ఝాన్సీ లో ని బరువా సాగర్ అనే నగరానికి ఆ పేరు ఈ అతి పెద్ద బరువా సాగర్ సరస్సు ద్వారా లభించింది. ఝాన్సీ నుండి 25 కిలోమీటర్ల దూరం లో బెత్వా నదీ తీరాన ఈ బరువా సాగర్ ఉంది.
రాజా ఉదిత్ సింగ్ చే నిర్మించబడిన ఈ నగరం తన అందాలతో పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తుంది. చెరువే కాకుండా ఇక్కడి మరొక చారిత్రక విశేషం బుందేల్ఖండ్ ఫోర్ట్. కొండపైన వ్యూహాత్మకంగా ఈ కోట శత్రువుల నుండి రక్షణ కోసం నిర్మించబడింది. ఈ కోట నుండి అందంగా దూరాన బెట్వా నది రిజర్వాయర్ కనిపిస్తుంది.
ఇక్కడ ప్రాచీన దుర్గా అమ్మ వారి దేవాలయం జరై-కా-మఠ్ గా ప్రఖ్యాతి గడించింది. క్రీ.శ. 860 కి చెందిన ప్రతిహార నిర్మాణ శైలి లో ఈ దేవాలయం నిర్మించబడినది. ఈ దేవాలయం యొక్క నాలుగు మూలలా చిన్న గుడులు ఉన్నాయి.
ఈ దేవాలయం అర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా 1928 లో సంరక్షించుకోవలసిన పురాతన దేవాలయం గా గుర్తించబడింది.