గోవర్ధనగిరి - శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతం!

మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఒకసారి కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతంను ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు తన చేతులతో పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడెను.

పైన చెప్పిన విధంగా,గోవర్ధన గిరి హిందువులకు ప్రధాన యాత్రా ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. అంతే కాకుండా గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకము. ఇక్కడ ఉన్న దేవుని యొక్క ఒక భారీ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధ్యాత్మికతను పెంచుతుంది.

గోవర్ధనలో చూడవలసినవి

కృష్ణుడుకి అంకితం చేసిన హర దేవాజి దేవాలయం ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఈ ఆలయంలో రాధా మరియు కృష్ణ అందమైన విగ్రహాలు మరియు ఆయన జీవితానికి సంబంధించిన సంఘటనలను చూడవచ్చు. కృష్ణుడు,రాధా మరియు గోపికలను కలిసే రాధా కుండ్ లేదా సరస్సును చూడవచ్చు. తరువాత గోపికలు కృష్ణుడు కోసం ఎదురుచూసే కుసుం సరోవర్ అనే పవిత్ర ట్యాంక్ ఉంది. మన్సి గంగా ట్యాంక్ దేవునితో సంబంధం కలిగిన మరొక ఆనవాలుగా ఉంది.

 

Please Wait while comments are loading...