. ఈ ప్రాంతంలో హిందీ, రాజస్థానీ ఎక్కువగా మాట్లాడే భాషలు. దీని గొప్ప సంస్కృతికే కాక, ఈ పట్టణాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన కోటలు, రాజప్రాసాదాలు, బజార్లు, పురాతన హిందూ, జైన దేవాలయాలకు ఫలోదీ ప్రసిద్ది చెంది౦ది.

ఫలోదీ లోని వారసత్వ భవనాలు రాజస్థాన్ లోని ఝారోఖా, జాలీ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తాయి. 300 ఏళ్ళ నాటి ఫలోదీ కోట ఇక్కడి ప్రసిద్ధ చారిత్రిక కట్టడాల్లో ఒకటి.

కోట అద్భుత నిర్మాణ శైలి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఫలోదీ ని సందర్శించే యాత్రికులు 1750 లో ఎర్రని ఇసుక రాయితో నిర్మించిన లాల్ నివాస్ కూడా చూడవచ్చు. ఈ అందమైన భవంతిని ఇప్పుడు ఆకర్షణీయమైన ప్రాచీన వస్తువులతోను, గాజు షాండిలియర్ ల తోనూ అలంకరించిన హెరిటేజ్ హోటల్ గా మార్చివేసారు. సచియా మాత గుడి, మహావీర మందిరం, రామ్ దేవరా దేవాలయం, సూర్య దేవాలయం ఇక్కడి ఇతర ప్రధాన ఆకర్షణలు.

‘డేమాయిసేల్లె కొంగల గ్రామ౦’ – వలస పక్షుల ప్రదేశం !

కోటలు, వారసత్వ భవనాలు, ప్రాచీన గుళ్ళ తో పాటు ఫలోదీ పక్షి ప్రేమికుల స్వర్గధామం. ఈ ప్రాంతం లోని ఖికన్ గ్రామంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వలస పక్షులను చూడవచ్చు. ఫలోదీ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం స్థానికంగా ‘కుర్జా’ గా పిలువబడే డేమాయిసేల్లె కొంగ కు తాత్కాలిక నివాసం. నైరుతి యూరప్, ఉక్రెయిన్, పోలాండ్ ల నుంచి ఎంతో దూరం ఎగురుతూ ఖికన్ లో తాత్కాలిక నివాసం కోసం వచ్చే ఈ అరుదైన పక్షి జాతిని చూడడానికి ఆగస్ట్ నుంచి మార్చ్ మధ్య కాలం సరైనది. ఈ పక్షులకు తాత్కాలిక ఆవాసంగా ప్రపంచ ప్రసిద్ది చెందడం తో ఈ గ్రామాన్ని ‘డేమాయిసేల్లె కొంగల గ్రామం’ గా పిలుస్తునారు.

ఫలోదీ చేరుకోవడం

ఉప్పు నగరం ఫలోదీ ని వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ఫలోదీ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వున్న జోధ్పూర్ ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు ఇక్కడికి న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చేరుకోవచ్చు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై, కోల్కతా, చెన్నై, గువహతి, బెంగళూరు లతో సహా అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడింది.

బికానేర్, జైసల్మేర్, లాల్ ఘర్, పాత డిల్లీ, జోధ్పూర్ ల నుంచి యాత్రికులు ఇక్కడికి రైళ్ళలో కూడా చేరుకోవచ్చు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల నుంచి ఫలోదీ చేరడానికి కార్లు సిద్ధంగా వుంటాయి. ఈ ఉప్పు నగరాన్ని చేరడానికి సౌకర్యవంతంగా, వీలుగా వుండే బస్సు సేవలు కూడా అందుబాటులో వున్నాయి. ఫలోదీ నుంచి జోధ్పూర్, అజ్మీర్, జైపూర్, బేవార్, ఆగ్రా, అల్లహాబాద్, కాన్పూర్ వంటి ప్రసిద్ధ యాత్రా స్థలాలకు పర్యాటకులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.

ఫలోదీ లో ఏడాది పొడవునా ఉష్ణ మండల వాతావరణం వుంటుంది. వేసవి గరిష్టంగా 45 డిగ్రీలతో చాలా తీవ్రంగా వుండగా, శీతాకాలాలు 5 డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డ కట్టి౦చేలా వుంటాయి. ఫలోదీ సందర్శనకు శీతాకాలం అనువైనది.

ఫలోది ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫలోది వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫలోది

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫలోది

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: పర్యాటకులు బస్సులలో కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. జోధ్పూర్, అజ్మీర్, జైపూర్, బెవార్, ఆగ్రా, అలహాబాద్, కాన్పూర్ నుండి ఫలోదీ కి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: ఫలోదీ రైల్వే స్టేషన్ కి బికనేర్, జైసల్మేర్, లాల్ గర్, పాత డిల్లీ, జోధ్పూర్ తోపాటు ప్రధాన పర్యాటక ప్రాంతాల నుండి రైళ్ళు ఉన్నాయి. పర్యాటకులు ఫలోదీ చేరుకోవడానికి ఎయిర్ కండిషన్, ఎయిర్ కండిషన్ లేని స్లీపర్ కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ నుండి ఫలోదీ కి సరసమైన ధరలలో కాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా: ఫలోదీ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్ విమానాశ్రయం సమీప విమాన కేంద్రం. పర్యాటకులు విమానాశ్రయం నుండి కార్ల ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫలోదీ చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయానికి ముంబై, కొలకత్తా, చెన్నై, గౌహాతి, బెంగుళూర్, తోపాటు భారతదేశం లోని ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue