గ్వాలియర్ - వారసత్వపు నగరం !

గ్వాలియర్ పట్టణం ఆగ్రా కు దక్షిణంగా 122 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఒక పర్యాటక రాజధాని. ఎన్నో ప్రసిద్ధ టెంపుల్స్, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగి గత వైభవాలను గుర్తు చేస్తూ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో నాల్గవ అతి పెద్ద పట్టణంగా వుంది. హింద్ యొక్క కోటల నెక్లస్ లో గ్వాలియర్ ను ఒక ముత్యం గా అభివర్ణిస్తారు. ఈ ప్రదేశం గ్వాలియర్ కోటకు ప్రసిద్ధి చెందినది.

గ్వాలియర్ - చరిత్ర ....ఆధునికతలతో కలిశే ప్రదేశం గ్వాలియర్ ప్రదేశం లో చరిత్ర మరియు ఆధునికత రెండూ కలసి వుంటాయి. చారిత్రక స్మారకాలు, కోటలు, మ్యూజియం లు కలిగి ఉండటమే కాక, పారిశ్రామిక నగరం గా కూడా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక ఇండియా లో గ్వాలియర్ ఒక విశిష్టతను కలిగి వుంది.

గ్వాలియర్ కద లోకి వెళితే ....

గ్వాలియర్ పట్టణాన్ని సూరజ్ సేన్ అనే రాజు 8 వ శతాబ్దం లో కనుగొన్నాడు. ఈ పట్టణానికి అతను తన కుష్టు వ్యాధిని నివారించిన ఒక రుషి పేరు అయిన 'గ్వాలిప' అనే పేరు పెట్టాడు. గ్వాలియర్ చరిత్ర 6 వ శతాబ్దం నుండి లిఖిత పూర్వకంగా కలదు. 6 వ శతాబ్దం లో దీనిని హూణులు పాలించారు. తర్వాతి కాలంలో ఈ పట్టణం కన్నౌజ్ కు చెందిన గుజ్జర్ ప్రరిహారాల , ఆతర్వాత పదవ శతాబ్దం లో కచవా రాజపుత్రుల చేతులలోకి వెళ్ళింది. క్రి. శ. 1196 లో దీనిని ఢిల్లీ పాలకుడు కుతుబుద్దీన్ అయిబాక్ మరియు షంషుద్దీన్ లు దీనిని  వశం చేసుకొని 1232 వరకు పాలించారు.

గ్వాలియర్ ను మొగలులు కూడా పాలించారు. 1553 నాటికి రాజు విక్రమాదిత్య దీనిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అతను ఉత్తర భారత దేశం లో చాలా ప్రాంతాలను గెలిచాడు. 1556 లో అక్బర్ ను సైతం ఓడించాడు. క్రి. శ. 18 మరియు 19 శతాబ్దాలలో ఈ పట్టణాన్ని మరాఠా తెగలకు చెందిన సిందియ వంశస్తులు బ్రిటిష్ వారితో కలసి పాలించారు. 1780 నాటికి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకున్నారు. ఈ ప్రదేశం లోనే మొదటగా 1857 లో మరాఠా తెగకు చెందినా రాణి ఝాన్సి దేవి బ్రిటిష్ వారిపై విప్లం తెచ్చి పోరాటం చేసింది.

గ్వాలియర్ పర్యటనలో మీరు చూడవలసినవి...గ్వాలియర్ కోట, ఫూల్ బాగ్, సూరజ్ కుండ్, హాతి పూల్, మాన్ మందిర్ పాలస్, జై విలాస్ మహల్, మొదలైనవి. ఇది భారతీయ గొప్ప సంగీతకారుడైన తాన్ సేన్ జన్మస్థలం. ఇక్కడ ప్రతి సంవత్సరం తాన్ సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. సంగీతం లో ఘరానా శైలి గ్వాలియర్ పేరుపై వచ్చింది. ఈ ప్రదేశం సిక్కులకు, జైనులకు ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.

గ్వాలియర్ ఎలా చేరాలి ?

వాయు, రైలు, రోడ్డు మార్గాలలో గ్వాలియర్ చేరవచ్చు. గ్వాలియర్ సందర్శనకు వింటర్ అనుకూల సమయం.

Please Wait while comments are loading...