కాన్పూర్ - ఐటి కాకుండా మరో కోణం !

పవిత్రమైన గంగా నది ఒడ్డున నెలకొని ఉన్న పెద్ద నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పురాణాల ప్రకారం, మహాభారత కాలంలో దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణుడికి అర్జునున్ని ధైర్యంగా ఎదురుకొన్నందుకు సంతోషించి కొంత భూమిని కేటాయిస్తాడు. మొదటగా ఈ ప్రాంతాన్ని కర్ణ పూర్ గా పిలిచే వారు కాల క్రమేనా ఈ ప్రాంతం కాన్పూర్ గా మారింది. మరొక పురాణం గాధ ప్రకారం ఈ ప్రాంతం ఇదివరకు 'కన్నయ్య పూర్' గా పిలువబడేది. కాల క్రమేనా కాన్ పూర్ గా రూపుదిద్దుకుంది.

పౌరాణిక మూలాలు ఒక వైపైతే, వలస రాజ్యాల శకంలో ఈ ప్రాంతం అవధ్ నవాబు చేతినుండి బ్రిటిష్ వారి చేతిలోకి మారినప్పుడు కాన్పూర్ ముఖ్యమైన ప్రాంతం అయింది. స్వాతంత్ర పోరాట కాలంలో మారణకాండ ని కాన్పూర్ చూసింది.

ఇప్పుడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వల్ల చదువుల సరస్వతి కొలువైన నగరంగా ఈ ప్రాంతం ఏంతో ఖ్యాతి గడించింది. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, CSJM యూనివర్సిటీ, హర్కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ (HBTI), GSVM మెడికల్ కాలేజ్ అండ్ Dr. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (AITH) వంటి కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు ఇక్కడ కలవు. పారిశ్రామిక పరంగా, లెదర్ మరియు కాటన్ ఉత్పత్తుల ద్వారా కాన్పూర్ దేశ విదేశాల నుండి వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

కాన్పూర్ లో ఇంకా చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యాటక ఆకర్షణలు

మొదటి చూపులో, కాన్పూర్ మిగతా భారతీయ నగరాల లాగానే గజిబిజిగా, రంగు రంగుల, ఉత్సాహపూరితంగా ఇంకా ఎల్లప్పుడూ సందడిగా ఉండే నగరం. కానీ నిశితం గా చుస్తే, కాన్పూర్ లో ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. శ్రీ రాధాకృష్ణ టెంపుల్, భితర్గోన్ టెంపుల్ మరియు ద్వార్కదిష్ టెంపుల్ వంటి సుందరమైన ఆలయాలు ఎన్నో ఇక్కడ దర్శనమిస్తాయి. హిందువుల ఆలయాలతో పాటు ఇక్కడ మసీదులు అలాగే చర్చ్ లు కూడా కనిపిస్తాయి. సర్వమత సమ్మేళనం కాన్పూర్. జామ్మ మసీద్, కాన్పూర్ మెమోరియల్ చర్చ్ మరియు జైన్ గ్లాస్ టెంపుల్ వంటివి ఇందులో ముఖ్యం గా పేర్కొనవలసినవి. జైన్ గ్లాస్ టెంపుల్ పేరుకు తగినట్టే గాజు తో ఇంకా ఏనామేల్ తో పురాతన నిర్మాణ శైలితో నిర్మించబడిన ఆలయం.

ప్రఖ్యాతి గాంచిన, నగరంలో నే అతిపెద్దది అయిన, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోనే ఉత్తమమైన అల్లెన్ ఫారెస్ట్ జూ కాన్పూర్ లో ఉంది. ఈ జంతు ప్రదర్శన శాల నిజంగా ఒక అడవి. స్వేచ గా విహరించే వివిధ జంతువులను ఇక్కడ గమనించవచ్చు. మిగతా జంతు ప్రదర్శన శాలలో లాగా ఇక్కడ జంతువులను బోను లో బంధించరు.

కాన్పూర్ లో ఆహారం

భారతీయ భోజనం ప్రపంచ వ్యాప్తం గా ఆదరణ ని పొందుతోంది. ఏ నగరానికి మీరు ప్రయానించినా అక్కడ కొన్ని ప్రత్యేకమైన వంటకాలు మీకు నోరురిస్తాయి. కాన్పూర్ పర్యాటక శాఖ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలు. ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ నుండి బడ్జెట్ తినుబండారాలు, రెస్టారంట్స్ అందరి అభిరుచికి తగ్గట్టుగా నోరూరించే వంటకాలు తయారుచేస్తాయి. బడా చౌరహా వద్ద 'తగ్గు కె లడ్డు ఆఫ్ మత్త పాండే' మరియు సివిల్ లైన్స్ వద్ద బద్నాం కుల్ఫీ లు రుచిచుడకుండా ఉండలేరు.

Please Wait while comments are loading...