మొరాదాబాద్ - ‘సిటీ ఆఫ్ బ్రాస్’

మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని అదే పేరుగల జిల్లాలోని ఒక నగరం. షాజహా రాజు కుమారుడు యువరాజు మురాద్ దీనిని స్థాపించాడు, దీని 1600 మూలాలూ గుర్తించబడ్డాయి. మురాదాబాద్ భారతదేశంలోని ఇత్తడి పరిశ్రమకు కేంద్రం, అందువలన దీనికి పిటల్ నగరి లేదా ‘సిటీ ఆఫ్ బ్రాస్’ అనే ముద్దుపేరు ఉంది.

చరిత్ర

రికార్డుల ప్రకారం 1632వ సంవత్సరంలో మొఘల్ రాజు షాజహాన్ రుస్తం ఖాన్ ని నియమించి ఈ ప్రాంతాన్ని కబ్జా చేసుకుని, కోటని స్థాపించి రుస్తం నగర్ అని పేరుపెట్టాడు. అయితే షాజహాన్ కొడుకు మురాద్ బక్ష్ పేరుతో ఈ ప్రాంతానికి మొరాదాబాద్ అని నామకరణంచేసారు, ఇప్పటికీ ఈ పేరుతో నగర౦ నిర్వహించబడుతుంది. 1637 లో షాజహాన్ జామా మసీదుని ఏర్పాటుచేసారు. మొరాదాబాద్ రామగంగా నదికి పశ్చిమాన ఉంది.

పైన చెప్పినట్లు, ఈ నగరం ప్రపంచం మొత్తం మీద ఇత్తడి పనికి పేరుగాంచింది. ఇది హస్తకళా పరిశ్రమలో కూడా సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది, దాని ఉత్పత్తులు యు ఎస్ ఏ, బ్రిటన్, కెనడా, జర్మనీ, మధ్యప్రాశ్చ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి, వాల్మార్ట్, టేస్కో వంటి దుకాణాలలో కూడా ఈ వస్తువులు ఈ ప్రాంత గొప్పతనాన్ని చాటిచూపుతున్నాయి.

మొరాదాబాద్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఇత్తడి పరిశ్రమే కాకుండా, మొరాదాబాద్ అనేక ప్రదేశాలను కూడా సందర్శకులకు అందిస్తుంది. భారతదేశం లోని ఇతర నగరాలూ, పట్టణాల వలె, ఆలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు సమాజాన్ని పటిష్ఠంగా ఉంచుతున్నాయి. ఇక్కడ సీతా ఆలయం, పెద్ద హనుమంతుడి ఆలయం, చదౌసి – కుంజ్ బిహారి ఆలయం, సాయి ఆలయం, పాటలేశ్వర్ ఆలయం, శని దేవుని ఆలయం తోపాటు కొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఉన్నాయి.

భారతదేశ చరిత్రలో మొఘల్ వంశానికి చెందిన అనేక స్మరకలు నిర్దిష్ట కాల సాక్ష్యాలుగా నిలబడ్డాయి. వాటిలో నజిబుదౌలా ఫోర్ట్, మందవర్ మహల్, జామా మసీదు అత్యంత ప్రసిద్ది చెందినవి.

సందర్శకులు మొరాదాబాద్ లో సమీపంలోని చనౌసి (చంద్ అంటే చందుడు, చందౌసి అంటే చంద్రుడు వంటి) కూడా చూడవచ్చు. ఈ అందమైన పట్టణం పుదీనా మొక్కలను భారీస్థాయిలో పండిస్తుంది, ఇక్కడి ప్రధాన ఉత్పత్తి పుదీనా నూనె. ఈ పట్టణం రాంబాఘ్ ధాం, కుంజ్ బిహారి ఆలయం, వేణుగోపాల్ జి ఆలయం, బ్రాహం దేవ్ జి ఆలయం వంటి అనేక ధార్మిక ప్రదేశాలకు కూడా నిలయంగా ఉంది.

కొంత కుటుంబ ఆనందం, విహారం కోసం, మీకు ప్రేమ వండర్ లాండ్, ప్రేమ వాటర్ కింగ్ డమ్ ప్రధానంగా ఉంది. రాంపూర్ లోని రాజ లైబ్రరీ సాహిత్య అభిమానులను, తవ్వకాలలో దొరికే ఇండో ఇస్లామిక్ చదువును, కళలను సమకూర్చింది.

మొరాదాబాద్ చేరుకోవడం

మొరాదాబాద్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. న్యూ డిల్లీ దీనికి సమీప విమానాశ్రయం.

 

Please Wait while comments are loading...