Search
  • Follow NativePlanet
Share

బితూర్ - పురాణ గాధల ప్రసిద్ధి!

10

కాన్పూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున సుందర ప్రకృతి దృశ్యాల పట్టణం బితూర్ ఉంది. వేర్రెత్తించే కాన్పూర్ సమూహాల నుండి దూరంగా చైతన్యం నింపి, విశ్రాంతితో అవసరమైన ఉపశమనాన్ని బితూర్ కల్గిస్తుంది. బితూర్ ఒక ప్రధాన హిందూ తీర్థయాత్ర కేంద్రమే కాక గొప్ప చారిత్రిక ప్రాధాన్యతను కూడా కల్గి ఉంది.

బితూర్ చరిత్ర – పురాణాలలోని ఆసక్తికరమైన వాస్తవాలు

పురాతన కాలానికి చెందిన ఈ పట్టణం ప్రస్తావన అనేక పురాణాలు, కథలలో ఉంటుంది. ఒక పురాణం గాథ ప్రకారం విష్ణువు నక్షత్ర మండలాన్ని నాశనం చేసి, పునర్నిర్మించిన తర్వాత, బ్రహ్మ దేవుడు బితూర్ ను తన నివాసంగా ఎంచుకొన్నాడు. ఇక్కడే ఆయన మొదటగా మానవజాతిని సృష్టించి, అశ్వమేధ యాగాన్ని కూడా పూర్తి చేసాడు. ఈ సంఘటనల కారణంగానే ఈ ప్రాంతానికి బ్రహ్మావర్త అనే పేరు వచ్చింది, దీని నుండి బితూర్ అనే పేరు ఏర్పడింది. తర్వాత, ఉత్తన్ పద్ చక్రవర్తి పాలనలో బితూర్ అభివృద్ధి చెందగా, అతని కుమారుడు ధ్రువుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసాడు.

బితూర్ రామాయణ గాథతో కూడా అతి దగ్గరి అనుబంధాన్ని కల్గి ఉంది, తన బహిష్కరణలోని విషాద జీవితంలో సీతను రాముడు ఇక్కడే విడిచి పెట్టాడని అంటారు. నిజానికి, వాల్మీకి ఋషి ఇక్కడే కూర్చొని కాలాతీత పురాణ౦ రామాయణం రాసాడని విశ్వసిస్తారు.

సీత తన కవలలు లవ, కుశులకు జన్మనిచ్చిన ప్రదేశం బితూర్ అని, ఇక్కడే వారు వాల్మికి మహర్షి మార్గదర్శకత్వంలో తమ బాల్యాన్ని గడిపారని కూడా విశ్వసిస్తారు. నిజానికి ఈ కవలలు యుద్ధం, రాజకీయాలలోని మెలకువలను నేర్చుకొన్నారు. చివరకి ఇక్కడే వారు తమ తండ్రితో తిరిగి కలుసుకొన్నారు. ఈ అన్ని కారణాల వల్లనే బితూర్ ను రామలె అని కూడా అంటారు.

ఈ ప్రాంతానికి సంబంధించిన పురాణ గాధలు అనేకం ఉన్నాయి. ఒక సాధువుగా జీవితం గడిపి, తరువాత ఆకాశంలో ఒక నక్షత్రంగా మెరుస్తూ శాశ్వత కీర్తిని పొందిన పురాణ బాలుడు ద్రువునితో ఇది సంబంధ౦ కల్గి ఉందని విశ్వసిస్తారు,

ఆధునిక యుగంలో బితూర్

తిరిగి ఆధునిక యుగానికి రాగా, తరవాతి కాలంలో బితూర్ ఝాన్సీ రాణిగా పేరొందిన ఝాన్సీ లక్ష్మీబాయి, భారతదేశ స్వంతంత్ర పోరాటంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన సాహెబ్ పేష్వా వంటి అనేక మంది చారిత్రక వ్యక్తులు, స్వాతంత్ర సమరయోధులకు పుట్టిల్లు.

