హోమ్ » ప్రదేశములు» ఫతేపూర్ సిక్రి

ఫతేపూర్ సిక్రి -  మొఘల్ సంస్కృతి

15

16 వ శతాబ్దంలో 1571, 1583 ల మధ్య మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా దగ్గరగా నిర్మించిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం ఫతేపూర్ సిక్రి మొఘల్ సంస్కృతి, నాగరికతలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడే షేక్ సలీం చిష్తి సన్యాసి అక్బర్ కి కుమారుడు జన్మిస్తాడని జోస్యం చెప్పాడు. భారత పట్టణ ప్రణాళిక విధాన భావన వలన ప్రభావితమైన విషయం షాజహానాబాద్ (పాత ఢిల్లీ) లో బాగా ప్రదర్శించబడినది.

చారిత్రిక నేపధ్యం

1585 లో, అక్బర్ చక్రవర్తి ఆఫ్ఘన్ తెగలతో పోరాడటానికి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. దాని తర్వాత 1619 లో కేవలం ఒకే ఒక్కసారి ఆగ్రాలో ప్లేగు సోకినప్పుడు ఫతేపూర్ సిక్రీలో ఆశ్రయం పొంది జహంగీర్ మొఘల్ ఆస్థానంగా కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉపయోగించుకొన్నాడు. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని వదిలివేసి, 1892 లో తిరిగి కనుగొన్నారు. అయితే 14 సంవత్సరాల మనుగడలో దీనిలో ప్రదర్శించిన పరిగణించదగిన శక్తితో బాటుగా అనేక రాజభవనాలు, ప్రజా భవనాలు, మసీదులు ఉన్నాయి. ఇది సైన్యానికి, రాజుల సేవకులకు, మనుగడ నమోదు చేయబడని యావత్తూ జనాభాకు నివాస ప్రాంతంగా ఉంది. ఈ నగరంలోని కేవలం అతి చిన్న ప్రాంత౦లో మాత్రమే తవ్వకాలు జరిపారు. తవ్వబడిన భవనాలలో చాలావరకు బాగా సంరక్షించబడిన పరిస్థితిలో ఉన్నాయి. ఒక రాతి పీఠభూమి పై దీని నిమిత్తం ప్రత్యేకంగా సృష్టించబడిన ఒక కృత్రిమ సరస్సు దగ్గరలో ఈ నగరం ఉంది. మూడు వైపులా 6 కిలోమీటర్ల గోడతో బ్రహ్మాండమైన స్తంభాలు, అన్నింటికంటే బాగా పరిరక్షించబడిన ఆగ్రా ద్వారంతో కూడిన ఏడు ద్వారాలతో ఈ నగరం సుసంపన్నమైంది.

ఫతేపూర్ సిక్రి లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఇక్కడి ఎరుపు ఇసుక రాయితో నిర్మించిన ప్రసిద్ధ కట్టడాలన్ని హిందూ, పర్షియన్, భారత-ముస్లిం సంప్రదాయాలను తమ నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి. బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని కట్టడాలలో అక్బర్ తీర్పులు ఇచ్చిన అనేక వరండాల వరుసలు చుట్టూ ఉన్న దివాన్-ఏ-ఆమ్ లేదా సామాన్య ప్రజానీకానికి చెందిన మందిరం ఉంది. దివాన్-ఏ-ఆమ్ నుండి దౌలత్ ఖానా లేదా రాచరిక భవనాన్ని చూడవచ్చు. రాంచ్ మహల్ లో ఉన్న నాలుగు అంతర్గత అంతస్థులు జోధాబాయి భవనం, అనూప్ తలావ్ మంటపం లేదా టర్కిష్ సుల్తానా, బీర్బల్ భవనం కొన్ని బౌద్ధ ఆలయాల శైలిని ప్రతిబింబిస్తు౦టాయి.

మక్కా అంతటి శ్రేష్టతకు అర్హత కలివిగా శాసనాలలో అంకితంచేసిన గ్రేట్ మసీదు, జామా మసీదు కూడా ఫతేపూర్ సిక్రి నివాసమైన అనేక ధార్మిక కట్టడాలలో ఉన్నాయి. ఈ మసీదు జహంగీర్ మరింతగా మెరుగులు అద్దించిన ఒక అద్భుతమైన కళాఖండ౦ షేక్ సలీం సమాధికి నివాసం

గుజరాత్ పై 1572 లో సాధించిన విజయాల సందర్బంగా ఏర్పాటుచేసిన బులంద్ దర్వాజా కూడా చెప్పుకోదగినదే. ఇతర గుర్తించదగిన కట్టడాలలో ఇబాదత్ ఖానా, అనూప్ తలావ్, హుజ్రా-ఏ-అనూప్ తలావ్, మరియం-ఉజ్-జామాని భవనం ఉన్నాయి.

ప్రస్తుతం ఫతేపూర్ సిక్రీ ఒక నిర్మానుష్య నగరం, కాని కట్టడాలన్ని ఒక పరిపూర్ణ సంరక్షణ స్థితిలో ఉన్నాయి. ఈ నగరాన్ని అన్వేషించండి. గత కాలపు చారిత్రిక వైభవాన్ని మీరు సులువుగా ఊహించి కనుగొనగలరు.

ఫతేపూర్ సిక్రీ చేరడం

ఫతేపూర్ సిక్రీకి చక్కటి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. దగ్గరి విమానాశ్రయం ఆగ్రాలో ఉంది.

సందర్శనకు ఉత్తమ సమయం

నవంబర్, ఏప్రిల్ మధ్య కాలం ఫతేపూర్ సిక్రీ సందర్శనకు ఉత్తమమైనది.

ఫతేపూర్ సిక్రీ చేరడం ఎలా

ఫతేపూర్ సిక్రీ ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానమే కాక ఆగ్రాకు దగ్గరగా ఉన్నందున తాజ్ మహల్ చూడటానికి వచ్చినవారి జాబితాలో సాధారణంగా ఇది ఉంటుంది.

ఫతేపూర్ సిక్రి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫతేపూర్ సిక్రి వాతావరణం

ఫతేపూర్ సిక్రి
33oC / 92oF
 • Clear
 • Wind: ESE 10 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫతేపూర్ సిక్రి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఫతేపూర్ సిక్రి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం ద్వారా ఫతేపూర్ సిక్రికి ఆగ్రాతో బాటుగా ఢిల్లీతో సహా పరిసర కేంద్రాల నుండి కూడా రాష్ట్ర రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం నిరంతర౦ ఉంటుంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు సౌకర్యం ఉన్న ఆగ్రా కాంట్ అతి దగ్గరి రైలు స్టేషన్.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా ఆగ్రా కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరియ అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడి నుండి మీరు అద్దె టాక్సీలలో ఫతేపూర్ సిక్రీ చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Mar,Sat
Check Out
18 Mar,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun
 • Today
  Fatehpur Sikri
  33 OC
  92 OF
  UV Index: 9
  Clear
 • Tomorrow
  Fatehpur Sikri
  22 OC
  72 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Fatehpur Sikri
  24 OC
  76 OF
  UV Index: 9
  Partly cloudy