Search
 • Follow NativePlanet
Share

ఝజ్జర్  – ఝజ్జర్ లో పక్షుల సమావేశ౦!

14

ఝజ్జర్, హర్యానా రాష్ట్రంలోని 21 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా, ఝజ్జర్ పట్టణంలో ప్రధాన కార్యాలయంతో, 1997 జులై 15 న అవతరించింది. ఈ పట్టణం చ్చాజునగర్ వాలే చ్చాజు చే స్థాపించబడిందని నమ్ముతారు. తరువాత ఈ పేరు ఝజ్జర్ గా మారింది. సహజ ఫౌంటైన్ ఝార్నఘర్ పేరుమీద దీనికి ఈ పేరు వచ్చిందని రెండవ కధ. మూడవ వెర్షన్ ఒక నీటి పాత్రకు ఝజ్జర్ అని పేరుపెట్టారు, ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఉపరితల డ్రైనేజ్ సింక్ లోకి వెళ్ళినట్లుగా పట్టణం చుట్టూ ప్రవహిస్తుంది.

ఝజ్జర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఝజ్జర్ ప్రకృతి ప్రేమికులకు ఎంతో అందిస్తుంది. జిల్లాలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటైన భిన్దవాస్ పక్షుల అభయారణ్యం, ఢిల్లీ నుండి కేవలం 3 గంటల ప్రయాణంలో ఉంది. ఇది 1074 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 250 కంటే ఎక్కువ జాతులు, షుమారు 35,000 రకాల వలస నీటి పక్షులను కలిగిఉండి ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఈ అభయారణ్యం లో ఒక సరస్సు కూడా ఉంది, దీని చుట్టూ నీటిని ఆపడానికి మనిషి తయారుచేసిన 12 కిలోమీటర్ల ఆనకట్ట ఉంది. దేవాలయాలు భారతదేశంలోని అన్ని నగరాలూ, పట్టణాల స్థలాన్ని గౌరవంగా ఆక్రమిస్తాయి, ఝజ్జర్ దీనికి మినహాయింపు కాదు. బేరి పట్టణంలో బేరి ఆలయం ప్రత్యేకంగా చెప్పదగ్గది. ఈ ఆలయంలో పాండవుల కుటుంబ దేవత లేదా కులదేవత అయిన భిమేశ్వరి దేవి విగ్రహం ఉంది. కౌరవుల తల్లి రాణి గాంధారి బేరి చెట్టు పక్కన ఆ ప్రదేశం వద్ద ఒక ఆలయాన్ని నిర్మించిందని నమ్ముతారు. ఈ ఆలయం ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వివాహ జంటలు వారి ప్రతిజ్ఞను పునరుద్దరించుకుంటారని గౌరవించబడుతుంది.

కాస్త ప్రశాంతమైన క్షణాల కోసం ఎదురుచూసేవారు ఝజ్జర్ లోని బువ వాలా తాలాబ్ వద్ద ఓదార్పు పొందుతారు. పురాణాల ప్రకారం, విషాదంతో ముగిసిన ప్రేమ జంట పేరుతో దీనికి ఆ పేరువచ్చింది. ఈ స్థలం చాలా ప్రశాంతమైన, రద్దీ నుండి దూరంగా విశ్రాంతిని పొందే ఒక గొప్ప ప్రదేశం.

గురుకుల పురావస్తు మ్యూజియం ప్రస్తావనకు అర్హతపొందిన మరో ఆకర్షణ. ఈ మ్యూజియం, దాని ప్రస్తుత డైరెక్టర్ స్వామి ఓమనంద్ సరస్వతి 1959 లో దీనిని స్థాపించారు, ఝజ్జర్, హర్యానాలో అతిపెద్దదిగా అభివృద్ది చెందింది. ఇక్కడ రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లోని బరేలి తోసహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పురాతన విగ్రహాలు, నాణేల భారీ కలగలుపు ఉంది.

ఝజ్జర్ సందర్శనకు ఉత్తమ సమయం

అక్టోబర్, మార్చ్ మాసాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఝజ్జర్ సందర్సన సరైనది.

ఝజ్జర్ చేరుకోవడం ఎలా

ఝజ్జర్ భారతదేశంలోని అన్ని నగరాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

ఝజ్జర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఝజ్జర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఝజ్జర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఝజ్జర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా ఝజ్జర్ జిల్లా ఢిల్లీ తో దాని సరిహద్దుని పంచుకుంది, ఇది దేశ రాజధాని న్యూ ఢిల్లీ నుండి 72 కిలోమీటర్ల దూరంలో 71-A జాతీయ రహదారిపై ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా *ఝజ్జర్ లో రైల్వే స్టేషన్ లేదు రోహ్తక్ జంక్షన్ సమీప రైలు కేంద్రం, ఢిల్లీ నుండి, భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి రైళ్ళ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రోహ్తక్ నుండి, ఝజ్జర్ కేవలం 30 నిమిషాల ప్రయాణం.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా దీనికి సమీప విమానాశ్రయం న్యూ ఢిల్లీ. ఢిల్లీ నుండి, ఝజ్జర్ షుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఝజ్జర్ చేరుకోవడానికి స్థానిక లేదా ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Jan,Wed
Check Out
20 Jan,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu