బృందావనం - బృందావన్ వద్ద దివ్య నృత్య రాసలీలలు !

బృందావనం అనేది కృష్ణుడు యమునా నది ఒడ్డున తన బాల్యం గడిపిన ప్రదేశము. ఇక్కడ హిందువులు పూజలు చేస్తారు. ఈ బృందావనంలో రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీలల ద్వారా చెప్పెను. గోపికలు స్నానము చేస్తుంటే వారి బట్టలు దొంగిలించేను. అంతే కాకుండా అనేక రాక్షసులను నాశనం చేసెను. బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము మరియు దాని గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 దేవాలయాలు ఇక్కడ ఉండటము గొప్ప ఆశ్చర్యమునకు గురి చేస్తుంది.

బృందావనం కొంత వరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. కానీ 1515 వ సంవత్సరంలో లార్డ్ చైతన్య మహాప్రభు ద్వారా తిరిగి ఆవిష్కరించబడింది. ఆయన బృందావనం యొక్క పవిత్రమైన అడవులలో పరిభ్రమిస్తూ మరియు అతని ఆధ్యాత్మిక శక్తులతో పట్టణం మరియు చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాలను గుర్తించగలిగారు. అప్పటి నుండి బృందావనంను వారి జీవితకాలంలో కనీసం ఒకసారి సందర్శించాలని గొప్ప హిందూ మతం సెయింట్స్ అనుకుంటారు. మీరు పట్టణము సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు రాదే కృష్ణా అని పఠించడం చూడవచ్చు.

బృందావనం మరియు పరిసరాలలోని పర్యాటక ప్రదేశాలు

పైన చెప్పిన విధంగా బృందావనం గురించి చెప్పే 5000 దేవాలయాలు మరియు హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్ర కేంద్రాలలో ఒకటిగా ఉన్నది. మొఘల్ పాలకుల కాలంలో ముఖ్యంగా ఔరంగజేబు కొన్ని దేవాలయాలను నాశనం చేసెను. అయితే కొన్ని దేవాలయాలు చాలా పురాతనమైనవి. వాటి నుండి లార్డ్ కృష్ణుడు యొక్క జీవితం నుండి వివిధ చమత్కారాలను తెలుసుకోవచ్చు. ఇంకా ప్రముఖ దేవాలయాలు బ్యాంకే బిహారీ దేవాలయం, రంగ్జి ఆలయం, గోవింద్ దేవ్ ఆలయం మరియు మదన్ మోహన్ ఆలయం ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇస్కాన్ ఆలయం శాంతి మరియు జ్ఞానోదయం యొక్క శోధన లో విదేశీ సందర్శకులను ఆకర్షిస్తుంది. వేద జ్ఞానం మరియు శ్రీమద్ భగవద్ గీత బోధన ఆంగ్లంలో చేయబడతాయి.

దేవాలయాల్లో రాధా గోకులానంద ఆలయం మరియు శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయము ముఖ్యమైనవి. ఇవి లార్డ్ కృష్ణుడు యొక్క భార్య, రాధా లకు అంకితం చేయబడినవి. అష్ట సఖి మరియు కృష్ణ మధ్య ప్రేమ నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన రాధా మరియు ఎనిమిది స్నేహితులను సూచిస్తుంది.

అంతే కాకుండా దేవాలయాల దగ్గర ఉన్న కేసి ఘాట్ కూడా మీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. హిందూ మత నమ్మకం ప్రకారం పవిత్ర యమునా నదిలో ఒక స్నానం ఆచరించుట వల్ల అన్ని పాపాలు పోతాయని ఒక నమ్మకము. ఈ ఘాట్ దగ్గర తమ పాపాలను పోగొట్టుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ అనేక ఆచారాలు మరియు సాయంత్రం హారతి (అగ్ని ఆరాధన) కూడా నిర్వహిస్తారు.

బృందావనం చేరుకోవడం ఎలాబృందావనంను విమాన , రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం ఢిల్లీలో ఉంది.

బృందావనం సందర్శించడానికి ఉత్తమ సమయంబృందావనం సందర్శించడానికి అనువైన సమయం నవంబర్ మరియు మార్చి మధ్య ఉంది.

Please Wait while comments are loading...