దేశభక్తి, శౌర్యం మూర్తీభవించిన ఈ ఇద్దరు వ్యక్తులను ఈ రోజు కూడా గౌరవంగా గుర్తుచేసుకొంటారు. తమ బాల్యాన్ని బితూర్ లో గడిపి ఇక్కడే యుద్ధతంత్రాలను నేర్చుకొని, వాటిని 1857 గొప్ప తిరుగుబాటులో వాడారు.

బితూర్ లోని పర్యాటక ప్రాంతాలు

బితూర్ పర్యటించడం కేవలం చారిత్రిక ప్రాంతాలకు ఒక ప్రయాణం మాత్రమే కాదు – ఈ పట్టణం అందమైనది, సహజమైన దృశ్యాలతో కూడినది. ఇక్కడి నుండి మీరు ధార్మిక ఆలయాల మధ్య ప్రశాంతంగా తిరగడ౦ లేదా నదిలో బోటు షికారు చేయడం వంటి వాటి ద్వారా ప్రకృతిలోని వివిధ అందాలను ఆస్వాదించవచ్చు. గొప్ప ముని వాల్మికి పురాణ కావ్యం రామాయణం వ్రాసిన వాల్మీకి ఆశ్రమం వంటి కొన్ని ప్రముఖ ఆకర్షణలు వీటిలో ఉన్నాయి.

అంతేకాక, బితూర్ లో ఏడాది పొడవునా భక్తులను ఆకర్షించే అతి పవిత్రమైన బ్రహ్మ ఘాట్ ఉంది. అవద్ మంత్రి తికాయిత్ రాయ్ శంకుస్థాపన చేసిన పత్థర్ ఘాట్, బితూర్ లోని మరొక పవిత్ర ప్రాంతం.

ధ్రువ తీల, ద్రువుడు తన బాల్యంలో ఒంటి కాలుపై తపస్సు చేసినట్లుగా తెలిపే ఒక కల్పిత ప్రదేశం. వీటితో బాటుగా, ఇక్కడ జహంగీర్ మసీదు, హరిధాం ఆశ్రమం, రామ్ జానకి ఆలయం, లవ-కుశ ఆలయం, నానా సాహెబ్ స్మారకం వంటివి చెప్పుకోదగినవి.

తెల్పినట్టుగానే, హిందువుల ఒక ప్రధాన తీర్థయాత్రా కేంద్రం బితూర్ లో కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, మకర సంక్రాంతి మేళా వంటి అనేక ఉత్సవాలు, పండగలు కూడా జరుగుతాయి. వేలాదిమంది ప్రజలు ఈ ప్రత్యేక రోజులలో గంగలో ఒక పవిత్ర మునకను వేయడానికి ఇక్కడ సమావేశమౌతారు.

 

బితూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బితూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బితూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బితూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా బితూర్, ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్, లక్నో, ఆగ్రా, అయోధ్యతో సహా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకి చక్కటి రోడ్డు మార్గం ద్వారా కలపబడింది. ఢిల్లీ నుండి ప్రభుత్వ రంగంలోని బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా ఇక్కడికి అతి దగ్గరగా ఉన్న కళ్యాణ్ పూర్ రైలు స్టేషన్ నుండి పాసింజర్ రైళ్ళు ఉంటాయి. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ అతి దగ్గరి రైలు జంక్షన్. కాన్పూర్ నుండి అద్దె టాక్సీలు లేదా ప్రభుత్వ బస్సుల ద్వారా బితూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా లక్నో విమానాశ్రయం సుమారు 87 కిలోమీటర్ల దూరంతో, అతి దగ్గరగా ఉంది. ఇక్కడి నుండి అద్దె టాక్సీలు లేదా ప్రభుత్వ రవాణా బస్సులు ద్వారా బితూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri