ఝాన్సీ - బుందేల్ఖండ్ ప్రదేశానికి ముఖద్వారం!

ఉత్తర ప్రదేశ్ లో ని బుందేల్ఖండ్ ప్రదేశానికి ముఖద్వారంగా పరిగణించబడే ప్రదేశం ఝాన్సీ. చందేలాల హయం లో ఉచ్చ స్థితిని చూసినటువంటి ఈ ప్రదేశం ఆ తరువాత 11 వ శతాబ్దపు ప్రాంతం లో క్షీణించింది. తిరిగి 17 వ శతాబ్దం లో రాజా బీర్ సింగ్ డియో పాలనలో తిరిగి ఉచ్చ స్థితిని పొందింది. ఈ రాజుని అలనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ తో పోల్చేవారు.

1857 లో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా మొట్ట మొదటి స్వాతంత్ర్య ఉద్యమం లో పోరాడిన ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి ఈ ప్రదేశానికి పేరు ప్రఖ్యాతలని తీసుకువచ్చింది. ఝాన్సీ కి చెందినా రాజా గంగాధర్ ని వివాహమాడిన వీరికి సంతానం లేదు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మీ బాయి ని రాణీ పదవి నుండి తొలగమని ఒత్తిడి చేసారు. దీనికి ఆమె వ్యతిరేకించి 1857 లో తిరుగుబాటు చేసింది. తన పెంపుడు పిల్లాడితో సహా తప్పించుకున్న ఝాన్సీ రాణి గ్వాలియర్ వద్ద ఉన్న సైన్యాన్ని చేరుకునే మార్గం లో కన్ను మూసింది. జాన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా గా ఈమెని గౌరవిస్తారు. అంతే కాక, ఈ ప్రదేశం ఇప్పుడు ఇక్కడ ప్రతి ఏడు ఫిబ్రవరి-మార్చ్ లో జరిగే ఝాన్సీ ఫెస్టివల్ కి కూడా ప్రసిద్ది.

ఝాన్సీ లో ఉన్న మరియు చుట్టూ పక్కల పర్యాటక ప్రదేశాలు

చాలా మటుకు ఝాన్సీ లో ఉన్నవి ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యం కలిగినవి. రాణీ లక్ష్మీ బాయి మరియు బ్రిటిష్ ఫోర్సెస్ కి మధ్యలో జరిగిన యుద్దానికి వేదికగా నిలిచినా అద్భుతమైన ఝాన్సీ కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఇక్కడే ఉన్న అందమైన పరిచా డ్యాం ని మీరు సందర్శించావచ్చు. మరియు ఇక్కడ ఉన్న ఒక కాలనీ లో ప్రసిద్దమైన దేవాలయం, మసీదు మరియు బౌద్ధుల ఆశ్రమం చూడవచ్చు. ఇక్కడి ఝాన్సీ మ్యూజియం లో ఒకప్పటి ఝాన్సీ వైభవాన్ని చూడవచ్చు. రాణి లక్ష్మీ బాయి యొక్క నివాస భవనం అయిన రాణీ మహల్ అనే పాలసు ని సందర్శించవచ్చు. ఇక్కడే అనేక స్వాతంత్ర్య సమర యోధులు స్వాతంత్ర్యోద్యమ కార్య కలాపాలు గురించి రాణీ తో చర్చలు జరిపారు. బెట్వా నది ఒడ్డున ఉన్న బరువా సాగర్ సరస్సు ని సందర్శించవచ్చు.

దగ్గర లో ఉన్నటువంటి చిర్గోన్ మైథిలి శరన్ గుప్తా, ప్రఖ్యాత కవి పుట్టిన ప్రదేశం. ఓర్చ్చ ఇక్కడి కోటకి ప్రసిద్ది. అలాగే ఇక్కడి సివిల్ లైన్స్ వద్ద ఉన్న సెయింట్ జూడ్స్ శ్రైన్ కాతోలిక్ క్రైస్తవులకు ముఖ్యమైనది. మహారాజా గంగాధర్ రావు కి ఛత్రి, గణేష్ మందిర్ మరియు మహాలక్ష్మి టెంపుల్ ల ను కూడా ఇక్కడ సందర్శించవచ్చు. ఈ మధ్యే ప్రవేశ పెట్టిన ఝాన్సీ మహోత్సావ్ లో అనేక కళలు మరియు కళాకృతులను చూసే అవకాశం కలుగుతుంది.

ఝాన్సీ కి చేరే మార్గం వాయు, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా ఝాన్సీ కి చేరుకోవచ్చు. ఇక్కడికి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం గ్వాలియర్ విమానాశ్రయం.

సందర్శించేందుకు ఉత్తమ సమయంనవంబర్ నుండి మార్చ్ వరకు ఝాన్సీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం

 

Please Wait while comments are loading...